TDP Kanthitho Kranthi: 


చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ శ్రేణులు గాంధీ జయంతి రోజున సత్యమేవ జయతే పేరుతో శాంతియుతంగా నిరసన తెలిపారు. నేడు కాంతితో క్రాంతి పేరుతో మరోసారి తెలుగుదేశం పార్టీ నేతలు, చంద్రబాబు కుటుంసభ్యులు, మద్దతుదారులు రాత్రి 7 గంటల నుంచి 7.05 గంటల వరకు ఐదు నిమిషాల పాటు నిరసన చేపట్టారు. ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలని అనంతపురం జిల్లా టీడీపీ నేతలు పరిటాల శ్రీరామ్ కాలువ శ్రీనివాసులు పేర్కొన్నారు.


గత 25 రోజులుగా తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఈ పోరాటం కేవలం చంద్రబాబు కోసం మాత్రమే కాదని రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అన్నారు. టిడిపి అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు అనంతపురం జిల్లా వ్యారప్తంగా కాంతితో క్రాంతి కార్యక్రమంలో తెలుగుదేశం నేతలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.  అనంతపురం నగరంలో జిల్లా అధ్యక్షుడు కాల శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, కాల్వ శ్రీనివాసులు ఇంటి వద్ద కాగడాలు వెలిగించి కాంతితో క్రాంతితో చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు. ధర్మవరం ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ తమ నివాసంలో పార్టీ కార్యకర్తల్లో కలిసి కాగడాలు వెలిగించారు.


మాజీ మంత్రి పరిటాల సునీత తన స్వగ్రామంలో గ్రామ ప్రజలతో కలిసి చంద్రబాబుకు సంఘీభావంగా కాంతితో క్రాంతి ప్రోగ్రాంలో పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం నేతలు వైకుంఠం ప్రభాకర్ చౌదరి, ఉమామహేశ్వర నాయుడు, జితేంద్ర గౌడ్, కందికుంట వెంకటప్రసాద్,  జేసీ అస్మిత్ రెడ్డి,బండారు శ్రావణి జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో టిడిపి శ్రేణులతో కొవ్వొత్తులు కగడలతో ప్రదర్శన నిర్వహించారు. రాత్రి ఏడు గంటల సమయంలో విద్యుత్ దీపాలు అన్ని ఆర్పి కొవ్వొత్తులు, సెల్ ఫోన్ల లైట్ల వెలుగులో నిరసన ప్రదర్శన నిర్వహించారు. చంద్రబాబుకు అనుకూలంగా, సైకో పోవాలంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు ప్రశ్నించిన వారిని జైలుకు పంపుతున్నారన్నారు.


సామాన్యుని దగ్గర నుంచి చివరకు చంద్రబాబు లాంటి పెద్ద వ్యక్తుల వరకు కూడా ఎవరూ మినహాయింపు లేదన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై ప్రజలంతా స్పందించకపోతే రాష్ట్రం మరింత అధోగతి పాలవుతుందన్నారు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ప్రజలంతా కలసి రావాలని.. చంద్రబాబును మరోసారి అధికారంలోకి తెస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని పరిటాల శ్రీరామ్ అన్నారు.


రాజమహేంద్రవరంలో చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి దీపాలు వెలిగించగా.. హైదరాబాద్‌లో నారా భువనేశ్వరి కొవ్వొత్తులు వెలిగించి నిరసనలో పాల్గొన్నారు. ఇక ఎన్టీఆర్ భవన్ వద్ద ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయడు, టీడీపీ నేతలు దీపాలు వెలిగించారు. ఇక రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా హైదరాబాద్, బెంగళూరులో కూడా టీడీపీ అభిమానులు దీపాలు వెలిగించి బాబుకు మద్దతుగా నిలిచారు. శనివారం ఉదయం ఢిల్లీ వెళ్లిన నారా లోకేష్ అక్కడినుంచే కాంతితో క్రాంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. టీడీపీ నేతలతో కలిసి కాంతితో క్రాంతి కార్యక్రమం నిర్వహించారు. లైట్లు ఆపి, కొవ్వొత్తులు వెలిగించి వైసీపీ స‌ర్కార్ తీరుపై నిర‌స‌న తెలిపారు. సేవ్ ఏపీ... సేవ్ డెమోక్రసీ అంటూ నినాదాలు చేశారు. ఈ నిరసన కార్య‌క్ర‌మానికి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు.  సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ నేతలందరూ నినదించారు. అటు