సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కథానాయకుడిగా రూపొందుతోన్న సినిమా 'గుంటూరు కారం' (Guntur Kaaram Movie). ఆయన పుట్టినరోజు (Mahesh Babu Birthday) సందర్భంగా సినిమా యూనిట్ రెండు స్టిల్స్ విడుదల చేసింది. ఆ స్టిల్స్ గుర్తు ఉన్నాయా? అందులో ఒక స్టిల్ చూస్తే... లుంగీ కట్టుకుని బ్లాక్ చెక్ షర్ట్ వేసిన మహేష్, బీడీ వెలిగిస్తూ ఉంటారు. ఆ షర్ట్ రేటు ఎంతో తెలుసా?


ఒక్క షర్ట్ రేటు 75 వేలా?
ఫోటో చూశారుగా... మహేష్ బాబు చాలా మాసీగా కనిపిస్తున్నారు. అయితే... ఆ షర్ట్ మాత్రం చాలా కాస్ట్లీ! ఫార్ ఫెచ్ (farfetch) కంపెనీకి చెందిన R13 బ్లీచ్ వాష్ ప్లైడ్ లాంగ్ స్లీవ్ షర్ట్ వేశారు మహేష్. అదీ క్లాసిక్ బ్లాక్ కలర్! దాని రేటు అక్షరాలా 74,509 రూపాయలు. ఒక్క షర్ట్ రేటు అంతా? అని కొందరు నోరెళ్ళ బెడుతుంటే... మరి కొందరు సూపర్ స్టార్ షర్ట్ అంటే ఆ మాత్రం రేటు ఉంటుందని చెబుతున్నారు. 


మహేష్ బాబు పుట్టినరోజు నాడు మరో స్టిల్ కూడా విడుదల చేశారు. అందులో రెడ్ కలర్ చెక్ షర్ట్ వేసుకున్నారు. దాని రేటు కేవలం మూడు వేల రూపాయలే అని టాక్. అటువంటి షర్ట్స్ ఆన్‌లైన్‌లో మూడు వేలకు వస్తున్నాయట.


ఈ వారమే కొత్త షెడ్యూల్ షురూ!
'గుంటూరు కారం' చిత్రానికి గురూజీ, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వం వహిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఈ వారమే కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. 


గురువారం నుంచి 'గుంటూరు కారం' నయా షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి అంతా సిద్ధం చేశారని, ఆ తర్వాత రోజు శుక్రవారం నుంచి మహేష్ బాబు కూడా జాయిన్ అవుతారని ఫిల్మ్ నగర్ వర్గాలు తెలిపాయి.


Also Read చిరంజీవి అభిమాని సినిమా - ట్రైలర్ విడుదల చేసిన రామ్ చరణ్ 


  


సంగీత దర్శకుడు తమన్ ఉన్నారు... 
అయితే వాళ్ళిద్దరూ బయటకు వెళ్లారు!
'గుంటూరు కారం' సినిమా మొదలైనప్పటి నుంచి సినిమాపై బోలెడు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. హీరోయిన్ పూజా హెగ్డే తప్పుకోవడం, కథ మారిందని గుసగుసలు, ఆ తర్వాత సంగీత దర్శకుడిగా తమన్ కూడా లేరని పుకార్లు... ఒక్కటేమిటి? బోలెడు కబుర్లు. 


Also Read : మీరా జాస్మిన్‌కు తెలుగులో మరో ఛాన్స్ - ఈసారి యంగ్ హీరోతో...


మహేష్ బాబు పుట్టినరోజుకు ఓ క్లారిటీ వచ్చింది. సినిమాకు తమన్ సంగీతం అందిస్తారని! అయితే... తొలుత విడుదల చేసిన పోస్టర్ మీద సినిమాటోగ్రాఫర్ పీఎస్ వినోద్ పేరు ఉంది. ఆ తర్వాత రెండో పోస్టర్ మీద ఆయన పేరు తీసేశారు. అంతే కాదు... ఫైట్ మాస్టర్లు రామ్ - లక్ష్మణ్ పేర్లు కూడా లేవు. వాళ్ళిద్దరూ కూడా సినిమా నుంచి బయటకు వెళ్లారట. మరి, ఫైట్స్ కంపోజ్ చేయడానికి కొత్తగా ఎవరు వస్తారో చూడాలి. 


మహేష్ సరసన శ్రీ లీల, మీనాక్షీ చౌదరి! 
'గుంటూరు కారం'లో మహేష్ సరసన యువ కథానాయికలు శ్రీ లీల, మీనాక్షీ చౌదరి నటిస్తున్నారు. సూపర్ స్టార్ సినిమా వాళ్ళిద్దరికీ తొలిసారి అవకాశం వచ్చింది. ఆ కారణంతో ఇద్దరూ ఆనందంతో ఉన్నారు. తొలుత ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 13న విడుదల చేయనున్నట్లు తెలిపారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఒక్క రోజు ముందుకు వచ్చారు. జనవరి 12న విడుదల చేస్తున్నట్లు తెలిపారు.