మాస్ కా దాస్ విశ్వక్ సేన్ లేటెస్ట్ మూవీ ‘మెకానిక్ రాకీ’ మూవీ ఇటీవల థియేటర్లలో విడుదలై, పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకున్నప్పటికీ, కలెక్షన్ల పరంగా నిరాశనే మిగిల్చింది. ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తోంది. ఈ సినిమా రిజల్ట్ తర్వాత విశ్వక్ సేన్ ఆశలన్నీ ప్రస్తుతం చేస్తున్న ‘లైలా’ మూవీ పైనే ఉన్నాయి. అసలు ఇటువంటి టైటిల్‌తో మూవీ, అందులోనూ విశ్వక్ సేన్ హీరో అనగానే ఒక్కసారిగా అంతా ఆశ్చర్యపోయారు. మాస్ కా దాస్ విశ్వక్ ఏంటి? ఇలాంటి టైటిల్‌లో సినిమా చేయడం ఏంటని అంతా అనుకున్నారు. కారణం ఆయనకున్న మాస్ ఫాలోయింగ్, మాస్ ఇమేజ్ అలాంటిది మరి. కానీ నటుడన్నాక.. అన్ని రకాల పాత్రలు చేయాలి. ఈ సినిమాలో ఉన్న మరో విశేషం ఏమిటంటే.. ఇందులో విశ్వక్ సేన్ ఇప్పటి వరకు కనిపించిన సరికొత్త అవతార్‌లో.. మరీ ముఖ్యంగా అబ్బాయిగానూ, అమ్మాయిగానూ నటిస్తుండటం.
మరి ఇంత విశేషం ఉన్న ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారో.. అనే థింకింగ్‌లో ఉన్న ప్రేక్షకుల కోసం, సోమవారం చిత్ర విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ సినిమా విడుదల తేదీకి కూడా ఓ స్పెషల్ ఉండేలా మేకర్స్ భలే ప్లాన్ చేశారు. ఏంటా స్పెషల్ అనుకుంటున్నారా? ‘లైలా’ సినిమాను ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14న మేకర్స్ విడుదల చేయబోతున్నారు. రొమాంటిక్ జానర్‌లో వస్తున్న ఇలాంటి సినిమాకి లవ్ సీజన్ అయిన ఫిబ్రవరి 14కు మించిన డేట్ కంటే మంచి డేట్ ఇంకేం ఉంటుంది. అందుకే మేకర్స్ కావాలని ఈ డేట్‌ని ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ డేట్ అనౌన్స్‌మెంట్‌తో ఒక్కసారిగా ఈ సినిమా వార్తలలో నిలుస్తోంది.
Read Also : Manchu Manoj Political Entry: రాజకీయాల్లోకి మంచు మనోజ్ దంపతులు! జనసేనలో చేరే అవకాశం!
ఇక రిలీజ్ డేట్ ప్రకటిస్తూ మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ కూడా వైవిధ్యంగా ఉంది. ఈ రిలీజ్ డేట్ పోస్టర్‌లో విశ్వక్ సేన్ స్టైలిష్ అవతార్‌లో కనిపిస్తున్నారు. ఆయన ధరించిన స్పోర్టింగ్ ట్రెండీ ఎటైర్, సన్ గ్లాసెస్.. అలాగే చొక్కాతో ముఖాన్ని కప్పుకున్న తీరు.. అన్నీ కూడా ఆసక్తికరంగా ఉండటమే కాకుండా ఫస్ట్ లుక్ కోసం వెయిట్ చేసేలా చేస్తున్నాయి. ఫిబ్రవరి 14న విడుదల అని చెప్పిన మేకర్స్, 2025 నూతన సంవత్సరం రోజున ‘లైలా’ ఫస్ట్ రోజ్ అదే ఫస్ట్ లుక్‌ని విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించారు.
Also Read: బిగ్ బాస్ 8 విజేత నిఖిల్... అతని కంటే ముందు విన్నర్స్ ఎవరో గుర్తు ఉన్నారా? ఓ లుక్ వేయండి
ఇంతకు ముందు ‘లైలా’కు సంబంధించి రిలీజ్ చేసిన ఐ లుక్‌తో విశ్వక్ సేన్ పాత్రలోని వెరైటీని పరిచయం చేసిన మేకర్స్.. ఫస్ట్ లుక్‌తో ఈ సినిమా స్వరూపమే మారిపోతుందని చెబుతున్నారు. ఆ ఫస్ట్ లుక్ ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం రాబోయే నూతన సంవత్సరం వరకు వెయిట్ చేయాల్సిందే. విశ్వక్ సేన్ సరసన ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని రామ్ నారాయణ్ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ప్రజంట్ ఈ మూవీ హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది.