Mrunal About Family Star: మృణాల్‌ ఠాకూర్‌.. తన అందం, అభినయంతో కుర్రకారును ఉర్రూతలూగించిన హీరోయిన్‌. 'సీతారామం', 'హాయ్‌ నాన్న' సినిమాలతో ఫ్యామిలీ ప్రేక్షకుల అభిమాన నటి అయిపోయారు మృణాల్‌. సీతగా, యశ్నాగా తన పాత్రల్లో ఇమిడిపోయి, తెలుగింటి అమ్మాయిగా అందరి మనసుల్లో నిలిచిపోయింది ఈ మరాఠి అమ్మాయి. తన నటనతో, తన ప్రేమతో ఎంతోమంది ఏడిపించేసింది. అయితే, ఇప్పుడు తన నెక్ట్స్‌ మూవీ మాత్రం అలా కాదంటోంది. తర్వాతి సినిమాలో చాలా డిఫరెంట్‌గా తన రోల్‌ ఉండబోతోందని, అంతా ఎంటర్‌టైన్మెంట్‌.. ఎంటర్‌టైన్మెంట్‌.. ఎంటర్‌టైన్మెంట్‌ అని తన సినిమాకి సంబంధించి కొన్ని విషయాలను పంచుకున్నారు మృణాల్‌.


'ఫ్యామిలీస్టార్‌' చాలా ఫన్‌.. 


మృణాల్‌ ఠాకూర్‌ తెలుగులో నటించిన రెండు సినిమాల్లో ఫ్యామిలీ ఆడియెన్స్‌ని ఆకట్టుకునే పాత్రలే చేశారు. 'సీతారామం'లో సీతగా, 'హాయ్‌నాన్న'లో యశ్నగా ఎమోషన్స్‌ని పండింది ఏడిపించేశారు. అయితే, ఇప్పుడు 'ఫ్యామిలీ స్టార్‌'లో మాత్రం అలాకాదని, ఆ సినిమాకి సంబంధించి క్రేజీ విషయాలను పంచుకున్నారు. మృణాల్‌ ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ఈ విషయాలు చెప్పారు. 


"ఇప్పటి వరకు అన్ని ఎమోషనల్‌ క్యారెక్టర్స్‌లో నటించాను. చాలామంది మమ్మల్ని ఏడిపించేశారు. ఫ్యాన్స్‌కి టిష్యూస్‌ డబ్బ.. గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు కదా అని ఒక ఇంటర్వ్యూలో కూడా అన్నారు. ఎందుకంటే యశ్నా, సీత రెండు క్యారెక్టర్స్‌ అలాంటివి. కానీ, 'ఫ్యామిలీ స్టార్‌'లో మాత్రం అలాకాదు. దీంట్లో అన్ని ఉంటాయి. డ్యాన్స్‌, పాటలు, ఫన్‌ అన్నీ కనిపిస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే 'ఎంటర్‌టైన్మెంట్‌, ఎంటర్‌టైన్మెంట్‌, ఎంటర్‌టైన్మెంట్‌' అంతే. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్‌ అవుతుందా అని నాకు ఎగ్జైటింగ్‌గా ఉంది. ఎందుకంటే.. ఈ సినిమా పరశురామ్‌ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. అంత బాగా తీశారు డైరెక్టర్‌ పరశురామ్‌. ఆయన నాకు చాలామంచి ఫ్రెండ్‌ అయిపోయారు. ఆయనతో వర్క్‌ చేయడం నిజంగా చాలా ఇన్‌స్పైరింగ్‌గా అనిపిస్తుంది. పైగా ఈ సినిమాలో విజయ్‌ ఉన్నారు. మేమంతా సెట్స్‌లో బాగా ఎంజాయ్‌ చేస్తాం. రోహినీ ముఖ్యమైన పాత్రపోషిస్తున్నారు ఈ సినిమాలో. ఆమెతో వర్క్‌ చేయడం చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ఒక మరాఠి అమ్మాయి తెలుగులో ఇంత పాపులర్‌ ఎలా అయ్యింది? అంటూ ఆమె కాంప్లిమెంట్స్‌ ఇచ్చారు. ఈ సినిమా కచ్చితంగా మిమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేస్తుంది. ఈ సినిమాలో మీరు నన్ను ఒక డిఫరెంట్‌ అవతార్‌లో చూస్తారు. మునుపు ఎన్నడు చూడని విధంగా చూస్తారు" అంటూ క్రేజీ విషయాలు చెప్పారు మృణాల్‌.


ఇక తెలుగులో పాటు హిందీలో తాను లీడ్‌రోల్‌ ప్లే చేస్తున్న 'పూజా మేరీ జాన్‌' సినిమా కూడా త్వరలోనే రిలీజ్‌ కానున్నట్లు చెప్పారు మృణాల్‌. పూజా అనే అమ్మాయి జీవితం చుట్టూ తిరుగుతుంది ఈ సినిమా. ప్రముఖ డైరెక్టర్లు నవ్‌జోత్‌ గులాటి, విపాషా అర్వింద్ దీన్ని తెరకెక్కిస్తుండగా.. హ్యుమా ఖురేషి, విజయ్‌రాజ్‌ కీ రోల్స్‌ ప్లే చేస్తున్నారు. ఇక 'ఫ్యామిలీస్టార్‌' సినిమా ఏప్రిల్‌ 5న రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎన్టీఆర్‌ 'దేవర ' సినిమా రిలీజ్‌ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాని విడుదల చేసేందుకు సన్నహాలు జరగుతున్నట్లు తెలుస్తోంది.


Also Read: ‘సలార్’ పాన్ ఇండియా మూవీ కాదు, అంతకు మించి - ఫ్యాన్స్‌కు పండగలాంటి వార్త