Megastar Chiranjeevi Godfather Movie Update - Gaddar Role In Godfather Movie: మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా రూపొందుతోన్న 'గాడ్ ఫాదర్' సినిమాలో ప్రజా యుద్ధనౌక, చైతన్య గీతాల కళాకారుడు గద్దర్ నటించిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఆయనపై కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. అయితే... సినిమాలో గద్దర్ పాత్ర ఏమిటి? ఆయనతో చిరంజీవికి సన్నివేశాలు ఉన్నాయా? లేవా? వంటి ప్రశ్నలకు సమాధానాలు లభించాయి.

 

'గాడ్ ఫాదర్' సినిమాలో తాను నటించినట్టు 'ABP Desam'తో గద్దర్ కన్ఫర్మ్ చేశారు. అంతే కాదు, తన పాత్ర ఏమిటన్నది కూడా ఆయన వివరించారు. 'గాడ్ ఫాదర్' సినిమాలో కథరీత్యా చిరంజీవి జైలుకు వెళతారు. జైలులో చిరు, గద్దర్ మధ్య సన్నివేశాలు ఉన్నాయి. చిరంజీవి తండ్రికి స్నేహితుడిగా తాను కనిపిస్తానని గద్దర్ చెప్పారు. ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ చేశానని, తనకు మంచి పారితోషికం కూడా ఇచ్చారని ఆయన తెలిపారు. సినిమాలోనూ ఆయన పాత్ర విప్లవ చైతన్య గీతాల కళాకారుడిగా ఉంటుందట.


 

ప్రస్తుతం 'గాడ్ ఫాదర్' సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. చిరంజీవి, సల్మాన్ ఖాన్ మీద కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. మెగాస్టార్‌తో ఉన్న స్నేహం కారణంగా ఈ సినిమాకు సల్మాన్ పారితోషికం తీసుకోవడం లేదని టాక్. మోహన్ రాజా దర్శకత్వంలో... కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో చిరు సోదరిగా నయనతార కనిపించనున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఆల్రెడీ ఆయన రెండు ట్యూన్స్ ఇచ్చారని సమాచారం.