Thalapathy Vijay Leo Movie First Review : దళపతి విజయ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'లియో'. 'మాస్టర్' తర్వాత దర్శకుడు లోకేష్ కనగరాజ్, విజయ్ కాంబినేషన్ సినిమా ఇది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకుల్లోనూ ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. అందుకు కారణం 'విక్రమ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన సినిమా కావడమే. 


ట్విస్ట్ రివీల్ చేసిన తమిళ మంత్రి
'ఖైదీ', 'విక్రమ్' తర్వాత LCU (లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్)లో సినిమా అని 'లియో' మీద హైప్ నెలకొంది. అయితే... విడుదలకు ముందు ఇచ్చిన పలు ఇంటర్వ్యూలలో దర్శకుడు ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేయలేదు. కానీ, తమిళనాడు మంత్రి, హీరో ఉదయనిధి స్టాలిన్ ట్విస్ట్ రివీల్ చేశారు. 'లియో' LCUలో సినిమా అని ట్వీట్ వేశారు. హీరో విశాల్ అయితే విడుదలకు ముందు సినిమా గ్రాండ్ సక్సెస్ సాధించినందుకు చిత్ర బృందానికి కంగ్రాట్స్ చెప్పారు.


రోలెక్స్ వర్సెస్ లియో... కన్ఫర్మ్!
స్టార్టింగ్ హైనాతో ఫైట్ సూపర్!
సినిమా స్టార్టింగ్ 10 మినిట్స్ అసలు మిస్ కావద్దని లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) చెబుతూ వస్తున్నారు. ఎందుకంటే... ఆ పది నిమిషాల్లో హైనాతో విజయ్ ఫైట్ ఉంటుంది. అది సూపర్ తీశారని బెంగళూరులో బెనిఫిట్ షోలు, విదేశాల్లో ప్రీమియర్లు చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ బావున్నాయట. విజయ్ ఇరగదీశారని ఆడియన్స్ అంటున్నారు.  


ముఖ్యంగా రోలెక్స్ ('విక్రమ్' సినిమాలో సూర్య క్యారెక్టర్)తో విజయ్ చేసే ఫైట్ సూపర్ వచ్చిందని ఆడియన్స్ చెబుతున్నారు. ఈ సినిమాలో తమిళ స్టార్ సూర్య నటించలేదు. కానీ, ఆయన పోలికలతో ఉన్న యంగ్ ఆర్టిస్ట్ ఒకరిని వెతికి మరీ తీసుకు వచ్చారు లోకేష్. 'ఖైదీ' సినిమాలో పోలీస్ కానిస్టేబుల్ నెపోలియన్ కూడా ఈ సినిమాలో ఉన్నారు. ఫస్టాఫ్ అయ్యేసరికి చాలా మంది బ్లాక్ బస్టర్ అని ట్వీట్స్ చేస్తున్నారు. 


Also Read : 'భగవంత్ కేసరి' ఆడియన్స్ రివ్యూ : బ్లాక్ బస్టర్ బొమ్మ - బాలకృష్ణ సినిమా ట్విట్టర్ టాక్ చూశారా?



స్క్రీన్ ప్లేతో మేజిక్ చేసిన లోకేష్!
లోకేష్ కనగరాజ్ సినిమా అంటే స్క్రీన్ ప్లే సంథింగ్ స్పెషల్ అన్నట్లు ఉంటుంది. 'లియో'లో కూడా ఆ మేజిక్ కనిపించిందట. మొదటి 15 నిమిషాలు రేసీగా సినిమా నడిపించారని ఆడియన్స్ చెబుతున్నారు. సంగీత దర్శకుడు అనిరుధ్ అందించిన నేపథ్య సంగీతం కూడా సూపర్ ఉందట. 


Also Read పెద్ద మావయ్య శంకర్ దాదా... చిన్న మావయ్య గుడుంబా శంకర్... ఇప్పుడు మేనల్లుడు 'గాంజా శంకర్'


















































 


'లియో' చిత్రాన్ని సెవెన్ స్కీన్స్ పతాకంపై ఎస్ఎస్ లలిత్ కుమార్, జగదీష్ పళనిసామి నిర్మించారు. ఈ సినిమాలో త్రిష కథానాయిక. సుమారు 14 ఏళ్ళ విరామం తర్వాత విజయ్, త్రిష జంటగా నటించిన చిత్రమిది. త్రిషతో పాటు తెలుగులో 'లీడర్' సహా కొన్ని సినిమాలు చేసిన హీరోయిన్ ప్రియా ఆనంద్ కీలక పాత్ర చేశారు. 


'లియో' సినిమాలో బాలీవుడ్ నటుడు, 'కెజియఫ్'తో ప్రతినాయకుడిగా దక్షిణాది ప్రేక్షకుల్లోనూ గుర్తింపు తెచ్చుకున్న సంజయ్ దత్ ఓ పాత్రలో నటించారు. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన యాక్షన్ కింగ్ అర్జున్, తమిళ దర్శకులు గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్, నటుడు మన్సూర్ అలీ ఖాన్, మలయాళ నటుడు మాథ్యూ తదితరులు ఉన్నారు. ఈ సినిమాకు ఛాయాగ్రహణం : మనోజ్ పరమహంస, కూర్పు : ఫిలోమిన్ రాజ్, కళ : ఎన్. సతీష్ కుమార, యాక్షన్ : అన్బరివ్.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial