నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram Nandamuri) కథానాయకుడిగా రూపొందిన పీరియాడిక్ స్పై థ్రిల్లర్ 'డెవిల్' (Devil Movie). ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్... అనేది ఉప శీర్షిక. ఆల్రెడీ చిత్రీకరణ పూర్తి అయ్యింది. నవంబర్ 24న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేక్షకులలో 'డెవిల్' మీద మంచి బజ్ ఏర్పడింది. అయితే, ఒక్క విషయంలో వివాదం నెలకొంది. సినిమా దర్శకుడు ఎవరు? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ క్వశ్చన్ అయ్యింది. 


దర్శకుడిగా నిర్మాత అభిషేక్ నామా!
'డెవిల్' సినిమాలో సంయుక్తా మీనన్ కథానాయిక. 'బింబిసార' తర్వాత కళ్యాణ్ రామ్ సరసన మరోసారి ఆమె నటిస్తున్న చిత్రమిది. ఇందులో నైషధ పాత్ర పోస్తున్నారు. సోమవారం సంయుక్త పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఆ పోస్టర్ చూస్తే... ఎ ఫిల్మ్ బై అభిషేక్ పిక్చర్స్ అని ఉంది. మీడియాకు విడుదల చేసిన ప్రెస్ రిలీజ్ చూస్తే... దర్శకుడిగా చిత్ర నిర్మాత అభిషేక్ నామా పేరు ఉంది.


నవీన్ మేడారం పేరు ఎందుకు తీసేశారు?
నవీన్ మేడారం దర్శకత్వంలో 'డెవిల్' సినిమా మొదలైంది. ఫస్ట్ లుక్ విడుదల చేసినప్పుడు కూడా పోస్టర్ మీద నవీన్ మేడారం పేరు ఉంది. కానీ, ఇప్పుడు ఆయన బదులు దర్శకుడిగా అభిషేక్ నామా పేరు వచ్చింది. దీనికి కారణం ఏమిటి? అని ఆరా తీయగా... 


దర్శక నిర్మాతల మధ్య విబేధాలు!?
'డెవిల్' ఫస్ట్ షెడ్యూల్ ముగిసిన తర్వాత చిత్ర బృందం, దర్శకుడు నవీన్ మేడారం మధ్య విబేధాలు వచ్చినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల ఖబర్. చిన్న చిన్న మనస్పర్ధలు తొలుత వచ్చాయని.. ఆ తర్వాత నవీన్ మేడారాన్ని తొలగించారని టాక్. అప్పటి నుంచి అభిషేక్ నామా డైరెక్ట్ చేశారట. 


'డెవిల్' కంటే ముందు అభిషేక్ పిక్చర్స్ సంస్థలో 'బాబు బాగా బిజీ' చేశారు నవీన్ మేడారం. అభిషేక్ నామా, ఆయనకు మధ్య 'డెవిల్'కు ముందు సత్సంబంధాలు ఉన్నాయి. మరి, 'డెవిల్' సమయంలో ఏం జరిగింది? అనేది మిలియన్ డాలర్ క్వశ్చన్ మార్క్. నవీన్ మేడారం, అభిషేక్ నామా... ఇద్దరిలో ఎవరో ఒకరు బయటకు వచ్చి చెబితే తప్ప తెలియదు. 


విజయ్ దేవరకొండతోనూ అభిషేక్ నామా గొడవ!?
ఇటీవల అభిషేక్ నామా పేరు మరో వివాదంలో వినిపించింది. 'ఖుషి' విడుదలైన తర్వాత ప్రేక్షకులకు కోటి రూపాయలు ఇవ్వాలని విజయ్ దేవరకొండ అనౌన్స్ చేసిన తర్వాత... 'వరల్డ్ ఫేమస్ లవర్' డిస్ట్రిబ్యూషన్ చేసిన తమకు కోట్ల రూపాయల లాస్ వచ్చిందని, తమను కూడా ఆదుకోవాలని అభిషేక్ పిక్చర్స్ సంస్థ ట్వీట్ చేసింది.


Also Read : 'డెవిల్' - కళ్యాణ్ రామ్ సినిమా కోసం దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా భారీ సెట్స్!
 
అభిషేక్ నామా వ్యవహార శైలి మీద విజయ్ దేవరకొండ తండ్రి గోవర్థన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరం అయితే కోర్టుకు వెళ్ళమని చెప్పారు. విజయ్ దేవరకొండ తమ సంస్థలో ఓ సినిమా చేయాల్సిందిగా అభిషేక్ నామా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు దర్శకుడు పేరు తీసేయడం ద్వారా మరోసారి ఆయన పేరు మరోసారి వార్తల్లోకి వచ్చింది. 


Also Read రాయల్ ఫ్యామిలీ వారసుడిగా ఎన్టీఆర్ - 'దేవర' కథలో అసలు ట్విస్ట్ ఇదే!?



'డెవిల్' సినిమాకు ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌:  గాంధీ న‌డికుడిక‌ర్‌, కూర్పు : త‌మ్మిరాజు, కథ, స్క్రీన్ ప్లే, మాటలు : శ్రీకాంత్ విస్సా, ఛాయాగ్రహణం : సౌంద‌ర్ రాజన్‌ .ఎస్, సంగీతం : హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial