Prasanth Varma Tweet On Hanuman OTT Delay: హనుమాన్‌ ఓటీటీ ఆలస్యంపై తాజాగా దర్శకుడు ప్రశాంత్‌ వర్మ స్పందించారు. నిన్న హనుమాన్‌ ఓటీటీ అప్‌డేట్‌ ఇస్తూ జీ5(Zee5 OTT Platform) అధికారిక ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ అప్‌డేట్‌ చూసి తెలుగు ఆడియన్స్‌ అంతా అసహనానికి గురయ్యారు.  ఈక్రమంలో ప్రశాంత్‌ వర్మ తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ షేర్‌ చేశారు. ఈ సందర్భంగా హనుమాన్‌ ఓటీటీ ఆలస్యంపై ఆయన ఇలా వివరణ ఇచ్చారు. అయితే, హనుమాన్‌ తెలుగు ఓటీటీ రిలీజ్‌ కోసం టాలీవుడ్‌ సినీ లవర్స్‌ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మధ్య మూవీ రిలీజైన వెంటనే ఓటీటీ ప్లాట్‌ఫాం ఏదో చెప్పేస్తున్నారు.


కానీ హనుమాన్‌ రిలీజై రెండు నెలల కావస్తున్న స్ట్రీమింగ్‌ అప్‌డేట్, ఓటీటీ ప్లాట్‌ఫాం ఏదనేది కన్‌ఫాం చేయలేదు.  Zee5 సంస్థ హనుమాన్‌ ఓటీటీ రైట్స్‌ దక్కించుకున్నట్టు వార్తలు వచ్చాయి కానీ, నిన్నటి వరకు దీనిపై ఆఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ లేదు. ఇక అంతా తెలుగు హనుమాన్‌ కోసం వెయిట్‌ చేస్తుంటే హిందీ వెర్షన్‌ని స్ట్రీమింగ్‌కు తీసుకువచ్చారు. ఇది తెలుగు ఆడియన్స్‌ని మరింత అసహనానికి గురి చేసింది. ఇక ఫైనల్‌ మూవీ ఓటీటీ అప్‌డేట్‌పై నిన్న(మార్చి 14) అధికారిక ప్రకటన ఇచ్చారు. కానీ దీనిపై ఫ్యాన్స్‌, మూవీ లవర్స్‌ మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా స్ట్రీమింగ్‌ డేట్‌ ఇచ్చేస్తారనుకుంటే.. ఇంకా కమ్మింగ్‌ సూన్‌ అంటారేంటిరా! వరస్ట్‌ ఓటీటీ అంటూ జీ5 సంస్థపై విరుచుకుపడ్డారు.


మమ్మల్ని అర్థం చేసుకోండి..


ఈ ఓటీటీ చానల్‌ను అన్‌సబ్‌స్క్రైబ్‌ చేయాలని, రిలీజ్‌ డేట్‌ ఇవ్వకుండ కమ్మింగ్‌ సూన్‌ అంటుందంటూ మండిపడ్డారు. ఈ అప్‌డేట్‌పై నిరాశలో ఫ్యాన్స్‌ని కూల్‌ చేసేందుకు ఏకంగా ప్రశాంత్‌ వర్మ రంగంలోకి వచ్చారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేస్తూ.. "హనుమాన్‌ ఓటీటీ స్ట్రీమింగ్‌ ఆలస్యం కావాలని చేస్తుంది కాదు. మీకు వీలైనంత త్వరగా సినిమాను మీ ముందుకు తీసుకువచ్చేందుకు మా టీం అవిశ్రాంతంగా పనిచేస్తుంది. మీకు ఎప్పుడు ఉత్తమైనది అందించాలనే మా ఉద్దేశం. అందుకే ఈ ఆలస్యం. దయచేసి అర్థం చేసుకోండి. మాకు ఇలా సపోర్టు చేస్తూనే ఉండండి. థ్యాంక్యూ" అంటూ ప్రశాంత్‌ వర్మ ట్వీట్‌ చేశారు.  కాగా ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా థియేటర్లోకి వచ్చింది హనుమాన్‌ మూవీ. దీనితో పాటు గుంటూరు కారం, సైంధవ్‌, నా సామిరంగ వంటి పెద్ద సినిమాలు థియేటర్‌ వద్ద పోటీ పడ్డాయి.






అయితే, వాటిలో హనుమాన్‌ మాత్రం ఫస్ట్ నుంచి పాజిటివ్‌ రివ్యూస్‌తో దూసుకుపోయింది. థ్రియేట్రికల్‌ రన్‌లో అన్నింటికంటే ఎక్కువగా వసూళ్లు సాధించిన చిత్రంగానూ హనుమాన్‌ రికార్డు సృష్టించింది. పాన్‌ ఇండియాగా పదకొండు భాషల్లో రిలీజైన హనుమాన్‌ అన్ని భాషల్లోనూ పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇక హిందీలోనూ మంచి వసూళ్లు చేసింది. ఎలాంటి అంచనాలు లేకుండ చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాదించింది. కేవలం రూ. 40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా సుమారు రూ. 400 కోట్లవరకు గ్రాస్‌ కలెక్షన్స్‌ చేసినట్టు సినీ విశ్లేషకుల నుంచి సమాచారం. ఇక ఇందులో ప్రశాంత్‌ వర్మ పనితీరును సాధారణ ఆడియన్స్‌తో పాటు సినీ ప్రముఖులు సైతం కొనియాడారు. తక్కువ బడ్జెట్‌లో అయినా హాలీవుడ్‌ రేంజ్‌లో విజువల్‌ వండర్‌ చూపించాడంటూ అంతా అతడిపై ప్రశంసలు కురిపించారు.