Best Sports Bike Under 1.5 Lakh Rupees: స్పోర్ట్స్ బైక్‌ల విషయానికి వస్తే యువతలో భిన్నమైన క్రేజ్ కనిపిస్తుంది. ఇప్పుడు సాధారణ బైక్‌లకు బదులు అపాచీ, పల్సర్ వంటి బైక్‌లను కొనుగోలు చేసేందుకు యువత మొగ్గు చూపుతోంది. మీరు రోజువారీ ఉపయోగం కోసం ఉత్తమమైన స్పోర్ట్స్ బైక్ కోసం కూడా చూస్తున్నట్లయితే ఇక్కడ కొన్ని బెస్ట్ ఆప్షన్ల గురించి తెలుసుకుందాం. ఈ బైక్‌లలోని శక్తివంతమైన ఇంజన్, స్పోర్టీ లుక్ ప్రజలను ఆకర్షిస్తుంది. దీంతో పాటు ఈ బైక్‌లు రోజువారీ వినియోగానికి కూడా ఉత్తమమైనవి అని చెప్పవచ్చు. స్పోర్ట్స్ బైక్‌ల ధర చాలా ఎక్కువ అని చాలా మంది అనుకుంటారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే రూ.1.5 లక్షల్లోపు ధరలో కొన్ని మంచి బైక్స్ ఇప్పుడు మనదేశంలో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.


బజాజ్ పల్సర్ ఎన్ఎస్160 (Bajaj Pulsar NS160)
మీ కోసం అందుబాటులో ఉన్న బెస్ట్ ఆప్షన్లలో ఒకటి బజాజ్ పల్సర్ ఎన్ఎస్160. దీని ప్రారంభ ఎక్స్ షోరూం ధర రూ. 1.24 లక్షలుగా ఉంది. ఈ బైక్‌లో 160 సీసీ ట్విన్ స్పార్క్ ఇంజిన్ అందించారు. బజాజ్ పల్సర్ ఎన్ఎస్160 నేరుగా టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వీ, హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ 4వీ, యమహా ఎఫ్‌జెడ్-ఎస్ ఎఫ్ఐ వీ3.0, సుజుకి జిక్సర్‌తో పోటీ పడుతోంది. ఈ బైక్‌లోని సింగిల్ సిలిండర్ ఇంజన్ 17 బీహెచ్‌పీ పవర్, 14.6 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.



Also Read: రోజువారీ వాడకానికి బెస్ట్ బడ్జెట్ సీఎన్‌జీ కార్లు ఇవే - టాప్-3 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?


టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వీ (TVS Apache RTR 160 4V)
టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వీని కూడా ఈ లిస్టులో చేర్చవచ్చు. ఈ టీవీఎస్ బైక్ ఎక్స్ షోరూమ్ ధర రూ.1.26 లక్షలుగా ఉంది. ఇది 160 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 17.4 బీహెచ్‌పీ పవర్‌ని, 14.73 పీక్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వీలో సెగ్మెంట్ ఫస్ట్ రామ్ ఎయిర్ కూలింగ్ ఫీచర్లు ఇంజన్ నుంచి విడుదలయ్యే వేడిని దాదాపు 10 డిగ్రీల వరకు తగ్గిస్తాయి. ఆయిల్ కూలింగ్‌తో ఈ బైక్ ఎఫ్‌ఐలో గంటకు 114 కిలోమీటర్లు, కార్బ్ వేరియంట్‌లో గంటకు 114 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకోగలదు.


యమహా ఎఫ్‌జెడ్-ఎస్ ఎఫ్ఐ వీ4 (Yamaha FZ-S Fi V4)
ఇవి కాకుండా మీకు ఉన్న మూడో బెస్ట్ ఆప్షన్ యమహా ఎఫ్‌జెడ్-ఎస్ ఎఫ్ఐ వీ4. ఢిల్లీలో దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 1,28,900గా ఉంది. ఈ మోటార్‌సైకిల్ ఫీచర్లలో ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (TCS), సింగిల్ ఛానల్ ఏబీఎస్ ఉన్నాయి. వెనుక డిస్క్ బ్రేక్, మల్టీ ఫంక్షనల్ ఎల్సీడీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎల్ఈడీ హెడ్‌లైట్, టైర్ హగ్గింగ్ రియర్ మడ్‌గార్డ్, లోయర్ ఇంజన్ గార్డ్, కనెక్టివిటీతో పాటు బ్లూటూత్ ఎనేబుల్డ్ వై-కనెక్ట్ యాప్‌ కూడా అందించారు.



Also Read: కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!