కంటెంట్ ఈజ్ కింగ్ అని మరోసారి ప్రూవ్ చేసిన సినిమా 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' (Miss Shetty Mr Polishetty Movie). కంటెంట్ ఉన్న కథకు స్టార్స్ సపోర్ట్ చేస్తే ఏ విధమైన రిజల్ట్ వస్తుందో బాక్సాఫీస్ బరిలో వస్తున్న వసూళ్లు... థియేటర్లలో జనాల నవ్వులు చెబుతున్నాయి. తెలుగు ప్రేక్షకులను నవ్వించిన, ఆకట్టుకున్న ఈ శెట్టి పోలిశెట్టిలు ఇప్పుడు మలయాళ ప్రేక్షకుల ముందుకు వెళుతున్నారు.


సెప్టెంబర్ 15న మలయాళంలో రిలీజ్
Miss Shetty Mr Polishetty Malayalam Release : సెప్టెంబర్ 15న... అనగా రేపు (ఈ శుక్రవారం) మలయాళంలో 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'ని విడుదల చేయనున్నట్లు ఈ రోజు చిత్ర బృందం వెల్లడించింది.


దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి నుంచి మొదలు పెడితే... అగ్ర కథానాయకులు చిరంజీవి, మహేష్ బాబు, రవితేజతో పాటు హీరోయిన్ సమంత తదితరులు 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' మీద ప్రశంసల జల్లు కురిపించారు. అందువల్ల, కేరళలో ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ లభించే అవకాశం ఉంది.    


తెలుగు చలన చిత్రసీమలో అగ్ర కథానాయికలలో ఒకరైన అనుష్క శెట్టి (Anushka)  సుమారు ఐదేళ్ల విరామం తర్వాత వెండితెరపై సందడి చేసిన సినిమా 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'. 'బాహుబలి 2', 'భాగమతి' చిత్రాల తర్వాత ఆమెకు థియేట్రికల్ రిలీజ్ ఇదే. ఇందులో ఆమెకు జోడీగా యువ హీరో నవీన్ పోలిశెట్టి నటించారు. 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ', 'జాతి రత్నాలు' తర్వాత దీంతో ఆయన హ్యాట్రిక్ అందుకున్నారు. 'రా రా కృష్ణయ్య' ఫేమ్ మహేష్ బాబు పి దర్శకత్వం వహించిన ఈ సినిమాను యువి క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మించారు. థియేటర్లలో విడుదలకు ముందు డిజిటల్ & శాటిలైట్ రైట్స్ అమ్మేశారు.


Also Read : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ డౌట్స్ తీర్చిన హరీష్ శంకర్






డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ నెట్‌ఫ్లిక్స్ చేతికి!
Miss Shetty Mr Polishetty OTT Platform : ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) దక్కించుంది. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'ని తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో థియేటర్లలో విడుదల చేశారు. ఓటీటీలో హిందీ భాషలో కూడా విడుదల అయ్యే ఛాన్సులు ఉన్నాయి. 


జీ టీవీకి 'శెట్టి పోలిశెట్టి' శాటిలైట్ రైట్స్!
Miss Shetty Mr Polishetty Satellite Rights : ఓటీటీ రైట్స్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంటే... శాటిలైట్ హక్కులను ప్రముఖ టెలివిజన్ నెట్వర్క్ జీ సొంతం చేసుకుంది. ఆ సంస్థకు చెందిన టీవీ ఛానళ్లలో సినిమా టెలికాస్ట్ అవుతుంది.


Also Read విజయ్ 'లియో'కి ఆ దేశంలో నో కట్స్ - మరి, మన దేశంలో? 


  


ఇంతకీ, 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' ఏంటి? అనేది చూస్తే... అన్విత శెట్టి (అనుష్క) ఎప్పటికీ పెళ్లి చేసుకోవాలని అనుకోదు. వివాహ బంధానికి ఆమె వ్యతిరేకం. దానికి కారణం ఆమె తల్లిదండ్రుల మధ్య జరిగిన పరిణామాలు! అయితే... తల్లి (జయసుధ) మరణం తర్వాత ఒంటరితనం ఫీలై... తనకు ఓ తోడు కావాలని, ఆ తోడు తన బిడ్డ అవ్వాలని పెళ్ళి చేసుకోకుండా బిడ్డకు జన్మ ఇవ్వాలని అనుకుంటుంది. అప్పుడు ఆమెకు సిద్ధూ పోలిశెట్టి (నవీన్ పోలిశెట్టి) పరిచయం అవుతాడు. ఆ తర్వాత ఏమైంది? అనేది కథ. 


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial