Mansoor Ali Khan Movie: కోలీవుడ్‌లో చాలాకాలంపాటు కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడు మన్సూర్ అలీ ఖాన్. ఎన్నో ఏళ్లుగా టాలీవుడ్, కోలీవుడ్‌లో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పనిచేసిన మన్సూర్.. హీరోయిన్ త్రిషపై చేసిన కామెంట్స్ దుమారాన్నే సృష్టించాయి. తనపై కేసు ఫైల్ అయ్యేలా చేశాయి, కోర్టు మెట్లు ఎక్కించాయి. ఇక ఇప్పుడిప్పుడే ప్రేక్షకులు ఈ విషయాన్ని మర్చిపోతున్నారు. ఇంతలోనే మన్సూర్ అలీ ఖాన్ హీరోగా ఒక సినిమా విడుదలయ్యింది. ‘సరక్కు’ అనే టైటిల్‌తో ఈ చిత్రం తాజాగా తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ మూవీని థియేటర్లలో చూసిన ప్రేక్షకులు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.


‘సరక్కు’ రిలీజ్..
జయకుమార్ కే దర్శకత్వంలో తెరకెక్కిన ‘సరక్కు’లో మన్సూర్ అలీ ఖాన్.. లాయర్ ప్రొఫెషన్‌లో ఉన్నా కూడా తాగుడుకు బానిసైన వ్యక్తిగా కనిపించాడు. దాని కారణంగానే తను ఎన్నో సమస్యలను ఎదుర్కుంటాడని, అవన్నీ దాటి మళ్లీ మామూలు మనిషి ఎలా అవుతాడు అనేదే ‘సరక్కు’ కథ అని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇక సినిమా కూడా దాదాపు ఇదే కథతో కొనసాగిందని రివ్యూలు చెప్తున్నాయి. ఇప్పటికే మన్సూర్ అలీ ఖాన్ కాంట్రవర్సీ ఇంకా పూర్తిగా ముగిసిపోకపోవడంతో సినిమాను చూడడానికి చాలామంది ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లారు. చూసినవారిలో చాలామంది ఈ పాత్ర.. మన్సూర్ అలీ ఖాన్ రియల్ లైఫ్ క్యారెక్టర్‌కు దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుందని కామెంట్స్ చేస్తున్నారు.


త్రిషపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు..
కొన్నాళ్ల క్రితం విజయ్, త్రిష హీరోహీరోయిన్లుగా నటించిన ‘లియో’లో ఒక చిన్న విలన్ పాత్ర పోషించాడు మన్సూర్ అలీ ఖాన్. అయితే ఈ మూవీకి సంబంధించిన ఈవెంట్‌లో పాల్గొన్న మన్సూర్.. త్రిషతో బెడ్‌రూమ్ సీన్ ఉంటుందని ఆశపడ్డానని, కానీ అలాంటిది ఏమీ లేకపోగా.. త్రిషను అసలు తనకు చూపించలేదని ఫీల్ అయ్యానని వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలు ప్రేక్షకులకు అభ్యంతరంగా అనిపించాయి. ప్రేక్షకులకు మాత్రమే కాదు.. హీరోయిన్ త్రిషకు, ‘లియో’ను తెరకెక్కించిన లోకేశ్ కనకరాజ్‌కు కూడా మన్సూర్ చేసిన వ్యాఖ్యలు నచ్చలేదు. అందుకే సోషల్ మీడియాలో వేదికగా తన వ్యాఖ్యలను ఖండించారు. తనతో పాటు మరెందరో టాలీవుడ్, కోలీవుడ్ సెలబ్రిటీలు కూడా మన్సూర్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు.


హైప్ క్రియేట్ చేసిన కాంట్రవర్సీ..
సారీ చెప్తే ముగిసిపోయే విషయంలో మన్సూర్ అలీ ఖాన్ ఈగోను చూపించాడు. అందుకే తనపై కేసు ఫైల్ అయినా కూడా త్రిషకు సారీ చెప్పను అంటూ మొండిగా డిసైడ్ అయ్యాడు. ఫైనల్‌గా పరిస్థితి చేయి దాటిపోతుందని గమనించి తానే మళ్లీ తానే ముందుకొచ్చి సారీ చెప్పాడు. అయినా అంతా ముగిసిపోయింది అనుకునే సమయానికి త్రిషపై, మరికొందరు సినీ సెలబ్రిటీలపై మన్సూర్ కేసు ఫైల్ చేశాడు. వారిపై పరువునష్టం దావాను వేశాడు. కానీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది మన్సూరే కావడంతో.. ఈ కాంట్రవర్సీ తన దగ్గర నుండే మొదలయ్యిందని కోర్టు.. ఈ కేసును కొట్టిపారేసింది. ఇంత కాంట్రవర్సీ జరగడంతో.. ఇంతా మన్సూర్ నటించిన ‘సరక్కు’ చిత్రానికి తగినంత హైప్‌ను క్రియేట్ చేసిందని పలువురు ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


Also Read: ‘డెవిల్’ సీక్వెల్‌పై కళ్యాణ్ రామ్ క్లారిటీ, కథ ఇదేనట - మీకూ నచ్చేస్తాది