Naga Shourya Movie Controversy: టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య మూవీ చిక్కుల్లో పడింది. నిర్మాత, దర్శకుడి గొడవల వల్ల ఈ మూవీ ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పడు మూవీ బడ్జెట్ రచ్చ ఫిల్మ్ ఛాంబర్ వరకు వెళ్లినట్టు తెలుస్తోంది. కాగా ఈ మధ్య నాగశౌర్యకు పెద్దగా కలిసి రావడం లేదనే చెప్పాలి. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు, హిట్స్‌తో అలరించిన ఈ హీరో ప్రస్తుతం సినిమాలు బాగా తగ్గించాడు. దీంతో ప్రస్తుతం ఈ హీరో మంచి సాలీడ్ హిట్ కోసం చూస్తున్నాడు. ఈ క్రమంలో గతేడాది 'రంగబలి' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈ చిత్రం నాగశౌర్యను దారుణంగా డిసప్పాయింట్ చేసింది.
ఫస్టాప్ చూస్తే హిట్ పడినట్టే అనిపించినా.. సెకండాఫ్‌తో మూవీ డిజాస్టర్ రిలీల్ట్ ఇచ్చింది. దీంతో నాగశౌర్య స్క్రిప్ట్ సెలక్షన్స్‌లో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో నారి నారి నడుమ మూరారి, పోలీస్ వారి హెచ్చరిక వంటి సినిమాలు చేస్తున్నాడు. అయితే ఇటీవల నాగశౌర్య మూవీ ఆగిపోయినట్టు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా దర్శకుడుకి, నిర్మాతకి మధ్య మనస్పర్థలు రావడం వల్ల ఆ ప్రాజెక్టు అటకెక్కినట్టు సమాచారం. ఈ చిత్రానికి దర్శకుడు, నిర్మాత ఇద్దరు కొత్తవారే. అరుణాచలం అనే అతను దర్శకుడిగా పరిచయం కావాల్సి ఉంది.అలాగే ఈ సినిమాకు ఓ ఎన్‌ఆర్‌ఐ నిర్మాత. హారీష్ జైరాజ్‌ని సంగీత దర్శకుడిగా ఫిక్స్ అయ్యాడు. ఈ మూవీ 10 రోజుల షూటింగ్ కూడా జరిగిందట.
కేవలం పది రోజుల షూటింగ్‌కే నిర్మాతతో భారీగా ఖర్చు పెట్టించారట. అడ్వాన్స్‌లు, షూటింగ్ సెట్స్, హోటల్ బిల్స్ అంటూ పది రోజుల్లో రూ.10 కోట్లు ఖర్చు పెట్టించారట. అలా కూల్‌గా వెళ్తున్న ఈ మూవీ విషయంలో నిర్మాతకు, దర్శకుడికి క్రియేటివ్ విషయంలో మనస్పర్థలు రావడం ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నారట. ఇక ఈ సినిమా కోసం మరో కొత్త నిర్మాత కూడా వచ్చాడట. అయితే తన పెట్టిన బడ్జెట్ తిరిగి ఇవ్వాలని అడగ్గా.. మూవీ టీం కుదరదని చెప్పినట్టు ఇన్‌సైడ్ సినీ సర్కిల్లో టాక్. ఈ విషయంలో దర్శకుడికి, నిర్మాతకు కూడా గొడవ జరుగుతుందట. ఈ వివాదం కాస్తా సినీ పెద్దల వరకు వెళ్లిందట. తన డబ్బులు తనకు తిరిగి వచ్చేలా చేయాలని కోరుతూ ఎన్‌ఆర్‌ఐ నిర్మాత ఫిల్మ్ చాంబర్‌లో కంప్లైంట్ ఇచ్చినట్టు సినీవర్గాల నుంచి సమాచారం. అయితే దీనిపై అధికారిక సమాచారం లేదు. కానీ దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
కాగా ఇప్పటికే కన్నడ హీరో దర్శన్‌కు మద్దతుగా నిలిచి నాగశౌర్య సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నాడు. అభిమాని హత్య కేసులో జైలుకు వెళ్లిన దర్శన్‌కి నాగశౌర్య సపోర్టు ఇస్తూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశాడు. దర్శన్ అన్న అలాంటి వాడు కాదని, ఎప్పుడు ఎదుటి వారకి సాయం చేసే స్వభావమే కానీ, ఒకరి హత్య చేసే అంత క్రూరమైన వ్యక్తి కాదన్నాడు. అది అతడి స్వభావం విరుద్ధమని, ఎంతో దయగుణం ఉన్న దర్శన్ అన్న ఓ వ్యక్తిని హత్య చేశాడంటే తాను నమ్మనంటూ సపోర్టు ఇచ్చాడు. దీంతో ఒక హత్య కేసులో అరెస్టై జైలుకి వెళ్లిన వ్యక్తికి సపోర్ట్ చేయడం ఏంటని నెటిజన్లు నాగశౌర్యను ప్రశ్నించారు. అంతేకాదు శౌర్య పోస్ట్‌పై కొందరు ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు.
Also Read: 'కల్కి 2898 ఏడీ' కమల్ పాత్రను రివీల్ - శ్రీకృష్ణుడి చీకటి కోణమే సుప్రీం యాస్కిన్..