నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన 'భగవంత్ కేసరి'(Bhagavanth Kesari) మూవీ ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 19 గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా తొలి రోజు బాక్సాఫీస్ వద్ద డీసెంట్ ఓపెనింగ్స్ ని అందుకుంది. ఈ మూవీ డే వన్ కలెక్షన్స్ ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. 'భగవంత్ కేసరి' డే వన్ కలెక్షన్స్ తో సోషల్ మీడియాలో మెగా, నందమూరి ఫ్యాన్స్ మధ్య సరికొత్త వార్ మొదలైంది. అందుకు కారణం 'భోళా శంకర్' కంటే 'భగవంత్ కేసరి' డే వన్ తక్కువ వసూళ్లు రాబట్టడమే.


బాక్సాఫీస్ దగ్గర 'భగవంత్ కేసరి' మొదటి రోజు రూ.32.33 కోట్ల వసూళ్లను అందుకుంది. చిరంజీవి నటించిన 'భోళాశంకర్' మొదటి రోజు రూ.33 కోట్లు రాబట్టింది దీంతో చిరంజీవి అట్టర్ ఫ్లాప్ మూవీ వసూళ్లను కూడా 'భగవంత్ కేసరి' దాటలేకపోయింది అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ మొదలైంది. దీంతో మెగాస్టార్ ఫ్యాన్స్ 'భోళా శంకర్' ఫస్ట్ డే కలెక్షన్స్ పోస్టర్ ని ట్విట్టర్లో షేర్ చేస్తున్నారు. కేవలం కలెక్షన్స్ విషయంలోనే కాకుండా అడ్వాన్స్ బుకింగ్స్ లోనూ 'భగవంత్ కేసరి' చిరంజీవి 'భోళా శంకర్' ని దాటలేకపోయిందని మెగా ఫ్యాన్స్ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు బాలయ్య గత చిత్రం 'వీరసింహరెడ్డి' రూ.50 కోట్ల ఓపెనింగ్ ని అందుకుంది.






కానీ 'భగవంత్ కేసరి' మూవీకి ఇంత తక్కువ కలెక్షన్స్ రావడం ట్రేడ్ వర్గాలను సైతం షాక్ కి గురిచేస్తోంది. అయితే 'భగవంత్ కేసరి' రిలీజ్ రోజు తలపతి విజయ్ 'లియో' మూవీ కూడా విడుదల ఉండడంతో బహుశా 'లియో' క్రేజ్ వల్ల 'భగవంత్ కేసరి' ఓపెనింగ్స్ తక్కువ వచ్చాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. మొదటి రోజు సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో రెండో రోజు నుంచి కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి రెండో రోజు నుంచి అయినా భగవంత్ కేసరి కలెక్షన్స్ పుంజుకుంటాయేమో చూడాలి. దాదాపు రూ.70 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో థియేటర్లో విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు 25% రికవరీ చేసింది. ఇంకా 75% రికవర్ చేయాలి.






ఇక 'భగవంత్ కేసరి' సినిమా విషయానికొస్తే.. బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో శ్రీ లీల బాలయ్య కూతురుగా నటించింది. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో మహిళల గురించి చర్చించిన తీరుపై విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ముఖ్యంగా శ్రీలీల ఈ చిత్రంలో కెరియర్ బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చిందని చెప్పవచ్చు. అలాగే బాలయ్య తెలంగాణ స్లాంగ్ లో డైలాగ్స్, యాక్షన్ తో అదరగొట్టేసారు. షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ చిత్రానికి ఎస్. ఎస్ తమన్ సంగీతం అందించారు.


Also Read :