కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన 'లియో'(Leo) మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది. విజయ్ కెరియర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ ఈ సినిమాకి రావడం విశేషం. ఇప్పటివరకు బాక్సాఫీస్ వద్ద అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన సినిమాల రికార్డ్స్ అన్నిటినీ 'లియో' బ్రేక్ చేసింది. ఫుల్ డీటెయిల్స్ లోకి వెళ్తే.. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో దళపతి విజయ్ నటించిన 'లియో'(Leo) భారీ అంచనాల నడుమ గురువారం అక్టోబర్ 19 ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది. సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చినా బాక్స్ ఆఫీస్ వద్ద ఎవరు ఊహించని కలెక్షన్స్ రాబట్టింది. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీస్ లోనే వరల్డ్ వైడ్ హైయెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న చిత్రంగా లియో నిలిచింది.
లియో మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా రూ.140 కోట్ల గ్రాస్ అందుకుంది. దీనికంటే ముందు రీసెంట్ గా ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' కూడా దాదాపు రూ.140 కోట్ల ఓపెనింగ్స్ ని రాబట్టింది. కానీ ఫస్ట్ వీక్ తర్వాత అదిపురుష్ కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. ఆ తర్వాతి స్థానంలో షారుఖ్ ఖాన్ నటించిన 'జవాన్' ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ వద్ద రూ.129.1 కోట్లు వసూలు చేసింది. పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన 'జవాన్' ఈ ఏడాది ఇండియా వైడ్ గా అన్ని భాషల్లో అత్యధిక వసూళ్లు అందుకున్న చిత్రంగా నిలిచింది. ఫుల్ రన్ లో ఈ మూవీ రూ.1440.5 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అయితే డే వన్ కలెక్షన్స్ లో మాత్రం 'లియో' ఆదిపురుష్, 'జవాన్' కలెక్షన్స్ ని బీట్ చేయడం విశేషం.
తెలుగు, హిందీ భాషల్లో ఎన్నో వివాదాల నడుమ విడుదలైన 'లియో' దేశీయ మార్కెట్లో ఏకంగా రూ.63 కోట్ల వసూళ్లు అందుకుంది. ఇక ఇండియా వైడ్ గా రూ.74 కోట్లు రాబట్టింది. తమిళనాడులో 'లియో' ఫస్ట్ డే కలెక్షన్స్ చూసుకుంటే అక్కడి ప్రభుత్వం మార్నింగ్ షోస్ క్యాన్సిల్ చేసినా కూడా మొదటిరోజు ఏకంగా రూ.30 కోట్ల గ్రాస్ వసూలు చేయడం విశేషం. తమిళ ఇండస్ట్రీలో ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన రజినీకాంత్ 'జైలర్' కలెక్షన్స్ ని సైతం 'లియో' బ్రేక్ చేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఏపీ, తెలంగాణలో రూ.15 కోట్లు, కర్ణాటక రూ.14 కోట్లు, కేరళలో రూ.11 కోట్లు కొల్లగొట్టి అన్ని భాషల్లో రికార్డ్ కలెక్షన్స్ ని నమోదు చేసింది. రెస్ట్ ఆఫ్ ఇండియాలో నాలుగు కోట్ల గ్రాస్ రాబట్టింది.
అలా అన్ని భాషల్లో కలుపుకొని రూ.63 కోట్ల నెట్ రూ.74 కోట్ల గ్రాస్ అందుకుంది. ఓవర్సీస్ లో ఏకంగా రూ.66 కోట్లు కొల్లగొట్టింది. టోటల్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద లియో మొదటి రోజు రూ.140 కోట్ల వసూళ్లు సాధించి అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న ఇండియన్ మూవీ గా అరుదైన ఘనత సాధించింది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కిన ఈ మూవీలో విజయ్ సరసన త్రిష హీరోయిన్ గా నటించగా.. బాలీవుడ్ సీనియర్ స్టార్ సంజయ్ దత్, యాక్షన్ కింగ్ అర్జున్, గౌతమ్ మీనన్, మన్సూర్ అలీ ఖాన్ కీలక పాత్రలు పోషించారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై ఎస్.ఎస్ లలిత్ కుమార్ నిర్మించారు.
Also Read : 'భగవంత్ కేసరి' ఫస్ట్ డే కలెక్షన్స్, భోళా శంకర్ కంటే తక్కువే - ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?