Nithiin Thammudu: గతంలో వరస హిట్స్ అందుకున్న యంగ్ హీరో నితిన్ ఇటీవల కాలంలో వరస డిజాస్టర్ల కారణంగా కాస్త స్లో అయ్యాడు. అయితే త్వరలోనే బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వడానికి రెడీ అవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన హీరోగా నటించిన 'తమ్ముడు' మూవీ రిలీజ్ డేట్ ను తాజాగా అనౌన్స్ చేశారు మేకర్స్. 


ప్రస్తుతం నితిన్ రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో తనకు ఇష్టమైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ 'తమ్ముడు'తో ఒక సినిమా చేయబోతున్నాడు. కొన్నాళ్ల క్రితమే నితిన్ ఈ సినిమాను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. 'వకీల్ సాబ్' డైరెక్టర్ వేణు శ్రీరామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు భారీ బడ్జెట్లో నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ 'తమ్ముడు' సినిమాలో అన్న సెంటిమెంట్ ఉంటుంది. కానీ నితిన్ 'తమ్ముడు' సినిమాలో మాత్రం అక్క సెంటిమెంట్ ఉండబోతోంది. 



Read Also :Appudo Ippudo Eppudo Trailer: ‘రియా ఎక్కడ’ టైప్‌లో ‘డివైస్ ఎక్కడ’ - నిఖిల్ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ ట్రైలర్ చూశారా?


ఈ మూవీలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ లయ నితిన్ కు అక్క పాత్రను పోషిస్తుంది. అయితే ఇప్పటిదాకా ఈ సినిమా నుంచి పెద్దగా అప్డేట్స్ ఇవ్వలేదు మేకర్స్. కానీ తాజాగా 'తమ్ముడు' మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసి సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. 'తమ్ముడు' మూవీ రిలీజ్ డేట్ పోస్టర్ లో 2025 మహాశివరాత్రి కానుకగా మూవీని రిలీజ్ చేయబోతున్నట్టు నేడు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అలాగే ఈ పోస్టర్లో నితిన్ ఓ చిన్న పాపని భుజంపై ఎక్కించుకొని వెనకాల కొంతమంది తరుముతుంటే ఆమెను కాపాడడానికి పరిగెడుతున్నట్టుగా ఉంది. అలాగే నితిన్ చేతిలో కాగడా ఉండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ పోస్ట్ ని చూస్తుంటే సినిమాలో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతోంది అనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. 






అలాగే ఆ పోస్టర్లో ఉన్న పాప సినిమాలో నితిన్ అక్క కూతురు అనే విషయం అర్థం అవుతోంది. మరి ఆ పాపని కాపాడుకోవడానికి ఈ 'తమ్ముడు' ఏం చేశాడు? అసలు హీరోయిన్ అక్క కూతురికి ప్రమాదం ఎలా ఎదురైంది? అనే విషయాలు సినిమాపై క్యూరియాసిటీని పెంచేస్తున్నాయి. ఇక రిలీజ్ డేట్ పోస్టర్ ను చూసిన నితిన్ అభిమానులు ఇది పక్కా పండగ మూవీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


మరోవైపు నితిన్ 'రాబిన్ హుడ్' అనే సినిమాని చేస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్లో రిలీజ్ కాబోతోంది. ఇందులో శ్రీలీల హీరోయిన్ గా మాట్లాడుతోంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. నితిన్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రముఖ తమిళ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. డిసెంబర్ 20వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. 'గేమ్ ఛేంజర్' మూవీ పోస్ట్ పోన్ కావడంతో క్రిస్మస్ కానుకగా ఈ మూవీని రిలీజ్ చేయడానికి నితిన్ రెడీ అయ్యాడు.   


Read Also : Baby John: ‘బేబీ జాన్‌’ టీజర్‌ వచ్చేసింది, మాస్ ఎలివేషన్స్​తో దుమ్మురేపిన వరుణ్!