Prabhas Salaar Movie makers for Akhil’s next : అక్కినేని అఖిల్ కెరీర్ పరంగా మంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు  ఇప్పటివరకు అఖిల్ 5 సినిమాలు చేశాడు. వాటిలో ఏ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది ఎన్నో అంచనాలతో వచ్చిన 'ఏజెంట్' డిజాస్టర్ గా నిలిచింది. 'ఏజెంట్'తో సాలిడ్ హిట్ అందుకోవాలి అనుకున్నా, ప్రేక్షకులను అలరించడంలో ఈ సినిమా ఘోరంగా విఫలం అయ్యింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సుమారు రూ.80 కోట్ల భారీ బడ్జెట్ తో ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ సినిమాని నిర్మించారు. రిలీజ్ కి ముందు పాన్ ఇండియా రేంజిలో సత్తా చాటుతుందనే ప్రచారం జరిగినా, అఖిల్‌ కెరీర్‌లోనే భారీ డిజాస్టర్‌ గా నిలిచిపోయింది.


ఏజెంట్ రిజల్ట్ తో డిప్రెషన్ లోకి వెళ్లిన అఖిల్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఇక గత కొద్దిరోజుల నుంచి అఖిల్ తన తదుపరి సినిమాపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అయితే రీసెంట్ గా 'సలార్' సక్సెస్ పార్టీలో అఖిల్ కనిపించడం ఎన్నో రకాల అనుమానాలకు దారి తీసింది. సలార్ సక్సెస్ పార్టీలో అఖిల్ కనిపించడంతో సలార్ సీక్వెల్లో అఖిల్ నటిస్తున్నాడని, అందుకే సక్సెస్ పార్టీకి తను కూడా అటెండ్ అయ్యాడు అంటూ ఓ న్యూస్ బాగా వైరల్ అయ్యింది. తర్వాత అది నిజం కాదని క్లారిటీ వచ్చింది. అసలు సలార్ సక్సెస్ పార్టీలో అఖిల్ కనిపించడం వెనుక అసలు స్టోరీ ఏంటంటే.. అఖిల్ తో సలార్ నిర్మాత ఓ సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది.


సౌత్ లో సక్సెస్‌ఫుల్ ప్రొడక్షన్ హౌస్ గా ముందుకు వెళ్తున్న హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ లో అఖిల్ నెక్స్ట్ సినిమా ఉండబోతుందట. అనిల్ కుమార్ అనే నూతన దర్శకుడు ఈ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టులో యూవీ క్రియేషన్స్ కూడా భాగస్వామ్యం అవుతున్నారు. ఈ సినిమా చర్చల్లో భాగంగానే అఖిల్ సలార్ సక్సెస్ పార్టీలో కనిపించాడని తాజా సమాచారం బయటకు వచ్చింది. హోంబలే ఫిలిమ్స్ ఇప్పటివరకు నిర్మించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్ అందుకున్నాయి. అలాంటి టాప్ ప్రొడక్షన్ హౌస్ లో నెక్స్ట్ సినిమా ఉండడంతో ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.


అంతేకాకుండా కచ్చితంగా ఈసారి అయ్యగారికి సాలిడ్ హిట్ గ్యారెంటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక అఖిల్ చేయబోయే ప్రాజెక్ట్ పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో సోషియో ఫాంటసీ కథగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. సాహో సినిమాకి దర్శకత్వ శాఖలో పనిచేసిన అనిల్ కుమార్ ఈ సినిమాతో టాలీవుడ్ కి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సుమారు రూ.200 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాని రూపొందిస్తున్నారట. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. సమ్మర్లో ఈ ప్రాజెక్టుని పట్టాలెక్కించి 2025లో సినిమాని రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


Also Read : రాత్రికి రెడీగా ఉండండి, ‘యానిమల్’పై నెట్‌ఫ్లిక్స్ స్పెషల్ పోస్ట్ - స్ట్రీమింగ్‌పై ఆసక్తికర అప్డేట్