Animal On Netflix: రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘యానిమల్’ మూవీని ఓటీటీలో చూడడానికి ప్రేక్షకులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుందని ఎప్పుడో అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. కానీ ఓటీటీ రిలీజ్ డేట్‌పై మాత్రం సరిగా క్లారిటీ లేదు. మధ్యలో సినిమా కో ప్రొడ్యూసర్స్ అయిన Cine1 స్టూడియోస్‌తో మేకర్స్‌కు అయిన లీగల్‌గా ఇబ్బందులు ఎదురవ్వడంతో ‘యానిమల్’ ఓటీటీ రిలీజ్‌పై అనుమానాలు మొదలయ్యాయి. ఇంతలోనే ఈ మూవీ ఓటీటీ రిలీజ్ గురించి క్రేజీ అప్డేట్ బయటికొచ్చింది. ఈ విషయంలో నెట్‌ఫ్లిక్స్.. ఒక క్లారిటీ ఇచ్చేసింది.
మరో 8 నిమిషాలు..
సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన ‘యానిమల్’ మూవీ 3 గంటల 21 నిమిషాల నిడివితో థియేటర్లలో విడుదలయ్యింది. అయితే అందులో తనకు ఇష్టం లేకపోయినా కొన్ని సీన్స్‌ను కట్ చేశానని, ఆ సీన్స్‌ను ఓటీటీ రిలీజ్‌లో యాడ్ చేశానని సందీప్ ముందే అనౌన్స్‌మెంట్ ఇచ్చేశాడు. ఇక ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవ్వడానికి సిద్ధమవ్వడంతో మరో 8 నిమిషాలను కూడా దీనికి జతచేశారట. అంటే ఇప్పుడు పూర్తిగా 3 గంటల 29 నిమిషాలు ఉన్న ‘యానిమల్’ స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యింది. జనవరి 26 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో ‘యానిమల్’ స్ట్రీమ్ అవుతుందని స్పెషల్ పోస్ట్ ద్వారా అనౌన్స్ చేసింది నెట్‌ఫ్లిక్స్ టీమ్.
సిద్ధంగా ఉండండి..
‘‘గాలి దట్టంగా మారింది. టెంపరేచర్ పెరిగిపోతోంది. యానిమల్‌లో తన క్రూరత్వాన్ని చూడండి. జనవరి 26 నుండి హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది’’ అంటూ నెట్‌ఫ్లిక్స్ టీమ్ సోషల్ మీడియాలో అనౌన్స్ చేసింది. దాంతో పాటు సినిమాకు సంబంధించిన ఒక స్పెషల్ వీడియోను కూడా అటాచ్ చేసింది. దీంతో ‘యానిమల్’ మూవీ లవర్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. అప్పుడే ‘యానిమల్ ఆన్ నెట్‌ఫ్లిక్స్’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్విటర్‌లో ట్రెండ్ మొదలుపెట్టారు. రణబీర్ కపూర్‌ను మరోసారి ‘యానిమల్’ లుక్‌లో చూడడానికి ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
యాక్టర్లు అందరికీ ప్రాధాన్యత..
ప్రపంచవ్యాప్తంగా ‘యానిమల్’ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 915 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇందులో రణబీర్ కపూర్ హీరోగా నటించగా తనకు జోడీగా రష్మిక మందనా కనిపించింది. మరొక ముఖ్య పాత్రలో హీరోయిన్ తృప్తి దిమ్రీ అలరించింది. హీరోయిన్‌గా ‘యానిమల్’తో రష్మికకు ఎంత గుర్తింపు వచ్చిందో.. అంతకంటే ఎక్కువ పాపులారిటీ తృప్తికి దక్కింది. ఈ ఒక్క సినిమాతో తృప్తి.. ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీ అయిపోయింది. ఇక వీరితో పాటు అనిల్ కపూర్, బాబీ డియోల్ కూడా ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. స్క్రీన్‌పై కనిపించిన ప్రతీ పాత్రకు ప్రాధాన్యత ఇస్తూ.. యాక్టర్లకు మంచి హిట్‌ను అందించాడు సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమాకు విమర్శలు ఎదురైనా కూడా తాను మాత్రం అందరికీ సమాధానం ఇస్తూ 2024లోనే అతిపెద్ద హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. దీంతో మరోసారి టాలీవుడ్‌లో మాత్రమే కాకుండా బాలీవుడ్‌లో కూడా సందీప్ రెడ్డి వంగా అనే పేరు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది.
Also Read: రామ్ చరణ్ నన్ను కొట్టారు - RAM మూవీ హీరో సూర్య వ్యాఖ్యలు