77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు జాతీయ జెండాలను ఎగురవేసి తమ దేశభక్తిని చాటుకున్నారు. రియల్‌ హీరోలు మీరే అంటూ సమరయోధుల్ని, అమరవీరుల త్యాగఫలాల స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ మువ్వన్నెల త్రివర్ణ పతాకానికి సెల్యూట్‌ చేశారు. 'హర్ ఘర్ తిరంగా'లో భాగంగా కొందరు సినీ తారలు తమ ఆఫీస్ ల దగ్గర జెండా ఎగురవేస్తే.. మరికొందరు సెట్స్‌లో జెండా వందనం చేసి స్వాతంత్ర్య వేడుకలను జరుపుకున్నారు. ఆ ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ నేపథ్యంలో మెగా మనవరాలు క్లిన్ కారా కొణిదెల కూడా తన ఫస్ట్ ఇండిపెండెన్స్ డేని సెలెబ్రేట్ చేసుకున్నట్లు ఆమె తల్లి ఉపాసన తెలిపింది. 


మెగా ప్రిన్సెస్ క్లిన్ కారా తన గ్రాండ్ పేరెంట్స్ తో కలిసి జెండా వందనం చేసినట్లు ఉపాసన కొణిదెల ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ''అమ్మమ్మ తాతయ్యలతో అమూల్యమైన క్షణాలు.. క్లిన్ కారా మొదటి స్వాతంత్ర్య దినోత్సవం.. ప్రతి ఇంట్లో త్రివర్ణ పతాకం.. జైహింద్ '' అని ట్వీట్ చేశారు. దీనికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను ట్యాగ్ చేస్తూ, తన కుమార్తెకు జెండా వందనానికి సంబంధించిన పిక్స్ షేర్ చేశారు. ఇందులో కొణిదెల వారసురాలు తన అమ్మమ్మ తాతయ్యలతో కలిసి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడం మనం చూడొచ్చు. ఈ మనోహరమైన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. 






Also Read: మాస్ కా దాస్ 'ఫ్యామిలీ ధమాకా' - హోస్ట్ అవతారమెత్తిన విశ్వక్ సేన్!


కాగా, రామ్ చరణ్, ఉపాసన దంపతులు జూన్ 20న ఓ బిడ్డకు జన్మనిచ్చి తల్లిదండ్రులుగా మారిన సంగతి అందరికీ తెలిసిందే. తన మెగా మనవరాలికి ‘క్లిన్ కారా కొణిదెల’ అని నామకరణం చేసినట్లు మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. లలితా సహస్ర నామం నుండి పేరు పెట్టామని, ‘క్లిన్ కారా’ ప్రకృతి స్వరూపాన్ని సూచిస్తుందని, చాలా శక్తిగలదని అర్ధం వస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా క్లిన్ కారాతో ఉన్న ఫోటోలను పంచుకున్నారు. 


మెగా ప్రిన్సెస్ వచ్చినప్పటి నుంచి కొణిదెల ఫ్యామిలీలో సంతోషాలు రెట్టింపు అయ్యాయి. ఆమె సరైన సమయంలోనే తమ జీవితాల్లోకి అడుగుపెట్టిందని, పాపను పట్టుకున్న తొలి క్షణం తనకు ఎంతో సంతోషంగా అనిపించిందని ఈ స్పెషల్ వీడియాలో చెప్పుకొచ్చారు రామ్ చరణ్. మరోవైపు ఉపాసన తన గారాలపట్టికి సంబంధించిన ప్రతీ విషయాన్ని ఎంతో మెమరబుల్ గా మార్చే ప్రయత్నం చేస్తోంది. 


చెంచు తెగలకు చెందిన ప్రజలకు సంబంధించిన సాంప్రదాయాలు నృత్యాల మధ్య క్లిన్ కారాకి నామకరణం చేయించారు ఉపాసన. తన బిడ్డను చెంచు తెగలో భాగం కావాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. అలానే అడవులు వన్యప్రాణుల పట్ల వారి ప్రేమను తెలియజేసేలా కారా కోసం ఇంట్లో సరికొత్త టెంపుల్ ట్రీ నర్సరీని డిజైన్ చేయించినట్లు ఓ వీడియో పంచుకున్నారు. ఇప్పుడు బేబీ క్లిన్ కారా పుట్టిన తర్వాత వచ్చిన తన మొదటి స్వాతంత్ర్య దినోత్సవాన్ని కూడా ప్రత్యేకంగా మార్చాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా తన గ్రాండ్ పేరెంట్స్ తో కలిసి నేషనల్ ఫ్లాగ్ ను ఎగురవేశారు. 


Also Read: Indian 2: ఇండిపెండెన్స్ డే స్పెషల్: సేనాపతి లుక్‌లో కమల్ హాసన్ సర్‌ప్రైజ్


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial