మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు ముగిశాయి. అయితే వివాదాలు మాత్రం కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అందర్నీ కలుపుకుని వెళ్లేందుకు మంచు విష్ణు ప్రయత్నిస్తున్నారు. ఇండస్ట్రీ సీనియర్లతో సమావేశం అవుతున్నారు. "మా" ఎన్నికల్లో తమకు మద్దతు ప్రకటించిన నందమూరి బాలకృష్ణకు ప్రత్యేకంగా ఇంటికి వెళ్లి కృతజ్ఞతలు తెలిపారు మంచు మోహన్ బాబు, విష్ణు, వీరి మధ్య అరగంట పాటు చర్చలు జరిగాయి. "మా" ఎన్నికల నేపధ్యంలో చెలరేగిన వివాదాలు, ప్రకాష్ రాజ్ ప్యానల్ రాజీనామాల గురించి చర్చించినట్లుగా తెలుస్తోంది. అందర్నీ కలుపుకుని.. వెళ్లాలని విష్ణుకు బాలకృష్ణ సూచించినట్లుగా తెలుస్తోంది. 


Also Read : నరేష్ తీరుపై టాలీవుడ్ పెద్దలు గుర్రు.. మంచును ముంచుతున్నారా? ‘మా’లో నారదముని ఎవరు?


బాలకృష్ణతో భేటీ తర్వాత మోహన్ బాబు, విష్ణు మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్‌కు ప్రతి రూపం బాలకృష్ణ అని మోహన్ బాబు వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో బాలకృష్ణ అల్లుడికి వ్యతిరేకంగా తాను మంగళగిరిలో ప్రచారం చేశానని.. అయినా మనసులో పెట్టుకోకుండా తన బిడ్డుకు మద్దతు ఇచ్చి ఓటు వేశారన్నారు. "మా" భవనం విషయంలో అండగా ఉంటామని బాలకృష్ణ హామీ ఇచ్చారన్నారు.  ఇండస్ట్రీలో పెద్దలందర్నీ కలుస్తున్నారని.. అందరినీ కలుపుకుని వెళ్తానని మంచు విష్ణు చెప్పారు. ఇప్పటికే కోటా శ్రీనివాసరావు, కైకాల సత్యనారాయణ, పరుచూరి బ్రదర్స్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నానన్నారు. 


Also Read : సింహాసనంపై కూర్చొని పెద్దరికం చలాయిస్తానని మా అన్నయ్య అనలేదు.. నాగబాబు కామెంట్స్


"మా" అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న విష్ణు ప్రమాణ స్వీకారం మ ాత్రం విడిగా చేయాలనుకుంటున్నారు. ఈ నెల 16వ తేదీన ఉదయం 11 గంటల 45 నిమిషాలకు ప్రమాణస్వీకారం చేస్తున్నట్లుగా చెప్పారు. ఈ కార్యక్రమానికి ఇండస్ట్రీ పెద్దలందర్నీ ఆహ్వానిస్తున్నామని అలాగే రాజీనామాలు చేసిన ప్రకాష్ రాజ్ ప్యానల్‌నూ ఆహ్వానిస్తున్నామన్నారు. వారితో కలిసి పని చేస్తామని ప్రకటించారు.  



మరో వైపు దసరా ఉత్సవాల సందర్భంగా నటి హేమ ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్నారు. కనకదుర్గమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ సిబ్బంది ఆమెకు తీర్థ ప్రసాదాలు అందించారు. దుర్గమ్మ దీవెనలు పొందడం ఆనందంగా ఉందని హేమ సంతోషం వ్యక్తం చేశారు. మా ఎన్నికలపైనాస్పందించారు. "రాత్రికి గెలిచి.. ఉదయానికే ఎలా ఓడిపోయామో తెలియడం లేదని.. దానికి గల కారణం అమ్మవారికైనా తెలుసో లేదో" అని సెటైరిక్‌గా స్పందించారు. ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ తరఫు నుంచి హేమ పోటీ చేసి ఓడిపోయారు.  


Also Read : మనీ లాండరింగ్‌ కేసులో నోరా ఫాతేహి, జాక్వలైన్‌ ఫెర్నాండేజ్‌కు సమన్లు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి