'మైదాన్' (Maidaan Movie)లో అజయ్ దేవగణ్ సరసన ప్రియమణి (Priyamani Raj) నటించారు. అయితే, ఈ సినిమాకు ఆవిడ ఫస్ట్ ఛాయస్ కాదు. అవును... 'మైదాన్' సినిమా మొదలైనప్పుడు అందులో హీరోయిన్ ప్రియమణి కాదు. మరి, ఎవరు? అంటే కీర్తి సురేష్ (Keerthy Suresh). దర్శక నిర్మాతలతో పాటు హీరో సైతం ముందు ఓకే చేసినది ఆమెనే. అయితే, కొన్ని రోజుల చిత్రీకరణ తర్వాత కీర్తి సురేష్ ఆ సినిమా నుంచి తప్పుకొన్నారు. ఆమె బదులు ప్రియమణిని ఎంపిక చేశారు.


కీర్తి సురేష్ వదిలేయడం మంచిదయ్యింది
'మైదాన్' ఇవాళ రాత్రి (ఏప్రిల్ 10న) నుంచి థియేటర్లలో విడుదల అవుతోంది. ఈ చిత్రాన్ని కొన్ని స్క్రీన్లలో ప్రదర్శించనున్నారు. ప్రీమియర్ షోలు ప్లాన్ చేశారు. ఆల్రెడీ మీడియాకు సినిమా చూపించారు. 'మైదాన్' చూసిన విమర్శకులు, చిత్ర పరిశ్రమ ప్రముఖులు హీరోయిన్ క్యారెక్టర్ కీర్తి సురేష్ చెయ్యకుండా వదిలెయ్యడం మంచిదయ్యిందని అభిప్రాయపడ్డారు.


Also Readమైదాన్ రివ్యూ: ఫుట్‌ బాల్ కోచ్ రహీమ్ బయోపిక్ - అజయ్ దేవగణ్ సినిమా ఎలా ఉందంటే?


అజయ్ దేవగణ్ సరసన కీర్తి సురేష్ మరీ చిన్నదానిలా కనిపిస్తుందని 'మైదాన్' ప్రొడ్యూసర్ బోనీ కపూర్, దర్శకుడు అమిత్ శర్మ భావించడంతో పాటు ఆ విషయాన్ని ఆమెకు చెప్పారు. పరస్పర అంగీకారంతో కీర్తి సురేష్ 'మైదాన్' నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత ప్రియమణిని సెలెక్ట్ చేశారు.


అజయ్ భార్యగా... పిల్లాడికి తల్లిగా...
కీరి సురేష్ చేస్తే అసలు బాగోదు!
'మైదాన్' చూసిన జనాల ఫీలింగ్ ఒక్కటే... స్టోరీ పీరియడ్ పదేళ్ల పాటు ఉంటుంది. అజయ్ దేవగణ్, ప్రియమణి భార్యాభర్తలుగా నటించారు. సినిమా ప్రారంభంలో ఆ దంపతుల కుమారుడిని చిన్న పిల్లాడిగా చూపించారు. తర్వాత నేషనల్ ఫుట్ బాల్ జట్టుకు ఎంపిక అయినట్టు చూపించారు. అంత పెద్ద పిల్లాడికి తల్లిగా కీర్తి సురేష్ అంటే అసలు బాగోదునేది ఆడియన్స్ మాట.
'మహానటి'తో కీర్తి సురేష్ ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత 'మైదాన్' యాక్సెప్ట్ చేసి, చివరకు వదిలేశారు. ఆమె బదులు సెలెక్ట్ చేసిన ప్రియమణి కూడా నేషనల్ అవార్డు విన్నర్. ఆ సంగతి పక్కన పెడితే... త్వరలో వరుణ్ ధావన్ సినిమా 'బేబీ జాన్' సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి కీర్తి సురేష్ ఇంట్రడ్యూస్ అవుతున్నారు.


Also Read: శర్వానంద్ 38వ సినిమా ఫిక్స్ - డిఫరెంట్ ఫిల్మ్ మేకర్‌ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్!?



'మైదాన్' విషయానికి వస్తే... ఇండోనేషియాలో జరిగిన ఏషియన్ గేమ్స్ పోటీల్లో ఇండియాకు గోల్డ్ మెడల్ తెచ్చిన ఫుల్ బాల్ టీం కోచ్, హైదరాబాదీ సయ్యద్ అహ్మద్ రహీమ్ (Football Coach Syed Abdul Rahim) జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. విమర్శకుల నుంచి ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోంది. మరి, థియేటర్లలో ప్రేక్షకుల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.


Also Readఆ హిట్ సినిమాలు మిక్సీలో వేస్తే వచ్చిన కిచిడీ 'ఫ్యామిలీ స్టార్' - రామ రామ... ఏంటిది పరశురామా?