Mahesh Babu and SS Rajamouli's #SSMB29 latest update: సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి పాన్ వరల్డ్ సినిమా ఒకటి చేయనున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా విడుదల గురించి తెలుగు చిత్రసీమలో వినబడుతున్న లేటెస్ట్ బజ్ నిజమైతే... సూపర్ స్టార్ కొత్త సినిమా సిల్వర్ స్క్రీన్ మీదకు రావడానికి రెండు నుంచి ఆల్మోస్ట్ రెండున్నరేళ్లు పట్టేలా ఉంది. మరి, అభిమానులు తమ ఫేవరెట్ హీరోను చూడటం కోసం అంత సమయం వెయిట్ చేయక తప్పదు. పూర్తి వివరాల్లోకి వెళితే... 


2026 ఎండింగ్ లేదంటే 2027 స్టార్టింగ్!
SSMB29 Release Date: హాలీవుడ్ హీరోలకు ధీటైన కటౌట్ మహేష్ సొంతం అని అభిమానులు గర్వంగా చెబుతారు. అందంలో బాలీవుడ్ హీరోలను బీట్ చేస్తారని పేరు కూడా ఆయనకు ఉంది. ఆయన అందం చూసి హీరోయిన్లు సైతం అసూయ పడిన సందర్భాలు ఉన్నాయి. అయితే, ఇప్పటి వరకు మహేష్ బాబు హాలీవుడ్ కాదు కదా, కనీసం బాలీవుడ్ సినిమా కూడా చేయలేదు. తెలుగు మార్కెట్ టార్గెట్ చేస్తూ సినిమాలు చేశారు. హిందీ ఆడియన్స్ కూడా వాటిని చూశారు. ఫర్ ద ఫస్ట్ టైమ్... రాజమౌళి సినిమా పాన్ ఇండియా, వరల్డ్ ప్రేక్షకుల ముందుకు వెళుతున్నారు. 


సాధారణంగా ఒక్కో సినిమాకు రెండు మూడు ఏళ్లు సమయం తీసుకోవడం జక్కన్న రాజమౌళికి అలవాటు. మెల్లగా సినిమా చెక్కుతూ ఉంటారు. 'బాహుబలి' కోసం ఐదేళ్లు తీసుకున్నారు. 'ఆర్ఆర్ఆర్'కు మూడేళ్లు పట్టింది. మహేష్ బాబు మూవీని అంత కంటే తక్కువలో వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఎలా లేదన్నా ఈ సినిమా పూర్తి కావడానికి రెండేళ్లు పడుతుందని ప్రీ ప్రొడక్షన్ పనుల్లో పాలు పంచుకున్న బయటకు చెప్పేశారు.


Also Read'మనమే' ఫస్ట్ రివ్యూ... ఒక్క బోర్ మూమెంట్ లేదు, పక్కా హిట్ - శర్వా సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?


మహేష్, రాజమౌళి సినిమా ఈ ఏడాది సెట్స్ మీదకు వెళ్లనుంది. సెప్టెంబర్ నెలలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేశారు. ఇది కూడా రెండు పార్టులుగా రిలీజ్ చేస్తారట. అయితే, ఫస్ట్ పార్ట్ రిలీజ్ మాత్రం రెండేళ్ల తర్వాతే! 2026 సెకండాఫ్ హాఫ్... ముఖ్యంగా దసరా లేదంటే క్రిస్మస్ సీజన్ టార్గెట్ చేస్తూ రిలీజ్ చెయ్యాలని భావిస్తున్నారట. ఒకవేళ అది కుదరని పక్షంలో 2027 సంక్రాంతి లేదంటే వేసవికి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రేక్షకుల ముందుకు సినిమా తీసుకు రావాలని ప్లాన్ చేస్తున్నారు.


కృష్ణ జయంతికి మహేష్ ఫ్యాన్స్ నిరాశ!
ప్రతి ఏడాది మే 31న మహేష్ బాబు కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ ఏదో ఒకటి ఇవ్వడం ఆనవాయితీ. కృష్ణ పుట్టినరోజు మే 31న కనుక అలా చేసేవారు. ఈ ఏడాది కృష్ణ జయంతికి మహేష్ - రాజమౌళి మూవీ అప్డేట్ వస్తుందని వెయిట్ చేసిన ఘట్టమనేని ఫ్యామిలీ ఫ్యాన్స్, అటు జక్కన్న ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయ్యారు. మరి, ఈ మూవీని ఎప్పుడు అనౌన్స్ చేస్తారో? ఈ సినిమాను కెఎల్ నారాయణ ప్రొడ్యూస్ చేస్తున్నారు. 


Also Readపవన్ పర్సనల్ లైఫ్, పెళ్లిళ్లే టార్గెట్ - వైసీపీ తప్పుల్లో ఇదొకటి, ఆ లాజిక్ ఎలా మిస్ అయ్యారబ్బా