టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ నవదీప్ చాలా కాలం తర్వాత హీరోగా నటిస్తున్న సినిమా 'లవ్ మౌళి'. నవదీప్ 2.0 అంటూ ఈ మూవీతో తనని తాను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతకుముందెన్నడూ చూడని విధంగా, పొడవాటి జుట్టు గుబురు గడ్డంతో సరికొత్త మేకోవర్ తో కనిపించి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఈ సినిమాలో పంఖురి గిద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. గతేడాది విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి స్పందనే వచ్చింది. అయితే ఇన్నాళ్లుగా సైలెంట్ గా ఉన్న నవదీప్.. మ్యూజికల్ అప్డేట్ తో మళ్ళీ ప్రచారం మొదలు పెట్టడానికి రెడీ అయ్యాడు. 


వినాయక చవితి స్పెషల్ గా 'లవ్ మౌళి' గీతం పేరుతో ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేయడానికి చిత్ర బృందం సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా లవ్ మౌళి ప్రపంచంలోకి తీసుకెళ్లే ఒక మ్యూజికల్ గ్లిమ్స్ అంటూ తాజాగా సాంగ్ ప్రోమోని సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేసారు. ''ప్రతి పూట గగనం మీన.. ఒక రంగే కనిపించేనా.. ఏ ప్రేమైనా ఒక రూపాన కలిసేనా..'' అంటూ సాగిన ఈ వీడియో ఆకట్టుకుంటోంది. ఇది నవదీప్, పంఖురి గిద్వానీ మధ్య లవ్ అండ్ ఎమోషన్ ను ఆవిష్కరిస్తోంది. 






Also Read: ఓవర్సీస్‌లో పోలిశెట్టి క్రేజ్ మామూలుగా లేదుగా!


'లవ్ మౌళి' గీతానికి గోవింద్ వసంత క్యాచీ ట్యూన్ కంపోజ్ చేయగా, గీత రచయిత అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించారు. అనీష్ కృష్ణన్ ఈ మెలోడీని ఆలపించారు. ఫుల్ సాంగ్ ని సెప్టెంబర్ 15వ తేదీన ఉదయం గం 11.45 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. నిజానికి హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి లాంచ్ చేసిన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తోనే ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షించింది. గతేడాది ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అగ్ర కథానాయిక కాజల్ అగర్వాల్ రిలీజ్ గ్లిమ్స్ లో నవదీప్ - పంఖురి గిద్వానీలు గాఢమైన లిప్ లాక్ కిస్ చేసుకుంటూ కనిపించి షాక్ ఇచ్చారు. మరో రెండు రోజుల్లో రాబోయే ఫస్ట్ సింగిల్ ఎలా ఉంటుందో చూడాలి. 


'లవ్ మౌళి' చిత్రానికి అవనీంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. నైరా క్రియేషన్స్, సి స్పేస్ గ్లోబల్ బ్యానర్‌స్ పై ప్రశాంత్ రెడ్డి తాటికొండ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కిరణ్ మామిడి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్న ఈ మూవీకి డైరెక్టర్ అవనీంద్ర సినిమాటోగ్రఫీ కూడా నిర్వహించడం విశేషం. డిఫెరెంట్ ప్రమోషనల్ కంటెంట్‌ తో సినీ వర్గాలను ఆకర్షించిన ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.


2004 లో 'జై' సినిమాతో హీరోగా పరిచయమైన నవదీప్.. మొదటి సినిమా, గౌతమ్ ఎస్.ఎస్.సి, చందమామ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే హీరో పాత్రలకే పరిమితం కాకుండా విల‌న్‌ గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌ గా కూడా నటించారు. ఈ క్రమంలో చేసిన 'ఆర్య 2', 'ఓ మై ఫ్రెండ్', 'బాద్ షా', 'ధృవ' 'నేనే రాజు నేనే మంత్రి' 'మోసగాళ్లు' వంటి సినిమాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. వెండితెరపైనే కాకుండా ఓటీటీలోనూ సత్తా చాటుతున్న నవదీప్.. ఇప్పుడు హీరోగా 'లవ్ మౌళి' మూవీతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.


Also Read: 'హాయ్‌ నాన్న' ఫస్ట్ సింగిల్ అప్‌డేట్‌ - మ్యూజికల్ హీట్‌ని పెంచే సమయం ఆసన్నమైంది!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial