Mrunal Thakur - Dacoit: 'డకాయిట్'ను వదిలేసింది మృణాలే... అఫీషియల్‌గా చెప్పడంతో పాటు లుక్ రిలీజ్ చేసిన అడివి శేష్
Mrunal Thakur On Board For Dacoit: అడివి శేష్ పుట్టిన రోజు స్పెషల్ గా 'డెకాయిట్' సినిమా నుంచి హీరోయిన్ మృణల్ ఠాకూర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్.
ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న టాలెంట్ హీరోలలో అడవి శేష్ కూడా ఒకరు. ఆయన తన సినిమాలకు చేసుకునే ప్రమోషన్లు ప్రత్యేకంగా ఉంటాయి. తాజాగా తన కొత్త సినిమా 'డెకాయిట్'కు సంబంధించిన అప్డేట్ తో అందరి దృష్టిని ఆకర్షించారు. సోమవారం హీరోయిన్ ఫేస్ ను రివీల్ చేయకుండా, కేవలం కళ్ళను మాత్రమే చూపించి, ఆమె ఎవరో చెప్పుకోండి చూద్దాం అంటూ హింట్ వదిలాడు అడవి శేష్. తాజాగా 'డెకాయిట్' సినిమాలో హీరోయిన్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.
'డెకాయిట్'లో మృణాల్ ఠాకూర్ ఫస్ట్ లుక్...
అడవి శేష్ హీరోగా, షనీల్ డియో దర్శకత్వం వహిస్తున్న సినిమా 'డెకాయిట్'. ఈరోజు అడవి శేష్ పుట్టినరోజు సందర్భంగా ఉదయం 11 గంటల 30 నిమిషాలకు 'డెకాయిట్'లో హీరో ప్రేయసి ఎవరో తెలియజేయబోతున్నట్టు నిన్ననే అనౌన్స్ చేశారు. సోషల్ మీడియాలో అడవి శేష్ "తనని కాపాడాను... కానీ వదిలేసింది... తను ఏంటో, అసలు ఎవరో రేపు తెలుసొస్తది" అంటూ హీరోయిన్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయబోతున్నామని వెల్లడించారు. దీంతో నిన్నటి నుంచి ఆ కళ్ళను చూడగానే ప్రేక్షకులు ఆమె మృణాల్ ఠాకూర్ అని ఇట్టే పట్టేసి కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు. అనుకున్నట్టుగానే తాజాగా 'డెకాయిట్'లో హీరోయిన్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా, అందులో మృణాల్ ఠాకూర్ కనిపించింది. ఈ సినిమాలో ఆమె డీ-గ్లామర్ లుక్ లో మెరవబోతోంది.
Also Read: బిగ్ బాస్ 8 విజేత నిఖిల్... అతని కంటే ముందు విన్నర్స్ ఎవరో గుర్తు ఉన్నారా? ఓ లుక్ వేయండి
ఇక ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో మృణాల్ ను చూశాక అడవి శేష్ -మృణాల్ ఠాకూర్ జోడి బాగుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే అడవి శేష్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక చాలా రోజుల క్రితమే 'డెకాయిట్' సినిమా నుంచి టైటిల్ టీజర్ ను రిలీజ్ చేశారు. ఆ టీజర్ ను చూశాక సినిమా మాజీ ప్రేమికుల మధ్య శత్రుత్వంతో కొనసాగే కొత్త జానర్ మూవీ అనిపించేలా డిజైన్ చేశారు డైరెక్టర్.
శృతి హాసన్ ను రీప్లేస్ చేసిన మృణాల్
అయితే ముందుగా ఈ సినిమాలో శృతిహాసన్ ను హీరోయిన్ గా అనుకున్నారు. ఈ మేరకు టైటిల్ టీజర్ లో శృతి హాసన్ డీ-గ్లామర్ లుక్ ను కనిపించింది కూడా. అడవి శేష్ - శృతిహాసన్ ఇద్దరూ టీజర్ లో కనిపించిన తీరు 'డెకాయిట్' సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది. కానీ సడన్ గా ఈ సినిమా నుంచి శృతిహాసన్ తప్పుకుంది అనే రూమర్లు మొదలయ్యాయి. అసలు ఏమైందో తెలియదు గానీ మొత్తానికి శృతిహాసన్ ను మృణాల్ ఠాకూర్ రీప్లేస్ చేయడం గమనార్హం.
ఇదిలా ఉండగా అడవి శేష్ ప్రస్తుతం 'డెకాయిట్' సినిమాతో పాటు 'గూఢచారి'కి సీక్వెల్ గా వస్తున్న 'జీ2'లో కూడా హీరోగా నటిస్తున్నారు. వినయ్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.