'ఆర్ఎక్స్ 100'తో తెలుగు చిత్రసీమ దృష్టిని తనవైపు తిప్పుకొన్న దర్శకుడు అజయ్ భూపతి (Ajay Bhupathi). ఆ సినిమా తర్వాత శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా 'మహా సముద్రం' తీశారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన తాజా సినిమా 'మంగళవారం' (Mangalavaram Movie). ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎం నిర్మిస్తున్నారు. ఇందులో పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput) ఓ ప్రధాన పాత్రధారి. ఆల్రెడీ రిలీజైన 'గణగణ మోగాలిరా' పాట, ప్రచార చిత్రాలు సినిమాపై ప్రేక్షకుల చూపు పడేలా చేశారు. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే... సినిమా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయ్యింది.
నవంబర్ 17న 'మంగళవారం' పాన్ ఇండియా రిలీజ్!
Mangalavaram Release Date : 'మంగళవారం' చిత్రాన్ని నవంబర్ 17న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు ఈ రోజు దర్శక, నిర్మాతలు ప్రకటించారు.
విడుదల తేదీ వెల్లడించిన సందర్భంగా దర్శకుడు అజయ్ భూపతి మాట్లాడుతూ ''గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించిన రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. సినిమాలో ఉన్న ప్రతి పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు ఎవరు మంచి? ఎవరు చెడు? అనేది కనిపెట్టలేని విధంగా కథ, కథనాలు ముందుకు వెళతాయి. పాయల్ క్యారెక్టర్ చూస్తే ప్రేక్షకులు షాక్ అవుతారు. థియేటర్లలో డిఫరెంట్ థ్రిల్ ఇచ్చే చిత్రమిది'' అని చెప్పారు.
Also Read : డిసెంబర్‌లో 'సలార్' - షారుఖ్ ఖాన్ 'డంకీ'తో పోటీకి ప్రభాస్ రెడీ!?
అజయ్ భూపతి ట్రెండ్ సెట్ చేస్తారు!
'ఆర్ఎక్స్ 100'తో తెలుగులో ఏ విధంగా అయితే కొత్త ట్రెండ్ సెట్ చేశారో... ఇప్పుడు 'మంగళవారం'తో కూడా అజయ్ భూపతి సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తారని నిర్మాతలు స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎం తెలిపారు. ఇంకా వారు మాట్లాడుతూ ''ఇదొక డిఫరెంట్ అటెంప్ట్. ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ మీద ఎవరూ ప్రయత్నించని విధంగా అజయ్ భూపతి సినిమా తీశారు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం... 'విక్రమ్ వేద', 'కాంతార', 'విక్రాంత్ రోణ' చిత్రాలకు పని చేసిన, రామ్ చరణ్ 'రంగస్థలం' సినిమాతో జాతీయ పురస్కారం అందుకున్న ఎంఆర్ రాజా కృష్ణన్ సౌండ్ డిజైన్ హైలైట్ అవుతాయి'' అని చెప్పారు. సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యిందని, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నామని తెలిపారు.
Also Read : వాట్సాప్ ఛానల్ స్టార్ట్ చేసిన టాలీవుడ్ ప్రముఖులు ఎవరు? ఎవరి ఫాలోయింగ్ ఎంత?
'మంగళవారం' చిత్రానికి అజయ్ భూపతి 'A' క్రియేటివ్ వర్క్స్ నిర్మాణ భాగస్వామి. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎంతో కలిసి ఆ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. శ్రీ తేజ్, చైతన్య కృష్ణ, అజయ్ ఘోష్, లక్ష్మణ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : దాశరథి శివేంద్ర, కూర్పు : మాధవ్ కుమార్ గుళ్ళపల్లి, మాటలు : తాజుద్దీన్ సయ్యద్ - రాఘవ్, కళా దర్శకత్వం : మోహన్ తాళ్లూరి, ఫైట్ మాస్టర్స్ : రియల్ సతీష్ - పృథ్వీ, నిర్మాతలు : స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎం, కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం : అజయ్ భూపతి.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial