7 Days 6 Nights New Release Date: ఈ నెల (జూన్)లోనే ఎంఎస్ రాజు '7 డేస్ 6 నైట్స్', విడుదల ఎప్పుడంటే?

మెగా మేకర్ ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన '7 డేస్ 6 నైట్స్' సినిమా ఈ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Continues below advertisement

దర్శకుడిగా 'డర్టీ హరి' విజయం తర్వాత మెగా మేకర్ ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌ '7 డేస్ 6 నైట్స్'. ఈ నెలలో ప్రేక్షకుల ముందు రానుంది. జూన్ 24న సినిమాను విడుదల చేస్తున్నట్లు ఈ రోజు వెల్లడించారు.

Continues below advertisement

'7 డేస్ 6 నైట్స్'లో ఎంఎస్ రాజు తనయుడు సుమంత్ అశ్విన్ ఓ కథానాయకుడు. చిత్ర నిర్మాతల్లో ఆయన కూడా ఒకరు! సుమంత్ అశ్విన్ సరసన కథానాయికగా మెహర్ చాహల్... రోహన్, క్రితికా శెట్టి మరో జంటగా నటించారు.
 
'7 డేస్ 6 నైట్స్' కథ ఏంటంటే... రోహన్‌కు పెళ్లి కుదరడంతో గోవాకు బ్యాచిలర్ ట్రిప్ వేస్తారు. ఆయనతో పాటు సుమంత్ అశ్విన్ కూడా వెళతారు. తనకు పెళ్లి కుదిరిన విషయాన్ని దాచిన రోహన్, ఓ అమ్మాయికి లైన్ వేస్తారు. సుమంత్ అశ్విన్ మరో అమ్మాయితో ప్రేమలో పడతారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది సినిమాలో చూడాలి.

Also Read: Sathi Movie First Look: తనయుడు హీరోగా ఎంఎస్ రాజు కొత్త సినిమా - 'సతి' ఫస్ట్ లుక్

సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో వైల్డ్ హనీ ప్రొడక్షన్ పతాకంపై '7 డేస్ 6 నైట్స్' సినిమా రూపొందింది. సుమంత్ అశ్విన్ .ఎం, రజనీకాంత్ .ఎస్ నిర్మాతలు. వింటేజ్ పిక్చర్స్, ఏబిజి క్రియేషన్స్ చిత్రనిర్మాణంలో భాగస్వాములు.

Also Read: ఐదు భాషల్లో బోయపాటి - రామ్ సినిమా, 'స్రవంతి' రవికిశోర్ క్లాప్‌తో సినిమా స్టార్ట్

Continues below advertisement
Sponsored Links by Taboola