'బేబీ' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య.. ఫస్ట్ మూవీతోనే సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సాధించింది. ఒక్క సినిమాతోనే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది.. కుర్రాళ్ళ హాట్ ఫేవరేట్ గా మారిపోయింది. దీంతో ఈ మూవీ తర్వాత అమ్మడికి క్రేజీ ఆఫర్స్ వస్తాయని అందరూ భావించాయి. కానీ సినిమా విడుదలై నెలలు గడుస్తున్నా ఇంతవరకూ యంగ్ బ్యూటీ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ప్రకటన రాలేదు. అయితే ఇప్పుడిప్పుడే పలు సినిమాకు సైన్ చేయడం ద్వారా వైష్ణవి టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారుతోందని, త్వరలో సిద్ధు జొన్నలగడ్డ, అల్లు శిరీష్ వంటి యువ హీరోలతో జోడీ కట్టబోతోందని వార్తలు వస్తున్నాయి.


వైష్ణవి చైతన్య త్వరలో 'DJ టిల్లు' ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డతో రొమాన్స్ చేయనుందని గత కొన్ని రోజులుగా ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ‘టిల్లు స్క్వేర్’ చిత్రంలో నటిస్తోన్న సిద్ధు.. నందిని రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా కమిట్ అయ్యాడు. ఇదే క్రమంలో ఇటీవల బొమ్మరిల్లు భాస్కర్‌ తో ఓ చిత్రానికి పూజా కార్యక్రమాలు నిర్వహించాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా వైష్ణవి ని ఎంపిక చేసినట్లుగా నివేదికలు పేర్కొంటున్నాయి. 


బొమ్మరిల్లు భాస్కర్ సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు మంచి ప్రాధాన్యం ఉంటుందనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 'బొమ్మరిల్లు' లో జెనీలియా దగ్గర నుంచి, 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' లో పూజా హెగ్డే వరకూ అందరు కథానాయికలకు మంచి పేరొచ్చింది. ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డతో దర్శకుడు చేయబోయే మూవీలోనూ హీరోయిన్ రోల్ కీలకంగా ఉంటుందని తెలుస్తోంది. ఇది కచ్చితంగా వైష్ణవి చైతన్య కెరీర్ కు బాగా ఉపయోగపడుతుందని అంటున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Also Read: ఓవర్సీస్‌లో మనోడి క్రేజ్ మామూలుగా లేదుగా!


మరోవైపు 'బేబీ' నటి గీతా ఆర్ట్స్ వంటి మెగా బ్యానర్ లో నటించే ఛాన్స్ కొట్టేసిందని టాక్ నడుస్తోంది. అల్లు శిరీష్ హీరోగా బన్నీ వాసు ఓ సినిమాని ప్లాన్ చేస్తున్నారట. ఇందులో వైష్ణవి చైతన్యని హీరోయిన్ గా తీసుకోవాలని భావిస్తున్నారట. ఇప్పటికే మాస్ మూవీ మేకర్స్ సంస్థలో మరో మూవీ చేయడానికి అమ్మడు కమిటైనట్లు టాక్ ఉంది. మరి త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుందేమో చూడాలి. 


కాగా, సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన 'బేబీ' సినిమాలో వైష్ణవి చైతన్య నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. తొలి చిత్రంతోనే పలు రకాల షేడ్స్ ఉన్న పాత్రని అద్భుతంగా పండించిందనే పేరు తెచ్చుకుంది. మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వరకూ.. అనేక మంది అగ్ర కథానాయకులు తెలుగమ్మాయిని పొగడ్తలతో ముంచెత్తారు. అయితే ఫస్ట్ మూవీతో వచ్చిన క్రేజ్ ను ఉపయోగించుకొని ఎడాపెడా సినిమాలు చేయకుండా, తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలే చేయాలని వైష్ణవి భావిస్తోందట. కథల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోందట. తదుపరి ప్రాజెక్ట్ విషయంలో మరింత జాగ్రత్త వహిస్తోందని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. 


Also Read: కళ్లతోనే మాట్లాడేసుకుంటున్న నాని, మృణాల్!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial