Siddharth and Aditi Rao Hydari in Pavan Sadineni direction, Harilo Ranga Hari Movie: టాలీవుడ్ లో ఒకప్పుడు లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్న హీరో సిద్ధార్థ్ హీరోయిన్, అదితి రావు హైదరీతో రిలేషన్షిప్ లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో క్రేజీ లవ్ బర్డ్స్ గా ఈ జంట చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తున్నారు. అయితే ఇప్పటివరకు తమ రిలేషన్షిప్ ని బయటికి చెప్పడం లేదు గాని చాలా సందర్భాల్లో ఈ జంట మీడియా కంట పడ్డారు. ఈ మధ్య విదేశాల్లోనూ కలిసి కనిపించారు. అంతెందుకు ఈ ఏడాది పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు తెరపైకి వచ్చాయి.
లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఈ జంట మరోసారి కలిసి బిగ్ స్క్రీన్ పై సందడి చేసేందుకు సిద్ధమైంది. ఇదే విషయాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ వెల్లడించింది. యంగ్ డైరెక్టర్ పవన్ సాదినేని దర్శకత్వంలో సిద్ధార్థ్, అదితి రావు హైదరీ కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రానికి 'హరిలో రంగ హరి' అనే క్రేజీ టైటిల్ ఫిక్స్ చేశారు. క్రాస్ పిక్చర్స్ పతాకంపై సునీత తాటి, వ్యూవు థామస్ కిమ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది ఓ కొరియన్ సినిమాకి రీమేక్ అని తెలిసింది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.
సంక్రాంతి సందర్భంగా నెట్ ఫ్లిక్స్ ఈ మూవీ టైటిల్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. కాగా సిద్ధార్థ్, అదితి రావు హైదరీ 'మహా సముద్రం' సినిమాలో తొలిసారి నటించారు. 'RX 100' మూవీ ఫేమ్ అజయ్ భూపతి ఆ సినిమా డైరెక్ట్ చేశారు. శర్వానంద్ మరో హీరోగా నటించాడు. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. కానీ సినిమాలో సిద్ధార్థ, అదితి రావు హైదరీ మధ్య రొమాన్స్, కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఈ మూవీ షూటింగ్ టైం నుంచి వీరిద్దరి మధ్య రిలేషన్షిప్ ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. గత కొంత కాలంగా వీరిద్దరూ ఘాటు ప్రేమలో మునిగి తేలుతున్నారు.
రీసెంట్ గా అమీర్ ఖాన్ కూతురు పెళ్లి పార్టీకి కూడా కలిసి వెళ్లారు. అంతకు ముందు ఫారిన్ వెకేషన్ లో కలిసి కనిపించారు. ఇప్పుడు ఇద్దరు కలిసి సినిమా కూడా చేస్తున్నారు. దీంతో ఈ సినిమాపై ఆడియన్స్ లోనూ ఆసక్తి నెలకొంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను మూవీ టీం వెల్లడించనుంది. సిద్ధార్థ్ తన సెకండ్ ఇన్నింగ్స్ లో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నాడు. రీసెంట్ గా 'చిన్నా' సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ప్రస్తుతం కమల్ హాసన్ నటించిన 'ఇండియన్ 2' లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అటు హైదరి రావు కూడా వరుస సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం గాంధీ టాక్స్, లయనెస్ అనే బాలీవుడ్ సినిమాలతో పాటు ఓ సిరీస్ లోనూ నటిస్తోంది.
Also Read : బాక్సాఫీస్ బరిలో కింగ్ నాగార్జున జోరు - రెండు రోజుల్లో 'నా సామి రంగ'కు ఎన్ని కోట్లు వచ్చాయంటే?