Lata Mangeshkar Death LIVE: లతా మంగేష్కర్ కు ప్రధాని మోదీ అంతిమ నివాళి
Lata Mangeshkar Death LIVE Updates: గాన కోకిల లతామంగేష్కర్ ఇక లేరు. వేల పాటలు పాడి అభిమానులను అలరించిన ఆ గొంతు మూగబోయింది. మరిన్ని అప్‌డేట్స్ కోసం ఈ పేజ్‌ను రిఫ్రెష్ చేయండి
నేపద్య గాయని లతా మంగేష్కర్ అంత్యక్రియలకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ముంబయి శివాజీ పార్కులో లతా మంగేష్కర్ భౌతిక కాయానికి అంతిమ నివాళులర్పించారు. ప్రభుత్వ లాంఛనాలతో లతా అంతిమ సంస్కారాలకు నిర్వహించారు. అభిమానులు, నాయకులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.
మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, నటుడు షారుక్ ఖాన్‌లు ముంబైలోని శివాజీ పార్కులో లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ కు తుది నివాళి అర్పించారు. పుష్ఫగుచ్చాన్ని ఉంచి ప్రముఖులు నివాళి అర్పిస్తూ కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు.
లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ మరణం పట్ల ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం రెండు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. మరోవైపు ముంబైలోని శివాజీ పార్క్ లో సింగర్ అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.
లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ మరణం పట్ల మహారాష్ట్ర ప్రభుత్వం సంతాపం ప్రకటించింది. లతా మంగేష్కర్ గౌరవార్థం ఫిబ్రవరి 7న రాష్ట్రంలో సెలవు దినంగా ప్రకటించినట్లు మహారాష్ట్ర సీఎంఓ వెల్లడించింది.
ప్రధాని నరేంద్ర మోదీ నేటి సాయంత్రం 5:45-6:00 గంటలకు లతా మంగేష్కర్ అంతిమ సంస్కారాలు నిర్వహించే స్థలానికి చేరుకుంటారు. ఇదివరకే ఆయన ముంబైకి బయలుదేరారు. లతా మంగేష్కర్ అంత్యక్రియల్లో ప్రధాని మోదీ పాల్గొంటారని బీఎంసీ కమిషన్ ఇక్బాల్ సింగ్ చహల్ తెలిపారు.
లతా మంగేష్కర్ మరణం పట్ల బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సంతాపం ప్రకటించారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. మానవత్వానికి ప్రతీకగా నిలిచిన లతాజీ మరణంతో దేశం మొత్తం విషాదంలో మునిగిపోయిందని ఉత్తరాఖండ్‌లో ఉన్న జేపీ నడ్డా వ్యాఖ్యానించారు.
గాన కోకిల, భారతరత్న లతా మంగేష్కర్ మరణించారనే వార్త బాధ కలిగించింది. వారు లేరనేది సినీ, సంగీత ప్రపంచానికి తీరని లోటు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి అని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ట్వీట్ చేశారు.
ప్రఖ్యాత సినీ నేపథ్య గాయని, భారతరత్న లతా మంగేష్కర్ మరణం పట్ల టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సంతాపం తెలిపారు. భారతదేశ సినీ సంగీత రంగానికి దశాబ్దాల పాటు ఎన్నో అద్భుతమైన పాటలు అందించిన లతా మంగేష్కర్ మరణం తీరని లోటు అని అన్నారు.
ఆమె అందించిన అద్భుతమైన పాటల రూపంలో ఆమె వారసత్వం శాశ్వతంగా నిలిచి ఉంటుందని అన్నారు. లతా మంగేష్కర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన మంత్రి కేటీఆర్ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్ధించారు.
లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ అంత్యక్రియలు నేటి సాయంత్రం 6:30 కి ముంబైలోని శివాజీ పార్కులో నిర్వహించనున్నారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
లతా మంగేష్కర్ జ్ఞాపకార్థం కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల పాటు జాతీయ సంతాప దినాలు ప్రకటించింది. గౌరవ సూచకంగా రెండు రోజుల పాటు జాతీయ జెండాను అవనతం చేయాలని అధికార వర్గాలు వెల్లడించాయి.
‘‘లతా మంగేష్కర్ మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతి కల్గించింది. భారతదేశం గర్వించదగ్గ ముద్దుబిడ్డ లతా మంగేష్కర్. 7 దశాబ్దాల్లో 30కి పైగా భాషల్లో 30 వేల పాటలు పాడటం లతా మంగేష్కర్ గాన మాధుర్యానికి నిదర్శనం. దేశంలో ఆమె పాట వినబడని ఇల్లు లేదు, ఆమె గానం మెచ్చని వ్యక్తి లేడు.. ఆమె పొందని అవార్డు లేదు, రాని రివార్డు లేదు.. భారత రత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులే కాదు విదేశీ ప్రభుత్వాలు కూడా పలు పురస్కారాలందించి ఆమెను గౌరవించాయి. లతా మంగేష్కర్ మృతి మన దేశానికే కాదు, సంగీత ప్రపంచానికే తీరనిలోటు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.’’ నందమూరి బాలకృష్ణ అన్నారు.
భారతరత్న, గాన కోకిల లతా మంగేష్కర్ మరణం పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. " ఆమె గానం అమరం. ఆమె ప్రయాణం అనితరసాధ్యం. ఆమె కీర్తి అజరామరం" అని కొనియాడారు. లతా జీ ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
ప్రఖ్యాత సినీ నేపథ్య గాయని, భారతరత్న లతా మంగేష్కర్ మరణం పట్ల మంత్రి కే తారకరామారావు సంతాపం తెలిపారు. భారతదేశ సినీ సంగీత రంగానికి దశాబ్దాలపాటు ఎన్నో అద్భుతమైన పాటలు అందించిన లతా మంగేష్కర్ మరణం తీరని లోటు అన్నారు. భారతదేశ సినీ రంగానికి ఆమె మరణం తీరనిలోటని, ఆమె అందించిన అద్భుతమైన పాటల రూపంలో.. ఆమె వారసత్వం శాశ్వతంగా నిలిచి ఉంటుందని కేటీఆర్ అన్నారు. ఈ సందర్భంగా లతా మంగేష్కర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన కేటీఆర్ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.
లతా మంగేష్కర్ పాట ఏ తరంవాళ్లైనా చాలా ఇష్టపడతారన్నారు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్. సంగీతానికే అంకితమైన తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి అన్నారు. ఆమె కుటుంబానికి, సంగీత ప్రియులందరికీ సానుభూతి తెలిపారు మంత్రి నిర్మలాసీతారామన్.
లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు
"దేశంలో మనమెవ్వరం పూడ్చుకోలేని శూన్యతను మిగిల్చి వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
భారతీయ సినిమా నైటింగేల్, లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ మరణంతో నేను చాలా బాధపడ్డాను అన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్య. అనేక దశాబ్దాలుగా తన మధురమైన స్వరంతో సంగీత ప్రియులను ఉర్రూతలూగించిన లతా మరణంతో భారతదేశం తన స్వరాన్ని కోల్పోయిందని అభిప్రాయపడ్డారు.
Background
Lata Mangeshkar Death LIVE Updates:
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ ఇక లేరు. ముంబయిలోని సిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ట్విటర్ ద్వారా ప్రకటించారు. దాదాపు నెల రోజులుగా ముంబయిలోని సిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సింగర్ లతా మంగేష్కర్ ఆరోగ్యం మరింత క్షీణించి కన్నుమూశారు. ప్రస్తుతం ఆమెకు 92 సంవత్సరాలు.
‘‘దేశం గర్వించదగ్గ, సంగీత ప్రపంచంలో స్వర కోకిల అయిన భారతరత్న లతా మంగేష్కర్ గారి మృతి చాలా బాధాకరం. ఆమె పవిత్ర ఆత్మకు నా హృదయపూర్వక నివాళులు. ఆమె మృతి దేశానికి తీరని లోటు. సంగీత ప్రియులందరికీ ఆమె ఎప్పుడూ స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఆమె గొంతు 30 వేలకు పైగా పాటలు పాడింది. లతా దీదీ చాలా ప్రశాంత స్వభావం కలవారు.. ప్రతిభతో కూడిన సంపన్నురాలు. దేశవాసులందరిలాగే, లతా మంగేష్కర్ సంగీతం అంటే నాకు చాలా ఇష్టం. నాకు సమయం దొరికినప్పుడల్లా, ఆమె పాడిన పాటలను తప్పకుండా వింటాను. భగవంతుడు లతా ఆత్మకు శాంతి చేకూరాలని, ఆమె కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఓం శాంతి’’ అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వరుస ట్వీట్లు చేశారు.
దాదాపు నెల రోజులుగా ముంబైలోని సిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్యం మరింతగా క్షీణించిందని కొద్ది రోజులుగా వైద్యులు చెబుతూ వస్తున్నారు. ఆమెను వెంటిలేటర్ సపోర్టుపైనే ఉంచి డాక్టర్లు చికిత్స అందించారు. కోవిడ్-19, న్యుమోనియాతో బాధపడుతున్న ఆమె జనవరి 8 ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి వైద్యులు చికిత్స చేస్తున్నారు. డాక్టర్ ప్రతీత్ సమ్దానీ నేతృత్వంలోని వైద్యుల బృందం ఆమెకు వైద్యం చేసింది.
లతా మంగేష్కర్ మరణం పట్ల బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సంతాపం ప్రకటించారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. మానవత్వానికి ప్రతీకగా నిలిచిన లతాజీ మరణంతో దేశం మొత్తం విషాదంలో మునిగిపోయిందని ఉత్తరాఖండ్‌లో ఉన్న జేపీ నడ్డా వ్యాఖ్యానించారు.
గాన కోకిల, భారతరత్న లతా మంగేష్కర్ మరణించారనే వార్త బాధ కలిగించింది. వారు లేరనేది సినీ, సంగీత ప్రపంచానికి తీరని లోటు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి అని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ట్వీట్ చేశారు.
- - - - - - - - - Advertisement - - - - - - - - -