ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. సరైన అవకాశాలు రావాలి గానీ, ప్రతి ఒక్కరూ సానపట్టిన వజ్రంలా మారుతారు. అలా మారిన అమ్మాయే మలీషా ఖర్వా.  14 ఏండ్ల వయసులోనే ఎన్నో అద్భుత అవకాశాలు దక్కించుకుని విజయపథాన ముందుకు సాగుతోంది.

  


మురికివాడ నుంచి లగ్జరీ బ్రాండ్ అంబాసిడర్ గా


ముంబైలోని అతిపెద్ద మురికివాడ ధారవిలో నివసించే మలీషా ఖర్వా, ప్రస్తుతం ప్రపంచ ప్రఖ్యాత లగ్జరీ బ్యూటీ బ్రాండ్ కు అంబాసిడర్ గా ఎంపిక అయ్యింది.ఫారెస్ట్‌ ఎసెన్షియల్స్‌ కంపెనీ నూతనంగా మొదలు పెట్టిన ‘ది యువతి కలెక్షన్‌’ బ్రాండ్ అంబాసిడర్ గా మలీషాను ఎంపిక చేసింది. మలీషాను తమ సంస్థలోకి ఆహ్వానిస్తున్నట్లు ప్రకటిస్తూ ఓ అద్భుతమైన వీడియోను ఫారెస్ట్ ఎసెన్షియ‌ల్స్ సంస్థ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. బ్రాండ్‌ స్టోర్‌లోకి వెళ్లి అక్కడ ప్రదర్శనకు ఉంచిన తన ఫోటోలను చూస్తూ ఆనందంతో మురిసిపోతున్న మలీషాను చూసి నెటిజన్లు వారెవ్వా అంటున్నారు. అందరి మదిని దోచుకునేలా ఉన్న ఈ వీడియోకు మిలియన్ల కొద్ది వ్యూస్ వస్తున్నాయి. మలీషాకు దక్కి గొప్ప అవకాశంగా పలువురు అభివర్ణిస్తున్నారు. ఆమె మరెన్నో ఉన్నత స్థానాలకు ఎదగాలని నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు.   


ఫారెస్ట్‌ ఎసెన్షియల్స్‌ తనను బ్రాండ్ అంబాసిడర్ గా ఎంచుకోవడం పట్ల మలీషా సంతోషం వ్యక్తం చేసింది. ప్రపంచ ప్రఖ్యాత ఫారెస్ట్‌ ఎసెన్షియల్స్‌ బ్రాండ్ కు అంబాసిరగ్ గా ఎంపిక కావడం, ఆ సంస్థతో కలిసి పని చేయడం తనకు దక్కిన గౌరవంగా అభివర్ణించింది. రానున్న కాలంలో తాను మోడల్ గా రాణించాలి అనుకుంటున్నట్లు తెలిపింది. చదువు తనకు మొదటి ప్రాధాన్యత అని, దాన్ని నిర్లక్ష్యం చేయకుండానే మోడలింగ్ లో రాణించాలి అనుకుంటున్నట్లు వెల్లడించింది.  






రెండు హాలీవుడ్ చిత్రాల్లో నటించే అవకాశం


సోషల్ మీడియా ద్వారా గుర్తింపు తెచ్చుకు మలీషాలోని ప్రతిభను మూడు సంవత్సరాల క్రితం హాలీవుడ్ డైరెక్టర్ రాబర్ట్‌ హాఫ్మన్ కనపెట్టారు. మలీషా కోసం గో ఫండ్‌ మీ పేజ్‌ ఓపెన్ చేశారు. ప్రస్తుతం ఆమెకు ఇన్ స్టాలో  2, 25,000 మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. రీసెంట్ గా పలు మోడలింగ్ షోలలో పాల్గొన్నది. ర్సాలా ఖురేషి’, జాన్ సాగూ తెరకెక్కించిన ‘లివ్ యువర్ ఫెయిరీటేల్’ అనే  షార్ట్ ఫిల్మ్‌ లో కూడా నటించింది మలీషా. అంతేకాదు ప్రస్తుతం రెండు హాలీవుడ్ సినిమాల్లో నటించే అవకాశం కూడా దక్కించుకుంది. ఇకపై తన కెరీర్ మరోలా మారిపోయే అవకాశం ఉందని భావిస్తోంది మలీషా. మురికి వాడల నుంచి వచ్చినా, తమలో టాలెంట్ ఉంటే, ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని నిరూపించింది ఈ 14 ఏండ్ల అమ్మాయి. మలీషా జీవిత కథ ఎంతో మంది స్ఫూర్తిదాయంగా చెప్పుకోవచ్చు. అవకాశాలు లేవని నిరాశ చెందకుండా, అవకాశాలు సృష్టించుకుంటూ ముందుకు సాగాలి అని నిరూపిస్తోంది మలీషా.    






Read Also: లారెన్స్ బిష్ణోయ్ హిట్ లిస్ట్‌లో నెంబర్ వన్ సల్మాన్ ఖాన్, సిద్ధూ మూసే వాలా మేనేజర్ కూడా..