మీనాక్షి చౌదరి... మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018, ఫెమినా మిస్ ఇండియా 2018 రన్నరప్. మిస్ ఇండియా హర్యానా విన్నర్. అందాల పోటీల నుంచి సినిమాల్లోకి కథానాయికగా వచ్చిన అమ్మాయి. మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary)కి స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. కానీ, ఆ సినిమాల్లో ఆమె ఎక్కడ ఉంది అని వెతుక్కోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. మహేష్ బాబు, విజయ్ సినిమాల్లో ఆమె క్యారెక్టర్ కూరలో కరివేపాకు అన్నట్టు తయారయ్యింది.


అప్పుడు గుంటూరు కారం... ఇప్పుడు విజయ్ 'ది గోట్'!
సూపర్ స్టార్ మహేష్ బాబుతో నటించే అవకాశం వస్తే ఏ హీరోయిన్ అయినా సరే ఎగిరి గంతేస్తుంది. మీనాక్షి చౌదరి కూడా అంతే! బుట్ట బొమ్మ పూజా హెగ్డే 'గుంటూరు కారం' నుంచి తప్పుకోవడం, ఆమె బదులు శ్రీ లీలను మెయిన్ హీరోయిన్ చేయడంతో సెకండ్ హీరోయిన్ ప్లేస్ ఖాళీ అయ్యింది. ఆ అవకాశం మీనాక్షి అందుకుంది. తీరా సినిమా విడుదల అయ్యాక చూస్తే... ఆ మాత్రం పాత్రకు ఇంకో కథానాయికను తీసుకోవడం ఎందుకు అనే కామెంట్స్ వినిపించాయి.


మీనాక్షి చౌదరికి సరైన క్యారెక్టర్ ఇవ్వలేదని, ఆమె పాత్రకు 'గుంటూరు కారం'లో సరైన ప్రాముఖ్యం లేదని సోషల్ మీడియాలో ట్రోల్స్ నడిచాయి. శ్రీ లీల కంటే మీనాక్షి బెటర్ అని కామెంట్స్ చేసిన నెటిజన్స్ కూడా ఉన్నారు. కట్ చేస్తే... దళపతి విజయ్ 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం' సినిమా వచ్చింది. అందులోనూ మీనాక్షి చౌదరి పరిస్థితి ఘోరం. 


'ది గోట్' సినిమాలో మీనాక్షి చౌదరి యంగ్ హీరోయిన్. విజయ్ డ్యూయల్ రోల్ చేయగా... యంగ్ విజయ్ పక్కన నటించింది. కానీ, ఆవిడ కంటే సీనియర్ హీరోయిన్ స్నేహకు ఎక్కువ సీన్లు ఉన్నాయి. ప్రజెంట్ తెలుగు సినిమాల్లో వదిన క్యారెక్టర్లకు స్నేహ షిఫ్ట్ అయ్యారు. 'ది గోట్' కథలో ఆవిడ వయసుకు తగ్గ పాత్ర లభించింది. కానీ, మీనాక్షి చౌదరికి అన్యాయం జరిగింది. స్నేహ క్యారెక్టర్ లేకుండా 'ది గోట్'ను ఊహించలేం. కానీ, మీనాక్షి చౌదరి క్యారెక్టర్ తీసేసినా సినిమాకు వచ్చే నష్టం ఏమీ లేదన్నట్టు ఉంది. ఒక ట్విస్ట్‌లో ఆమె క్యారెక్టర్ ఉంటుంది. ఆమె బదులు అక్కడ మరొక పాత్రను వాడుకునే అవకాశం ఉంది. 


సాంగ్ కోసమే మీనాక్షి చౌదరిని తీసుకున్నారా?
విజయ్ సినిమా అంటే అభిమానులు ఆశించే సాంగ్స్ తప్పకుండా ఉండాలి, ఉంటాయి కూడా! యంగ్ హీరోయిన్ పక్కన విజయ్ స్టెప్పులు వేయాలి కాబట్టి మీనాక్షి చౌదరి మీద ఒక పాట తీసినట్టు ఉన్నారు. ఆ సాంగ్ ముందు లీడ్ సీన్ కూడా భలే గమ్మత్తుగా ఉంది. హీరో హీరోయిన్లు ముద్దు పెట్టుకుంటారు. ఆ తర్వాత 'నన్ను ఇందు కోసమే పిలిచావా?' అని హీరోయిన్ అడుగుతుంది. అప్పుడు 'కాదు, సాంగ్ కోసం' అంటాడు హీరో. ఆ తర్వాత సాంగ్ వస్తుంది. పాపం... తెలుగులో మహేష్, తమిళంలో విజయ్ వంటి హీరోల పక్కన సినిమాలు చేసే అవకాశం వచ్చినా మీనాక్షి చౌదరికి విజయాలు రాలేదు.


Also Readవిజయ్ 'ది గోట్'కి సీక్వెల్... పవన్ కల్యాణ్ టైటిల్ మీద కన్నేసిన దళపతి



మీనాక్షి లైనప్... మంచి సినిమాలే!
తెలుగులో 'ది గోట్'కు హిట్ టాక్ రాలేదు. అయినా మీనాక్షి చౌదరికి వచ్చిన నష్టం ఏమీ లేదని చెప్పాలి. ప్రజెంట్ ఆవిడ చేతిలో మూడు మంచి సినిమాలు ఉన్నాయి. దుల్కర్ సల్మాన్ 'లక్కీ భాస్కర్'లో మీనాక్షి మెయిన్ హీరోయిన్. వరుణ్ తేజ్ 'మట్కా', విశ్వక్ సేన్ 'మెకానిక్ రాకీ'లో నటిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర'లోనూ మెయిన్ రోల్ చేస్తున్నారని టాక్.


Also Readహీరోయిన్లూ... బాధ్యత ఉండక్కర్లా? అనన్య నాగళ్ళ, స్రవంతిని చూసి సిగ్గు పడండి - కోట్లు కావాలి, ప్రజల కష్టాలు పట్టవా?