Andukova lyrical video from Sarangadhariya movie released: నటుడిగా, క్యారెక్టర్ ఆరిస్టుగా రాజా రవీంద్ర (Raja Ravindra) అద్భుతమైన నటన కనబరిచిన సినిమాలు ఎన్నో! ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రధారిగా ఓ సినిమా రూపొందుతోంది. సాయిజా క్రియేషన్స్ పతాకంపై చల్లపల్లి చలపతి రావు దివ్య ఆశీస్సులతో ఉమా దేవి, శరత్ చంద్ర నిర్మిస్తున్న ఆ సినిమా 'సారంగదరియా'. పద్మారావు అబ్బిశెట్టి (అలియాస్ పండు) దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో లెజెండరీ సింగర్ కెఎస్ చిత్ర ( K.S. Chithra) పాడిన పాటను తాజాగా విడుదల చేశారు.


అందుకోవా ఆకాశం అదిగో...
అంత సులువా అనుకుంటే అవదే!
'సారంగదరియా' చిత్రానికి ఎం. ఎబెనెజర్ పాల్ (M. Ebenezer Paul) సంగీతం అందిస్తున్నారు. ఆయన స్వరపరిచిన బాణీకి రాంబాబు గోశాల సాహిత్యం అందించిన గీతం 'అందుకోవా ఆకాశం...' పాటను చిత్ర పాడారు. జీవితంలో ఏదైనా లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే ధైర్యంగా ముందుకు సాగాలని చెప్పే స్ఫూర్తివంతమైన గీతమిది. విలక్షణ నటుడు, యువ కథానాయకుడు నవీన్ చంద్ర చేతుల మీదుగా ఈ పాట విడుదల అయ్యింది. ఆయనకు చిత్ర బృందం థాంక్స్ చెప్పింది.


Also Read: నాగ చైతన్య, అల్లు అరవింద్ సేఫ్ - కర్మ అనేది వదిలి పెట్టదురా పెట్ల!



'అందుకోవా ఆకాశం...' పాట విడుదల చేసిన సందర్భంగా 'సారంగదరియా' చిత్ర నిర్మాతలు ఉమా దేవి, శరత్ చంద్ర చల్లపల్లి మాట్లాడుతూ... ''లెజెండరీ సింగర్ చిత్ర గారు మా సినిమాలో పాట పాడటం మాకు ఎంతో సంతోషంగా ఉంది. శుక్రవారం సాంగ్ విడుదల చేశాం. రెండు రోజుల్లో ఎంతో మంది ఫోన్ చేసి సాంగ్ బావుందని మెచ్చుకున్నారు. సినిమా కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీని వెల్లడిస్తాం'' అని చెప్పారు.


Also Readఆ హిట్ సినిమాలు మిక్సీలో వేస్తే వచ్చిన కిచిడీ 'ఫ్యామిలీ స్టార్' - రామ రామ... ఏంటిది పరశురామా?



చిత్ర దర్శకుడు పద్మారావు అబ్బిశెట్టి (పండు) మాట్లాడుతూ... ''మధ్య తరగతి కుటుంబంలో జరిగిన కొన్ని ఘర్షణల నేపథ్యంలో కథ రాశాను. ఇదొక చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ప్రేమ, కుటుంబ అనుబంధాలు, ఆప్యాయతలు... అన్ని అంశాలు ఉంటాయి'' అని తెలిపారు.



రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 'సారంగదరియా' సినిమాలో శ్రీకాంత్ అయ్యంగార్, శివ చందు, యశస్విని, మోయిన్, యూట్యూబర్ మోహిత్, నీల ప్రియా, కాదంబరి కిరణ్, మాణిక్ రెడ్డి, అనంత బాబు, విజయమ్మ, హర్షవర్ధన్ ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అరుణాచల మహేష్, మాటలు: వినయ్ కొట్టి, కూర్పు: రాకేష్ రెడ్డి, సంగీత దర్శకుడు: ఎం. ఎబెనెజర్ పాల్, ఛాయాగ్రహణం: సిద్ధార్థ స్వయంభు, పాటలు: రాంబాబు గోశాల - కడలి, అడిషనల్ రైటర్: రఘు రామ్ తేజ్.కె, నిర్మాణ సంస్థ: సాయిజా క్రియేషన్స్, నిర్మాతలు: ఉమా దేవి - శరత్ చంద్ర చల్లపల్లి, దర్శకత్వం: పద్మారావు అబ్బిశెట్టి (పండు).