Bhagavanth Kesari Telugu Movie First Twitter Review : గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన సినిమా 'భగవంత్ కేసరి'. తెలుగు రాష్ట్రాల కంటే ముందు విదేశాల్లో షోలు పడ్డాయి. ఎన్నారై ఆడియన్స్ ఆల్రెడీ సినిమా చూశారు. ఓవర్సీస్ నుంచి సినిమాకు మంచి రిపోర్ట్స్ వస్తున్నాయి. 


కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చిన బాలకృష్ణ!
బాలకృష్ణ (Balakrishna)ది లార్జర్ దేన్ లైఫ్ మాస్ ఇమేజ్. ఆయన సినిమా అంటే భారీ ఫైట్స్ ఉండాలని అభిమానులు, మెజారిటీ ప్రేక్షకులు కోరుకోవడం కామన్! ప్రజలు ఆశించే అంశాలతో పాటు కంటెంట్ బేస్డ్ సినిమాను ఈసారి అందించారని ఓవర్సీస్ టాక్. ముఖ్యంగా కంఫర్ట్ జోన్ నుంచి బాలకృష్ణ బయటకు వచ్చారని చెబుతున్నారు. ఆయన వయసుకు తగ్గ క్యారెక్టర్‌ చేయడాన్ని పలువురు అప్రిషియేట్‌ చేస్తున్నారు. సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌ లుక్‌లో బాలకృష్ణ బావున్నారని కాంప్లిమెంట్స్‌ ఇస్తున్నారు. ఇంటర్వెల్ ఫైట్ నందమూరి అభిమానులకు, ప్రేక్షకులకు మంచి హై ఇస్తుందట. 


కాజల్ అగర్వాల్ పాత్ర పరిమితమే...
కథానాయికగా కాకుండా కొత్త శ్రీ లీల!
'భగవంత్ కేసరి' (Bhagavanth Kesari Review)లో బాలకృష్ణకు జోడీగా తెలుగు తెర చందమామ కాజల్ అగర్వాల్ నటించిన సంగతి ప్రేక్షకులకు తెలుసు. ఫస్ట్ టైమ్ వాళ్ళిద్దరూ నటించారు. అయితే... సినిమాలో కాజల్ పాత్ర పరిమితమేనని ఎన్నారై ఆడియన్స్ తెలిపారు. బాలకృష్ణ, కాజల్ సీన్స్ పదిహేను నిమిషాలు ఉంటాయట. 'పెళ్లి సందడి', 'ధమాకా' సినిమాలతో యువతలో క్రేజీ కథానాయికగా మారిన శ్రీ లీల (Sreeleela)ను అనిల్ రావిపూడి కొత్తగా చూపించారని చెబుతున్నారు. తమన్ మాస్ నేపథ్య సంగీతం బావుందట.  


Also Read : రోజా ఇష్టమైన ఫుడ్ ఏంటో తెలుసా? - మహేష్‌తో సినిమాపై సెన్సేషనల్ కామెంట్స్



సాధారణంగా అనిల్ రావిపూడి సినిమాలు అంటే కామెడీ ఎక్కువ హైలైట్ అవుతూ ఉంటాయి. కానీ, 'భగవంత్ కేసరి'లో ఎమోషన్స్, మాస్ అంశాలపై ఆయన దృష్టి పెట్టారు. అమ్మాయిలకు చిన్నతనంలో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ వంటివి నేర్పించాలని మెసేజ్ ఇస్తూ తెరకెక్కించిన ఈ సినిమా ఫ్యామిలీ ప్రేక్షకులకు ఎక్కువ కనెక్ట్ అవుతుందట. సినిమాకు బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్ వచ్చాయి. అదే సమయంలో కొంత నెగిటివ్ రివ్యూలు సోషల్ మీడియాలో కూడా ఉన్నాయి. 


Also Read పెద్ద మావయ్య శంకర్ దాదా... చిన్న మావయ్య గుడుంబా శంకర్... ఇప్పుడు మేనల్లుడు 'గాంజా శంకర్'






























































అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'భగవంత్ కేసరి' సినిమాను షైన్ స్క్రీన్స్ పతాకంపై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఇంతకు ముందు 'మజిలీ' ప్రొడ్యూస్ చేశారు. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్ రోల్ చేశారు. ఆయనకు తొలి తెలుగు చిత్రమిది. శరత్ కుమార్ ఓ కీలక పాత్ర చేశారు. బాలకృష్ణకు ఆయనది సోదరుడి పాత్ర. నార్త్ ఇండియన్ బ్యూటీ పాలక్ లల్వానీకి కీలక పాత్రలో నటించే అవకాశం దక్కింది.


గమనిక : 'భగవంత్ కేసరి' సినిమాపై సోషల్ మీడియాలో ప్రేక్షకులు పోస్ట్ చేసిన అంశాలను పాఠకులకు అందించడమే ఈ ఆర్టికల్ ఉద్దేశం.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial