Appudo Ippudo Eppudo Trailer Released: టాలీవుడ్ హీరో నిఖిల్ (Nikhil), ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మలది (Sudheer Varma) సూపర్ హిట్ కాంబినేషన్. వీరిద్దరూ కలిసి చేసిన ‘స్వామి రారా’, ‘కేశవ’ సినిమాలు సూపర్ హిట్లు అయ్యాయి. ‘స్వామి రారా’ అయితే నిఖిల్ కెరీర్‌లోనే గేమ్ ఛేంజింగ్ సినిమా. ‘కేశవ’ వచ్చిన ఏడు సంవత్సరాల తర్వాత వీరిద్దరూ మరోసారి కలిసి సినిమా చేశారు. ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ (Appudo Ippudo Eppudo) పేరుతో ఒక రొమాంటిక్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌ను తెరకెక్కించారు. నవంబర్ 8వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ దగ్గర పడటంతో ట్రైలర్‌ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు.
ట్రైలర్‌లో ఏం ఉంది?
రేసర్ అవ్వాలి అనుకునే యువకుడి పాత్రలో హీరో నిఖిల్ ఈ సినిమాలో కనిపించనున్నారు. అయితే రేసర్ అయ్యే దాకా డబ్బులు అవసరం కాబట్టి ధనిక కుటుంబానికి తార అనే అమ్మాయిని ప్రేమించినట్లు చూపించారు. ఈ పాత్రలో రుక్మిణి వసంత్ కనిపించారు. అంతే కాకుండా తులసి అనే ఇంకో అమ్మాయిని కూడా నిఖిల్ ప్రేమించినట్లు ట్రైలర్‌లో చూపించారు. ఈ తులసి అనే అమ్మాయి పాత్రలో దివ్యాన్ష కౌశిక్ కనిపించారు. లండన్‌లో డబ్బుల కోసం చిన్న చిన్న నేరాలు కూడా చేసినట్లు చూపించారు. అయితే అనుకోకుండా ఏదో పెద్ద క్రైమ్‌లో ఇరుక్కోవడం... లండన్ మాఫియా, పోలీసులు అందరూ నిఖిల్ వెంటపడటం కూడా ట్రైలర్‌లో చూడవచ్చు. మొత్తంగా ట్రైలర్‌ను సస్పెన్స్‌ఫుల్‌గా, సినిమా మీద ఇంట్రస్ట్ క్రియేట్ అయ్యేలా కట్ చేశారు.
వింటేజ్ నిఖిల్ కావాలని అడిగే వారి కోసం...
ఈ సినిమాకు సంబంధించిన ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూలో హీరో నిఖిల్ మాట్లాడుతూ... తన ఫ్యాన్స్ చాలా మంది వింటేజ్ నిఖిల్ కావాలని అడిగే వారన్నాడు. అంటే కెరీర్ ప్రారంభంలో చేసినట్లు లవర్ బాయ్ పాత్రలు, పక్కింటి అబ్బాయి తరహా పాత్రల్లో తనను చూడాలని ఫ్యాన్స్ ఆశపడ్డారని, వాటిని ఈ సినిమా నెరవేరుస్తుందని చెప్పాడు. కొన్ని సంవత్సరాల తర్వాత నుంచి నిఖిల్ భారీ సినిమాలే చేస్తున్నారు. ‘కార్తికేయ 2’తో పాన్ ఇండియా హిట్ అందుకున్నారు. తర్వాత ‘స్పై’ సినిమాలో గూఢచారిగా కనిపించారు. ప్రస్తుతం ‘స్వయంభు’, ‘ది ఇండియా హౌస్’ అనే భారీ సినిమాల్లో నటిస్తున్నారు. ఇవన్నీ చాలా పెద్ద సినిమాలు.
‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సినిమాలో నిఖిల్ సరసన లేటెస్ట్ సెన్సేషన్ రుక్మిణి వసంత్, దివ్యాన్ష కౌశిక్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వైవా హర్ష, సత్య, సుధాకర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అజయ్, తమిళ నటుడు జాన్ విజయ్ విలన్ పాత్రలు చేశారు. ఈ సినిమాకి ప్రముఖ సింగర్ కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సన్నీ ఎంఆర్ ఇస్తున్నారు. రిచర్డ్ ప్రసాద్ డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీగా ఉన్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. మరో నాలుగు రోజుల్లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: బఘీర రివ్యూ: ప్రశాంత్ నీల్ రాసిన బెంగళూరు బ్యాట్‌మ్యాన్ కథ - సినిమా ఎలా ఉంది?