School Movie First Look: సీనియర్ హీరోయిన్ భూమిక.. చాలాకాలం తర్వాత సినిమాల్లో మళ్లీ యాక్టివ్ అయ్యింది. ప్రస్తుతం ఏడాదికి కనీసం ఒకట్రెండు సినిమాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం తను ఎక్కువగా సినిమాల్లో కీలకంగా ఉన్న పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ ముందుకెళ్తోంది. తాజాగా అదే తరహాలో మరో పాత్రకు ప్రాధాన్యత ఉన్న పాత్రను ఎంచుకొని షూటింగ్‌ను ప్రారంభించింది. అదే ‘స్కూల్’. భూమిక లీడ్ రోల్ చేస్తున్న ఈ మూవీలో యోగి బాబు, కేఎస్ రవికుమార్ కూడా ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదల అవ్వడంతో పాటు పూజా కార్యక్రమాలతో షూటింగ్‌ను కూడా ప్రారంభించారు మేకర్స్.
ఆసక్తికరంగా ఫస్ట్ లుక్..
ఆర్ కే విద్యాధరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమే ‘స్కూల్’. డిఫరెంట్ సినిమాలను తెరకెక్కిస్తారని ఇప్పటికే విద్యాధరన్‌కు కోలీవుడ్‌లో మంచి గుర్తింపు ఉంది. ఇప్పుడు అదే తరహాలో ‘స్కూల్’ అనే మరో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తాజాగా విడుదలయిన ఈ మూవీ ఫస్ట్ లుక్‌లో ఒక పేజీ కాలిపోతూ ఉంటుంది. కాలిపోతున్న ఆ పేజీపైనే భూమిక, యోగి బాబు, రవికుమార్ ఫోటోలు ఉంటాయి. ఇక ఈ సినిమా ట్యాగ్ లైన్‌గా ‘ఏ డీప్ సైకాలజీ మూవీ’ అని ఉంది. దీన్ని బట్టి చూస్తే మూవీలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు.
విద్యార్థుల దృష్టికోణంలో సినిమా..
తాజాగా జరిగిన ప్రెస్ మీట్‌లో ‘స్కూల్’ గురించి పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టారు మేకర్స్. ఇది పూర్తిగా స్కూల్ నేపథ్యంలో సాగే కథ అని అన్నారు. ఈరోజుల్లో స్కూల్స్‌లో జరుగుతున్న అవినీతి, అక్రమాల గురించి చెప్తూ.. ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా ఈ మూవీని రూపొందిస్తున్నామని అన్నారు. ప్రస్తుతం బయట సమాజంలో జరుగుతున్న ఆత్మహత్యలు, ప్రమాదాలు, అన్యాయాల పట్ల విద్యార్థుల దృష్టికోణం ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపిస్తామని మేకర్స్ చెప్తున్నారు. ‘స్కూల్’లో భూమిక, యోగిబాబు.. ఇద్దరూ టీచర్లగానే కనిపించనున్నారు. ఇక కేఎస్ రవికుమార్ ఒక ఇన్వెస్టిగేటివ్ పాత్రను పోషించనున్నారు. పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న వెంటనే ‘స్కూల్’ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకుంది.
కోలీవుడ్‌లోనే మోస్ట్ వాంటెడ్ కమెడియన్..
ప్రస్తుతం కోలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ కమెడియన్‌గా బిజీ కెరీర్‌ను గడిపేస్తున్నాడు యోగి బాబు. కమెడియన్‌గా మాత్రమే కాకుండా అప్పుడప్పుడు కొన్ని కామెడీ చిత్రాల్లో లీడ్ రోల్స్ కూడా చేస్తుంటాడు. ఇప్పటికే యోగి బాబు లీడ్ రోల్ చేసిన ‘లోకల్ సరక్కు’ అనే చిత్రం జనవరి 26న థియేటర్లలో విడుదలకు సిద్ధమయ్యింది. స్టార్ హీరో, యంగ్ హీరో అని తేడా లేకుండా.. అందరు హీరోల సినిమాల్లో కామెడీ పాత్రలు చేస్తూ క్షణం కూడా తీరిక లేకుండా బిజీగా ఉన్నాడు యోగిబాబు. ఈ కమెడియన్ ఉంటే సినిమాలో కామోడీ బాగుంటుంది అని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయే స్థాయికి చేరుకున్నాడు. ఇక అలాంటి కమెడియన్ ఇప్పుడు ‘స్కూల్’ అనే ఒక డిఫరెంట్ సైకలాజిక్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
Also Read: ‘ఆహా’లో బోల్డ్ ఫిల్మ్ - ఇంట్రెస్టింగ్‌గా ఫస్ట్ లుక్