బాలీవుడ్ నటి అలియా భట్ ను కొందరు ఫోటోగ్రాఫర్లు సీక్రెట్ గా ఫోటోలు తీయడాన్ని ముంబై పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టడంతో ఈ విషయం గురించి తెలుసుకున్న పోలీసులు, అలియాను కంప్లైంట్ చేయాల్సిందిగా సూచించారు. ప్రైవసీని దెబ్బ తీసి ఫోటోలు తీశారని భావిస్తే ఫోటో గ్రాఫర్లపై  వెంటనే ఫిర్యాదు చేయాలన్నారు. కంప్లైంట్ ఇచ్చిన వెంటనే సదరు ఫోటో గ్రాఫర్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సోషల్ మీడియా ద్వారా విషయం చెప్పడంతో పాటు నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. కేసు విషయంలో అలియా పీఆర్ టీమ్‌తో పోలీసులు టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.   


అలియాను సీక్రెట్ ఫోటోలు తీసిన కెమెరామెన్


అలియా భట్ తన అపార్ట్‌ మెంట్‌లోని లివింగ్‌ రూమ్‌లో కూర్చొని ఉంది. అప్పుడు తనను ఎవరో గమనిస్తున్నట్లు అనుమానం కలిగింది. వెంటనే తను తలెత్తి చూడగానే,  ఇద్దరు ఫోటోగ్రాఫర్లు తమ పక్కనే ఉన్న బిల్డింగ్ టెర్రస్ నుంచి ఆమెకు ఫోటోలు తీస్తూ కనిపించారు. ఈ ఘటనతో అలియా షాక్ కు గురయ్యింది. ఈ విషయాన్ని వెంటనే ముంబై పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. ఇంట్లో ఉన్న వారిని సీక్రెట్ గా ఫోటోలు తీయడం అంటే తమ ప్రైవసీకి పూర్తి భంగం కలిగించడమేనని అలియా చెప్పింది.  తన కూతురు రాహా కపూర్ ఫోటోల కోసమే సదరు కెమెరామెన్ హద్దులు మీరి ప్రవర్తించినట్లు చెప్పింది.  ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ ఘటన ముమ్మాటికీ మా ప్రైవసీని దెబ్బతీయడమే అవుతుంది. లిమిట్ క్రాస్ చేసి మా ఇంట్లోకి కెమెరాలు పెట్టారంటూ రాసుకొచ్చింది. ఈ పోస్టును ముంబై పోలీసులకు ట్యాగ్ చేసింది. ఈ ఘటన ముంబైంలో సంచలనం అయ్యింది.   


అలియాకు సెలబ్రిటీల సపోర్టు


తన ప్రైవసీకి ఇబ్బంది కలిగించేలా ఫోటో గ్రాఫర్లు వ్యవహరించారంటూ అలియా భట్ పోస్టు పెట్టడంపై పలువురు సెలబ్రిటీలు స్పందించారు. తాము సెలబ్రిటీలు కావచ్చు.. కానీ, ఇంట్లో తమకంటూ వ్యక్తిగత జీవితం ఉంటుంది. అలా తొంగి చూడటం ఎంతవరకు సబబు? దేనికైనా లిమిట్ ఉంటుందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అనుష్క శర్మ, అర్జున్ కపూర్, జాన్వీ కపూర్, కరణ్ జోహర్ సహా పలువరు నెటిజన్లకు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


అటు గతంతోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ముద్దుల కూతురు వామిక ఫోటోలను తీయడం కోసం కొంతమంది ఫోటో గ్రాఫర్లు వాళ్ల ఇంట్లోకి చొరబడ్డారు. ఈ ఘటన అప్పట్లో సంచలనం అయ్యింది. అనుష్క శర్మ సదరు వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది.   






Read Also: ‘RSS’ సినిమాను రాజమౌళి, ఆయన తండ్రి హైజాక్ చేస్తున్నారు - లహరి వేలు సంచలన వ్యాఖ్యలు!