Music School: పరీక్షల్లో ఫెయిల్ అయ్యామన్న ఒకే ఒక్క కారణంతో చాలా మంది విద్యార్థులు చిన్న వయసులోనే తమ ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇటీవల విడుదలైన సీబీఎస్ఈ ఇంటర్మీడియట్ ఫలితాల తర్నాత కూడా ఇలాంటి ఘటనలే పునరావృతమయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, నిజమాబాద్ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు తక్కువ మార్కులు తెచ్చుకోవటంతో ఇటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. విద్యార్థుల ఆత్మహత్యలపై 'మ్యూజిక్ స్కూల్' డైరెక్టర్ పాపారావు బియ్యాల స్పందించారు.
‘‘చుట్టూ ఉన్న సమాజం కారణంగా విద్యార్థులు నిర్ణయించుకున్న కొన్ని ప్రమాణాల కారణంగా సామర్థ్యం ఉన్నా వాళ్లు తమ ప్రాణాలను కోల్పోవటం మన దురదృష్టం. ఈ విషయాన్నే మా 'మ్యూజిక్ స్కూల్' చిత్రం ద్వారా తెలియజేశాం. విద్యార్థుల శ్రేయస్సు, అభివృద్ధి ముఖ్యమని తెలియజేసేలా ఈ చిత్రాన్ని రూపొందించాం’’అని పాపారువు అన్నారు. కాగా ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న విద్యార్థుల కథ నేపథ్యంలో తెరకెక్కిన 'మ్యూజిక్ స్కూల్'.. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.
'మ్యూజిక్ స్కూల్' మే12న రిలీజైన ఈ సినిమాలో.. పాపారావు బియ్యాల ఐఏఎస్ ఆఫీసర్‌గా నటించారు. ఈ చిత్రంతోనే ఆయన దర్శకుడిగా మారారు. ఇసైజ్ఞాని, మ్యాస్ట్రో ఇళయరాజా సంగీత సారథ్యం వహించిన ఈ చిత్రాన్ని దర్శకత్వంతో వహించటంతో పాటు నిర్మించారు. పిల్లల్లో కళల పట్ల ఆసక్తిని పెంపొందించాల్సిన తల్లిదండ్రులు, టీచర్స్, సమాజం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. విద్యార్థులపై విద్యాపరమైన ఒత్తిడిని పెంచేస్తోంది. ఇది వారిలోని ఎదుగుదలను ఆపేస్తోంది. ఈ విషయాన్ని టమ్యూజిక్ స్కూల్' అనే మల్టీలింగ్వువల్ చిత్రం ద్వారా ఎంటర్‌టైనింగ్‌గా చిత్రీకరించారు. డ్రామా టీచర్‌గా శర్మన్ జోషి, మ్యూజిక్ టీచర్‌గా నటించిన శ్రియా శరన్.. తల్లిదండ్రులుగా కనిపించారు. టీచర్స్ ద్వారా విద్యాపరమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్న కొంత మంది పిల్లలతో కలిసి సౌండ్ ఆఫ్ మ్యూజిక్ అనే సంగీత నాటకాన్ని రూపొందించటానికి కష్టపడటమే ఈ మ్యూజిక్ స్కూల్ ప్రధాన కథాంశం.
మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం సారథ్యం వహించిన ఈ చిత్రంలో శ్రియా శరన్, శర్మన్ జోషితో పాటు ప్రకాష్ రాజ్, ఓజు బారువా, గ్రేసీ గోస్వామి, బెంజిమన్ గిలాని, , సుహాసిని ములె, మోనా, లీలా సామ్‌సన్, బగ్స్ భార్గవ, వినయ్ వర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, వకార్ షేక్, ఫణి, ఇతర చిన్న పిల్లలు కూడా నటించారు. యామిని ఫిల్మ్స్ బ్యానర్ సమర్పణలో తెలుగు, హిందీ భాషల్లో రూపొందించిన ఈ చిత్రాన్ని తమిళంలోనూ అనువాదం చేసి మేకర్స్ మే 12న రిలీజ్ చేశారు. హిందీలో పి.వి. ఆర్ రిలీజ్ చేసిన ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు.
Also Read : 'న్యూసెస్' వెబ్ సిరీస్ రివ్యూ : జర్నలిస్టులు డబ్బుకు దాసోహం అయితే?
తొలిసారి ఫీచర్ ఫిల్మ్ తీసిన డైరెక్టర్ పాపారావు బియ్యాల... 'మ్యూజిక్ స్కూల్' సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ చిత్రం ద్వారా సందేశాత్మక సబ్జెక్ట్‌తో అవగాహన పెంచే ప్రయత్నం చేశారు. ఫ్యామిలీ ఫ్రెండ్లీ స్టయిల్‌లో సినిమా స్టోరీ లైన్‌ను ప్రజెంట్ చేయడం అందర్నీ ఆకట్టుకుంటుంది. మ్యూజిక్ లవర్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ ఫిల్మ్‌ను మిస్‌కాలేరు. ఈ సినిమాను చూసిన ప్రతి ఫిల్మ్‌గోయర్ తన చిన్నతనాన్ని గుర్తు చేసుకోవడం ఖాయమని, మీ పిల్లలు ఒత్తిడిలో ఉన్నట్లయితే.. వాళ్లకు ఈ సినిమా చూపించాల్సిందేనని పలువురు నొక్కి చెబుతున్నారు.
Also Read : బోయపాటి మాస్ లుక్‌లో రామ్ పోతినేని - భారీ ప్లాన్ బాసూ!