Sathi Movie First Look: తనయుడు హీరోగా ఎంఎస్ రాజు కొత్త సినిమా - 'సతి' ఫస్ట్ లుక్

తనయుడు సుమంత్ అశ్విన్ హీరోగా ఎంఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్న తాజా సినిమా 'సతి'. ఈ రోజు ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

Continues below advertisement

మెగా మేకర్ ఎంఎస్ రాజు రచన, దర్శకత్వంలో వస్తున్న తాజా సినిమా 'సతి'. 'డర్టీ హరి'తో దర్శకుడిగా గత ఏడాది ఆయన భారీ విజయం అందుకున్నారు. ఆ తర్వాత '7 డేస్ 6 నైట్స్' సినిమా తీశారు. అది విడుదలకు సిద్ధంగా ఉంది. ఈలోపు మరో సినిమా ప్రారంభించారు. మదర్స్ డేకి కొత్త సినిమా 'సతి' (MS Raju Sathi Movie) ప్రకటించిన ఎంఎస్ రాజు... ఈ రోజు ఆ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

Continues below advertisement

'సతి' సినిమాలో ఎంఎస్ రాజు తనయుడు సుమంత్ అశ్విన్ హీరో. ఆయన సరసన మెహర్ చాహల్ కథానాయికగా నటిస్తున్నారు. ఆ అమ్మాయి '6 డేస్ 7 నైట్స్'లో కూడా నటించారు. సుమంత్ అశ్విన్ (Sumanth Ashwin), మెహర్ చాహల్ జంటగా ఉన్న ఫస్ట్ లుక్ ఈ రోజు విడుదల చేశారు. (Sathi Movie First Look)

''నూతన దంపతుల మధ్య జరిగే అనుకోని సంఘటనల చుట్టూ అల్లిన కథతో, ఉద్వేగభరితమైన సన్నివేశాలతో రూపొందుతున్న సినిమా 'సతి'. దర్శకుడిగా నా కెరీర్ లో గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా అవుతుంది'' అని ఎంఎస్ రాజు అన్నారు. సీనియర్ నటుడు డా. వీకే నరేష్ ప్రత్యేకమైన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. 

Also Read: నాగార్జునకు ముద్దు పెట్టిన అషురెడ్డి - ఏం చెప్పిందో తెలుసా?

సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై వైల్డ్ హానీ ప్రొడక్షన్, రామంత్ర క్రియేషన్స్ సంస్థలపై సినిమా రూపొందుతోంది. సుమంత్ అశ్విన్, రఘురామ్ టి, సారంగ సురేష్ కుమార్, డాక్టర్ రవి దాట్ల నిర్మాతలు. జె శ్రీనివాస రాజు కో ప్రొడ్యూసర్. ఈ చిత్రానికి జునైద్ సిద్ధిఖీ ఎడిటర్, రాకేష్ హాసమని, వెంకట్ సినెమాటోగ్రఫర్స్, భాస్కర్ మూడవత్ ప్రొడక్షన్ డిజైనర్

Also Read: చీపురు పుల్లలతో చిరు, చెర్రీ కోసం సర్‌ప్రైజ్ గిఫ్ట్ - ఆ టాలెంట్‌కి రామ్ చరణ్ ఫిదా, ఆమె కాళ్లు మొక్కి ఆశీర్వాదం

Continues below advertisement