టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన గీతా ఆర్ట్స్ నుంచి త్వరలోనే మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సీనియర్ హీరో శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'కోటబొమ్మాలి పీఎస్'. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన 'నాయట్టు' చిత్రానికి ఇది రీమేక్. గీతా ఆర్ట్స్ అనుబంధ నిర్మాణ సంస్థ 'GA2' పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాస్, విద్య కొప్పినీడి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్ ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని పెంచింది. వరలక్ష్మి శరత్ కుమార్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్న ఈ మూవీ మ్యూజికల్ ప్రమోషన్స్ ని రీసెంట్ గా స్టార్ట్ చేయగా, తాజాగా మేకర్స్ ఈ మూవీ నుండి శ్రీకాకుళం ఫోక్ సాంగ్ ని ఫస్ట్ సింగిల్ గా విడుదల చేశారు.


టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీ లీల చేతుల మీదుగా ఈ సాంగ్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా శ్రీలీల మూవీ టీంకి తన బెస్ట్ విషెస్ తెలియ జేశారు. రీసెంట్ టైమ్స్ లో సోషల్ మీడియాలో పాపులర్ అయిన 'లింగి లింగి లింగిడి' అనే ఫోక్ బీట్ ని మ్యూజిక్ డైరెక్టర్ మిథున్ ముకుందన్ క్యాచీ లిరిక్స్ తో క్రియేట్ చేసిన ఈ సాంగ్ మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఉంది. ఇలాంటి ఓ మాస్ సాంగ్ ని హీరోయిన్ శ్రీలీలతో మూవీ టీం లాంచ్ చేయించడం విశేషం. ఈ మధ్య ప్రజాదరణ పొందిన పలు ఫోక్ సాంగ్స్ బిగ్ స్క్రీన్ పై కూడా చార్ట్ బస్టర్ గా నిలుస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా విడుదలైన 'లింగి లింగి లింగిడి' సాంగ్ కూడా సాలిడ్ మాస్ బీట్స్ తో ఆడియన్స్ ని ఉర్రూతలూగించడం గ్యారెంటీ అని చెప్పవచ్చు.


శ్రీకాకుళం ఫోక్ బీట్ తో సాగే ఈ పాటకి మ్యూజిక్ డైరెక్టర్ రఘుకుంచే లిరిక్స్ అందించడంతోపాటు స్వయంగా పాటను ఆలపించారు. కొరియోగ్రాఫర్ విజయ్ పోలంకి ఈ పాటకు డాన్స్ కంపోజ్ చేశారు. సెలబ్రేషన్ మోడ్ లో సాగే ఈ పాటలో శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ మాస్ డాన్స్ తో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సాంగ్ మంచి రెస్పాన్స్ని అందుకుంటుంది. 'జోహార్', 'అర్జున పల్గుణ' వంటి డిఫరెంట్ మూవీస్ తో డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న తేజ మర్ని ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ముగ్గురు పోలీసుల చుట్టూ తిరిగే కథ ఇది. పోలీసులు రాజకీయాల చుట్టూ ఓ పొలిటికల్ సర్వైవల్ డ్రామాగా ఈ సినిమా ఉంటుంది.


Also Read : కళ్యాణ్ రామ్ 'డెవిల్'తో దర్శకుడిగా మారిన నిర్మాత - తెర వెనుక ఏం జరిగింది?



'భలే భలే మగాడివోయ్', 'గీతాగోవిందం', 'టాక్సీవాలా', 'ప్రతిరోజు పండగే', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' లాంటి సక్సెస్ఫుల్ మూవీస్ ని నిర్మించిన 'GA 2' పిక్చర్స్ నిర్మిస్తున్న సినిమా కావడంతో ఇప్పటికే ఈ సినిమాపై ఇండస్ట్రీలో మంచి బజ్ నెలకొంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాని త్వరలోనే విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మిథున్ ముకుందన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి జగదీష్ చీకటి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తుండగా, కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు.


Also Read : పారిస్‌లో రామ్ చరణ్ - అక్కడికి ఎందుకు వెళ్ళారంటే?





Join Us on Telegram: https://t.me/abpdesamofficial