Nagarjuna Funny Comments on Director: టాలీవుగ్ 'కింగ్' నాగార్జున అక్కినేని నటించిన లేటెస్ట్ మూవీ నా సామిరంగ. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఈ సంక్రాంతికి నాలుగు పెద్ద సినిమాలు విడుదల కాగా అందులో హనుమాన్ పాజిటివ్ టాక్‌తో పాటు అత్యధిక వసూళ్లు సాధించింది. దాని తర్వాత నా సామిరంగకే మంచి టాక్ వచ్చింది. గుంటూరు కారం మిక్స్‌డ్ టాక్ రాగా కలెక్షన్స్ మాత్రం సర్‌ప్రైజ్ చేసింది. నాగార్జున నా సామిరంగ మాత్రం పాజిటివ్ టాక్‌తో పాటు మంచి కలెక్షన్స్ రాబట్టింది.
విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన నా సామిరంగ మంచి పండగలాంటి సినిమా అంటున్నారు ఆడియన్స్. విడుదలై రెండువారాలు గడిచిన ఇప్పటికీ థియేటర్లో 'నా సామిరంగ' మంచి కలెక్షన్స్ రాబడుతుంది. సంక్రాంతికి భారీ సినిమాల పోటీ ఉన్నప్పటికీ నాగ్ పట్టుబట్టి మరి నా సామిరంగ రిలీజ్ చేసి హిట్ కొట్టాడు. చూస్తుంటే నాగార్జున్ సంక్రాంతి పండుగ కలిసోచ్చినట్టు ఉంది. ఎందుకంటే గత మూడేళ్లు సంక్రాంతికి తన సినిమాలు బాక్సాఫీసు బరిలో ఉండేలా చూసుకుంటున్నాడు. హిట్ కూడా కొడుతున్నాడు. ఈసారి కూడా సంక్రాంతి తగ్గేదే లే అంటూ వచ్చి భారీ విజయం అందుకున్నాడు.
Also Read: ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్‌టీఆర్ పాత్రపై రాజమౌళి వ్యాఖ్యలు - రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫైర్
దీంతో కొద్ది రోజులుగా 'నా సామిరంగ' టీం సక్సెస్ సెలబ్రేషన్స్‌లో మునిగితేలుతుంది. తాజాగా మూవీ టీం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నాగార్జకన, డైరెక్టర్ విజయ్ బిన్నీ, హీరో నరేష్, ఇతర మూవీ టీం మెంబర్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ డైరెక్టర్ విజయ్ బిన్నీని ఆటపట్టించాడు. "నేను లేకుండ సక్సెస్ సెలబ్రేషన్ ఎంట్రా.. ఈ రోజు ఈవెంట్ అంటే నాకు నిన్న సాయంత్రం ఫోన్ చేసి చెప్పాడు. అంటే నేను లేకుండానే ఈవెంట్ చేసేద్దామనుకున్నావా?" అంటూ విజయ్‌ని కాసేపు ఆటాడుకున్నాడు నాగ్. ఆ తర్వాత కొరియోగ్రాఫర్ విజయ్ తొలి ప్రయత్నంలోనే డైరెక్టర్‌గా సక్సెస్ అయ్యాడంటూ అతడిపై ప్రశంసలు కురిపించాడు.
ఈ సినిమా మొత్తాన్ని ఓ పాటగా తీశాడని అన్నాడు. తను లోపలికి వస్తుంటే విజయ్‌తో పాటు ఇక్కడ ఉన్న వారంత హ్యాపీగా నవ్వుతూ కనిపించారు. అప్పుడే నాకు మా సినిమా సక్సెస్ అయ్యిందని అనిపించిందన్నాడు. కాగా ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకుడిగా మారి నా సామిరంగను రూపొందించాడు. ఫస్ట్ ప్రయత్నంలోనే విజయ్ బిన్నీ సక్సెస్ అయ్యాడు. పక్కా సంక్రాంతి సినిమాగా విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో 'నా సామిరంగ'ను తెరకెక్కించాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఇంఉదలో ఆషికా రంగనాథ్ హీరోయిన్‌గా నటించగా.. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రలో నటించారు.