టాలీవుడ్ యంగ్ స్టార్ అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన తాజా చిత్రం 'తండేల్'. ఈ మూవీ రిలీజ్ ఎప్పుడు అన్న డైలమాకు తాజాగా మేకర్స్ ఫుల్ స్టాప్ పెట్టారు. గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ ఆ పుకార్లను నిజం చేశారు.
అఫీషియల్ రిలీజ్ డేట్ ఇదే
నాగ చైతన్య హీరోగా, సాయి పల్లవి ఫిమేల్ లీడ్ రోడ్ లో నటిస్తున్న తాజా భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ 'తండేల్'. ఈ సినిమా 2018లో గుజరాత్ లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా మత్స్యకారుల కథతో తెరకెక్కుతోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో 'తండేల్' మూవీని బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఈ మూవీకి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ రొమాంటిక్ డ్రామా రిలీజ్ డేట్ గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. మేకర్స్ అనౌన్స్ చేయడానికంటే ముందే ఇండస్ట్రీలో 'తండేల్' రిలీజ్ డేట్ వైరల్ అయ్యింది. ఈ మూవీని 2025 ఫిబ్రవరి 2వ వారానికి ముందే రిలీజ్ చేయబోతున్నారు అంటూ గత రెండు రోజుల నుంచి టాలీవుడ్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా 'తండేల్' మూవీ రిలీజ్ డేట్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. ముందుగా ప్రచారం జరిగినట్టుగానే 'తండేల్' మూవీని వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న రిలీజ్ చేయబోతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేసి అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్.
అక్కినేని ఫ్యాన్స్ అసంతృప్తి
అయితే కొంత మంది నాగ చైతన్య అభిమానులు మాత్రం 'తండేల్' రిలీజ్ డేట్ విషయంలో అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీలో దేశభక్తితో పాటు లవ్ స్టోరీ కూడా ప్రధాన అంశం కావడంతో వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ అయితే బాగుంటుందని అనుకున్నారు. కానీ వాళ్ళు ఊహించిన దాని కంటే వారం ముందుగానే 'తండేల్' మూవీ థియేటర్లలోకి దిగుతుండడంతో డిసప్పాయింట్ అవుతున్నారు. కాగా ముందుగా డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా 'తండేల్'ను గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. కానీ ఆ తర్వాత మూవీ రిలీజ్ వాయిదా పడ్డ సంగతి తెలిసిందే.
రీసెంట్ గా ఓ ఈవెంట్ లో డైరెక్టర్ చందూ మొండేటి మాట్లాడుతూ డిసెంబర్ లో మూవీని రిలీజ్ చేయడం అయ్యే పని కాదని తేల్చారు. అయితే సంక్రాంతి బరిలోకి దిగడానికి తాము సిద్ధంగా ఉన్నామని, కానీ చెర్రీ వస్తున్నాడు కాబట్టి నిర్మాత అరవింద్, వెంకీ మామ వస్తున్నాడు కాబట్టి చైతన్య వెనక్కి తగితే మూవీ రిలీజ్ డేట్ మారే ఛాన్స్ ఉందని క్లారిటీ ఇచ్చాడు. దీంతో అసలు ఈ మూవీ సంక్రాంతి రేస్ లో ఉంటుందా లేదా అన్న డైలమా నెలకొంది. తాజాగా 2025 ఫిబ్రవరి 7న మూవీని రిలీజ్ చేయబోతున్నట్టుగా ప్రకటించి ఆ డైలమాకు ఫుల్స్టాప్ పెట్టారు మేకర్స్.
Read Also : Thammudu: నితిన్ కొత్త సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్... శివరాత్రి పర్వదినాన 'తమ్ముడు' రాక