Jagapathi Babu: షాకింగ్ డెసిషన్ తీసుకున్న జగపతి బాబు - ఇక వాటికి నాకు సంబంధం లేదంటూ స్టేట్‌మెంట్!

ప్రముఖ తెలుగు నటుడు జగపతి బాబు తన ఫాన్స్ అసోసియేషన్లకు, ట్రస్ట్‌కు ఎటువంటి సంబంధం లేదని ప్రకటించారు.

Continues below advertisement

ప్రముఖ నటుడు జగపతి బాబు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. తన ఫ్యాన్స్ అసోసియేషన్లకు, ట్రస్ట్‌కు తనకు ఎటువంటి సంబంధం లేదని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. కొంతమంది అభిమానులు ప్రేమ కంటే తన నుంచి ఆశించేది ఎక్కువ అయిందని, తానే ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిందని తెలిపారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నారు.

Continues below advertisement

‘అందరికీ నమస్కారం. 33 ఏళ్లుగా నా కుటుంబం శ్రేయోభిలాషుల్లాగ నా అభిమానులు కూడా నా పెరుగుదలకి ముఖ్యకారణంగా భావించాను. అలాగే వాళ్ల ప్రతి కుటుంబ విషయాల్లో పాలుగుని వాళ్ల కష్టాల్ని నా కష్టాలుగా భావించి వాళ్లు నాకు తోడుగా ఉన్న నా అభిమానులకు నేను నీడగా ఉన్నాను. అభిమానులంటే అభిమానం, ప్రేమ ఇచ్చే వాళ్లని మనస్ఫూర్తిగా నమ్మాను. కానీ బాధాకరం అయిన విషయం ఏంటంటే కొంతమంది అభిమానులు ప్రేమ కంటే ఆశించడం ఎక్కువ అయిపోయింది. నన్ను ఇబ్బంది పెట్టే పరిస్థితికి తీసుకువచ్చారు. మనసు ఒప్పుకోకపోయినా బాధతో చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇక నుంచి నాకు, నా అభిమాన సంఘాలకు, ట్రస్ట్‌కు ఎటువంటి సంబంధం లేదు. దీన్ని విరమించుకుంటున్నాను. అయితే కేవలం ప్రేమించే అభిమానులకు నేను ఎప్పుడూ తోడుగా ఉంటాను... జీవించండి. జీవించనివ్వండి.’ అని ఈ పోస్టులో పేర్కొన్నారు. 

గత నెలలో జగపతి బాబు పింక్ కలర్ అవుట్ ఫిట్స్ తో ఫొటో షూట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫోటోలు నెట్టింట విపరీతంగా వైరల్ అయ్యాయి. ఈ పిక్ లో తన ఫేస్ ను టిష్యూ పేపర్ తో కవర్ చేసుకొని ఫన్నీగా కనిపించారు. "ఇంతకు ముందు ఇన్‌స్టాలో పింక్ డ్రెస్‌ లో ఉన్న ఫోటోను చూసి నన్ను కుర్రాడిలాగా ఉన్నానని మీరందరు చెప్పినాక యెచ్చులు ఎక్కువ అయిపోయాయి. నిజంగానే కుర్రాడిని అయిపోదామని నా మొహాన్ని రెడీ చేస్తున్నా'' అని జగపతి బాబు పోస్ట్ పెట్టారు.

ఇక సినిమాల విషయానికొస్తే, 1989 సంవత్సరంలో 'సింహ స్వప్నం'తో హీరోగా తెరంగేట్రం చేసిన జగపతిబాబు.. మూడు దశాబ్దాలుగా సినీ అభిమానులను ఆయన అలరిస్తూనే ఉన్నారు. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు కూడా తెచ్చుకున్నారు. కుటుంబ కథా చిత్రాలతో టాలీవుడ్‌లో ఫ్యామిలీ హీరోగా జగపతి బాబు తనదైన ముద్ర వేశారు. ఇక సెకండ్ ఇన్నింగ్స్‌లో జగపతి బాబు క్యారక్టర్ ఆర్టిస్టుగా అదరగొడుతున్నారు. విలన్‌ గానే కాకుండా ఫాదర్‌, బ్రదర్‌ వంటి సపోర్టింగ్ రోల్స్‌తో మెప్పిస్తున్నారు. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా నటిస్తున్నారు.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Continues below advertisement
Sponsored Links by Taboola