Vishwak Sen controversial tweet : 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాను డిసెంబర్ 8న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే వాయిదా వేసినట్లు ఆ సినిమా దర్శక, నిర్మాతలు చెప్పలేదు. కానీ, వాయిదా పడుతుందేమో అని హీరో విశ్వక్ సేన్ మదిలో సందేహం కలిగింది. అందుకు కారణం ఏమిటంటే... 'సలార్' విడుదల తేదీలో మార్పు!
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' విడుదల తేదీ డిసెంబర్ 8 అని అనౌన్స్ చేసినప్పుడు... ఆ తేదీకి మూడు నాలుగు సినిమాలు లేవు. వరుణ్ తేజ్ 'ఆపరేషన్ వేలంటైన్' ఒక్కటే ఉంది. అప్పటికి సలార్ విడుదల తేదీ 'సలార్' సెప్టెంబర్ 28. నాని 'హాయ్ నాన్నా', నితిన్ 'ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్' సినిమాలు క్రిస్మస్ సీజన్ టార్గెట్ చేశాయి. ఎప్పుడు అయితే 'సలార్' డిసెంబర్ 22కి వెళ్ళిందో... ఆ తర్వాత పరిస్థితులలో మార్పు వచ్చింది. డిసెంబర్ 7కు 'హాయ్ నాన్నా', 8కి 'ఎక్ట్రా' వచ్చాయి. దాంతో విశ్వక్ సేన్ చేసిన ట్వీట్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమా విడుదల వాయిదా పడొచ్చనే డౌట్ కలిగించింది.
విశ్వక్ సేన్ డిలీట్ చేసిన పోస్టులో ఏముంది?
"బ్యాగ్రౌండ్ (సినిమా ఇండస్ట్రీలో పేరున్న ఫ్యామిలీ) లేకపోతే ప్రతి నా కొడుకు మన గేమ్ మారుద్దామని అనుకుంటాడు. నేను సినిమా చూడకుండా ప్రతి ఫ్రేమ్ ప్రాణం పెట్టి పని చేసే చెబుతున్నా. డిసెంబర్ 8 వస్తున్నాం. హిట్, ఫ్లాప్, సూపర్ హిట్, అట్టర్ ప్లాప్ మీ (ప్రేక్షకుల) డెసిషన్! ఆవేశంలోనో లేదా ఇగోకి పోయి తీసుకునే డెసిషన్ కాదు. తగ్గే కొద్దీ మింగుతారని అర్థమైంది. డిసెంబర్ 8 శివాలెత్తి పోద్ది. గంగమ్మ తల్లికి నా ఒట్టు. మహాకాళి మాతో ఉంది. డిసెంబర్ కాకపోతే నన్ను #GOG ప్రచార కార్యక్రమాల్లో చూడరు" అంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు. అది ట్వీట్ కూడా చేశారు. అయితే... కొంత సేపటి తర్వాత డిలీట్ చేశారు. దాని గురించి నిర్మాత నాగవంశీని ప్రశ్నించగా...
ఇంకా షూటింగే పూర్తి కాలేదు... సినిమా చూడలేదు
''నాని గారు గానీ, నితిన్ గారు గానీ మా సంస్థతో సన్నిహిత అనుబంధం ఉన్న వ్యక్తులు. వాళ్ళిద్దరి సినిమాలతో పాటు వరుణ్ తేజ్ గారి 'ఆపరేషన్ వేలంటైన్' కూడా ఉండటంతో పోటీలో సినిమా విడుదల చేయడం ఎందుకని నేను ఏమైనా అంటానేమోనని విశ్వక్ సేన్ ఆలోచించాడు ఏమో!? విడుదల వాయిదా వేయాలనే ఆలోచనలో మేం లేము. ఇంకా షూటింగ్ జరుగుతోంది. ఇంకో పాట తీయాలి. ఆ తర్వాత మేం చూసుకోవాలి. దాన్ని బట్టి ప్రశాంతంగా ఆలోచిస్తాం. నేను గానీ, విశ్వక్ సేన్ గానీ ఇంకా సినిమా చూడలేదు'' అని నాగవంశీ తెలిపారు.
Also Read : సంక్రాంతి బరిలో మహేష్ సినిమాకు ప్రయారిటీ... నేనెందుకు వేరే నిర్మాతలను అడగాలి? - నిర్మాత నాగవంశీ
విశ్వక్ సేన్ జోడీగా నేహా శెట్టి నటిస్తున్న ఈ సినిమాలో తెలుగు అమ్మాయి అంజలి కీలక పాత్ర చేస్తున్నారు. ఈ చిత్రానికి కళా దర్శకుడు : గాంధీ నడికుడికర్, ఛాయాగ్రహణం : అనిత్ మధాది, కూర్పు : నవీన్ నూలి, సహ నిర్మాతలు: వెంకట్ ఉప్పులూరి, గోపీచంద్ ఇన్నమూరి, సంగీత దర్శకుడు: యువన్ శంకర్ రాజా, నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ & సాయి సౌజన్య, రచన & దర్శకత్వం: కృష్ణ చైతన్య
పీఆర్ఓ: లక్ష్మివేణుగోపాల్