Guntur Kaaram World TV Premiere : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన 'గుంటూరు కారం' సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అతడు, ఖలేజా వంటి సినిమాల తర్వాత త్రివిక్రమ్ - మహేష్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా కావడంతో ఆడియన్స్ తో పాటూ ఇండస్ట్రీ వర్గాల్లోనూ సినిమాపై ఆసక్తి నెలకొంది. అయితే రిలీజ్ తర్వాత సినిమాకి ఆశించిన రెస్పాన్స్ రాలేదు. ఫ్యామిలీ ఆడియన్స్, మహేష్ ఫ్యాన్స్ ని తప్పితే నార్మల్ ఆడియన్స్ ని ఈ సినిమా అంతగా మెప్పించలేకపోయింది. కానీ సినిమాలో మహేష్ మాస్ లుక్, క్యారెక్టరైజేషన్, డైలాగ్స్, డాన్స్.. అన్ని ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయించాయి. అలాగే టాప్ తో సంబంధం లేకుండా ఈ సినిమాకి బాక్సాఫీస్ వద్ద 2500 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి ఇక రీసెంట్ గానే ఓటీటీలో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చిన ఈ సినిమా ఇప్పుడు టీవీల్లోకి వచ్చేస్తోంది.


'గుంటూరు కారం' టీవీల్లోకి వచ్చేది అప్పుడే..


'గుంటూరు కారం' మూవీ థియేటర్ రన్ ముగిసిన 28 రోజులకు నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ అయింది. తెలుగు తో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చిన ఈ సినిమా ఓటీటీ ప్లాట్ ఫామ్ లోనూ భారీ వ్యూస్తో అదరగొట్టింది. ముఖ్యంగా 'గుంటూరు కారం' హిందీ వెర్షన్ కి విపరీతమైన ఆదరణ లభించింది. 'సలార్' హిందీ వర్షన్ కంటే 'గుంటూరు కారం' హిందీ వర్షన్ కే ఎక్కు వ వ్యూస్ రావడం విశేషం. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న 'గుంటూరు కారం' అతి త్వరలోనే బుల్లితెరపై సందడి చేయబోతోంది.


తాజా సమాచారం ప్రకారం.. ఏప్రిల్ 9న ఉగాది పండుగ సందర్భంగా 'గుంటూరు కారం' మూవీని టీవీలో టెలికాస్ట్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ని జెమినీ టీవీ భారీ ధరకు దగ్గించుకుంది. ఈ క్రమంలోనే పండుగ సమయంలో సినిమాని టెలికాస్ట్ చేస్తే మంచి TRP వస్తుందని నిర్వాహకులు భావిస్తున్నారట. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ ఉగాది పండక్కి జెమినీ టీవీలో 'గుంటూరు కారం' సినిమాని టీవీలో చూసేవచ్చు. త్వరలోనే దీనికి సంబంధించి మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రానుంది.


'SSMB29' లాంచ్ ఎప్పుడంటే..


'గుంటూరు కారం' తర్వాత మహేష్ బాబు తన తదుపరి సినిమాని ఎస్.ఎస్ రాజమౌళితో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుని పాన్ వరల్డ్ లెవెల్ లో సుమారు రూ.1000 నుంచి రూ.1200 కోట్ల బడ్జెట్ తో రూపొందించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ లాస్ట్ స్టేజ్ లో ఉంది. ఆల్రెడీ స్క్రిప్ట్ పనులు పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్టుని ఏప్రిల్ నెలలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమా ప్రారంభోత్సవానికి హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్స్ అయిన జేమ్స్ కామెరూన్, స్టీవెన్ సీల్ బర్గ్ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.


Also Read : 'హనుమాన్‌' ఓటీటీ అప్‌డేట్‌పై ఫ్యాన్స్‌ ఫైర్ - స్ట్రీమింగ్‌ ఆలస్యంపై వివరణ ఇచ్చిన డైరెక్టర్ ప్రశాంత్‌ వర్మ