సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) అభిమానులకు 'జైలర్' మాంచి కిక్ అయితే ఇచ్చింది. ఆ సినిమాకు వచ్చిన వసూళ్లు చూసి అభిమానులు, ప్రేక్షకులతో పాటు పరిశ్రమ కూడా సంతోషించింది. 'జైలర్' తర్వాత సినిమాను రజనీకాంత్ పట్టాలు ఎక్కించారు. ఆ తర్వాత చేయబోయే సినిమాను కూడా ఓకే చేశారు.  


'జై భీమ్'తో విమర్శకులతో పాటు ప్రేక్షకుల మన్ననలు అందుకున్న టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీకాంత్ చేస్తున్న సినిమా (Thalaivar 170) షూటింగ్ కేరళలో మొదలైంది. దాని తర్వాత? 'ఖైదీ', 'విక్రమ్' చిత్రాలతో స్పెషల్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేస్తున్న లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ సినిమా చేయనున్నారు.  


తెలుగు రాష్ట్రాల్లో రజనీకి అభిమానులు ఉన్నారు. ఈతరం ప్రేక్షకులలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj)కు అదే విధంగా ఫ్యాన్స్ ఉన్నారు. సందీప్ కిషన్ 'నగరం' (తమిళంలో 'మా నగరం), కార్తీ 'ఖైదీ', లోకనాయకుడు కమల్ హాసన్ 'విక్రమ్' సినిమాలు చాలా మందికి నచ్చాయి. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)లో ఆయన వరుసగా సినిమాలు చేస్తున్నారు. 'మాస్టర్' తర్వాత విజయ్ హీరోగా ఆయన దర్శకత్వం వహించిన 'లియో' విజయదశమి కానుకగా అక్టోబర్ 19న విడుదల కానుంది. ఆ తర్వాత రజనీకాంత్ సినిమా చేస్తానని లోకేష్ తెలిపారు. 


ఐమ్యాక్స్ కెమెరాతో...
Thalaivar 171 Regular Shooting Update : 'లియో' థియేటర్లలోకి వచ్చిన వారం తర్వాత రజనీకాంత్ సినిమా స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేస్తానని లోకేష్ కనగరాజ్ తాజా ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 'మానగరం' కంటే ముందు కథ రాశానని, ఇప్పుడు ఆ కథకు తుది మెరుగులు దిద్దుతానని ఆయన చెప్పారు. వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో చిత్రీకరణ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. 


Also Read : చిరంజీవి ఇంట్లో వరుణ్ తేజ్, లావణ్య ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్!


క్రేజీ అప్డేట్ ఏమిటంటే... సినిమాలో కొన్ని సన్నివేశాలను ఐమ్యాక్స్ కెమెరాతో షూటింగ్ చేయాలని భావిస్తున్నట్లు లోకేష్ కనగరాజ్ తెలిపారు. క్రిస్టోఫర్ నోలన్ వంటి దర్శకులు, కొన్ని హాలీవుడ్ సినిమాలను ఐమ్యాక్స్ కెమెరాలలో తీస్తారు. బహుశా... సౌత్ ఇండియాలో ఐమ్యాక్స్ కెమెరాతో తీస్తున్న తొలి సినిమా రజనిది కావచ్చు.


Also Read 'యానిమల్'లో రణబీర్, రష్మిక ఫస్ట్ నైట్ అంత వయలెంట్‌గా ఉంటుందా?



తెలుగు దర్శకులతో సినిమాలు ఉంటాయా?
రజనీకాంత్ హీరోగా తెలుగు దర్శకులు సైతం సినిమాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆ మధ్య ప్రచారం జరిగింది. 'వాల్తేరు వీరయ్య' దర్శకుడు బాబీ కొల్లి (కె.ఎస్. రవీంద్ర), 'వీర సింహా రెడ్డి' దర్శకుడు గోపీచంద్ మలినేని పేర్లు బలంగా వినిపించాయి. అయితే.. బాలకృష్ణతో బాబీ, రవితేజతో గోపీచంద్ మలినేని సినిమాలు చేస్తున్నారు. వాటి తర్వాత అయినా రజనీకాంత్ దగ్గరకు వాళ్ళు వెళతారో? లేదో? టీజే జ్ఞానవేల్ రాజా సినిమా కంటే ముందు పెద్దమ్మాయి ఐశ్వర్య దర్శకత్వంలో రజనీకాంత్ ప్రత్యేక పాత్ర చేసిన 'లాల్ సలామ్' విడుదల కానుంది.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial