లక్ష్మీ మంచు (Lakshmi Manchu) ప్రధాన పాత్రలో రూపొందిన సోషియో ఫాంటసీ పీరియాడిక్ ఫిల్మ్ 'ఆదిపర్వం' (Adiparvam Movie). సంజీవ్ మేగోటి దర్శకుడు. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రూపొందింది. రావుల వెంకటేశ్వర రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్, ఎ వన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చిత్రీకరణ పూర్తయింది. సోమవారం ఐదు భాషల్లో ట్రైలర్ విడుదల చేశారు. 


ఏడు గెటప్పుల్లో లక్ష్మీ మంచు
Adiparvam Trailer Review: 'ఆదిపర్వం' చిత్రానికి బలం, బలగం లక్ష్మీ మంచు అని దర్శకుడు సంజీవ్ మేగోటి తెలిపారు. సినిమాలో మొత్తం ఏడు గెటప్పుల్లో ఆమె కనిపిస్తారని వివరించారు. సోమవారం విడుదలైన ట్రైలర్ చూస్తే... నాగలాపురం నాగమ్మ గెటప్ హైలెట్ అయ్యింది. ఇంకా అమ్మవారి ఆహార్యంతో పాటు సాధారణ యువతిగా కనిపించారు. వివిధ గెటప్పుల్లో లక్ష్మీ మంచు నటన 'ఆదిపర్వం' ప్రచార చిత్రంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని చెప్పవచ్చు.


'ఆదిపర్వం'లో సత్య ప్రకాష్, ఆదిత్య ఓం, వెంకట్ కిరణ్, శ్రీజిత ఘోష్, ఎస్తర్, జెమిని కిరణ్, శివ కంఠమనేని, సమ్మెట గాంధీ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. కథ విషయానికి వస్తే... ఎర్రగుడి నేపథ్యంలో సాగుతుందని అర్థం అయ్యింది. గుడి అయినా, బడి అయినా లక్ష్మీ దేవి (డబ్బు) తన సొంతం కావాలని ఆశించే ఓ విలన్. అతనికి ఆదిత్య ఓం ఇచ్చిన మాట ఏమిటి? వాళ్లిద్దరి మధ్య దూరానికి కారణమైన మహిళ ఎవరు? మధ్యలో వెంకట్ కిరణ్, శ్రీజిత ప్రేమ కథ ఏమిటి? ఎర్ర గుడి సొంతం చేసుకుని రాయలసీమలో గొప్ప కావాలని నాగమ్మ చేసిన ప్రయత్నాలు ఏం అయ్యాయి?  క్షేత్ర పాలకుడిగా శివ కంఠమనేని ఏం చేశారు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.


Also Readమమ్ముట్టిని అరెస్ట్ చేసిన జయరామ్ - మలయాళంలో 40 కోట్లు వసూలు చేసిన ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?


'ఆదిపర్వం' ట్రైలర్ విడుదల కార్యక్రమంలో లక్ష్మీ మంచు మాట్లాడుతూ... ''నాకు సంజీవ్ చెప్పిన కథ, అందులో క్యారెక్టర్లు బాగా నచ్చాయి. పెద్ద సినిమా అని అర్థం అయ్యింది. అయితే... తక్కువ సమయంలో ఎలా చేస్తారనుకున్నా. చక్కటి ప్రణాళికతో చేశారు. పోస్టర్ చూశాక నేను ఇన్ని క్యారెక్టర్లు చేశానా? అనిపించింది. నవరసాలు ఉన్న చిత్రమిది. అందరికీ నచ్చుతుంది. దర్శక నిర్మాతలు కోరుకున్న దానికంటే పెద్ద విజయం సాధించాలి'' అన్నారు.


Also Readశవం చుట్టూ సాలెగూడు, తాంత్రిక పూజలు - ఇంట్రెస్టింగ్‌గా నవీన్ చంద్ర 'ఇన్‌స్పెక్టర్ రిషి' ట్రైలర్


దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ... ''ట్రైలర్ విడుదలకు వచ్చినప్పుడు ప్రసాద్ ల్యాబ్‌లో పదిహేనేళ్ల తర్వాత ఓ ప్రముఖుడిని కలిశా. 'ఆదిపర్వం' పోస్టర్ చూశా. లక్ష్మీ మంచు గారి ద్వారా మీరు స్టార్ డైరెక్టర్ కాబోతున్నార'ని చెప్పారు. నాకు అవార్డు వచ్చినంత ఆనందం వేసింది. 'ఆదిపర్వం'లో మంచు లక్ష్మీ గారి విశ్వరూపం చూస్తారు. ఈ సినిమాకు బలం, బలగం మంచు లక్ష్మీ గారు. దాదాపు ఏడు గెటప్స్ వేశారు. డూప్ లేకుండా 50 అడుగుల ఎత్తులో ఫైట్స్ చేశారు. ఆవిడ లేకపోతే ఈ మూవీ లేదు'' అని అన్నారు.


Also Read: నెట్‌ ఫ్లిక్స్ ఓటీటీలో ఏప్రిల్ జాతర - జస్ట్ 15 రోజుల్లో 100 సినిమాలు, వెబ్ సిరీస్‌ లు



'ఆదిపర్వం' తెలుగు ట్రైలర్ (adiparvam movie)ను తెలంగాణ ఎఫ్.డి.సి ఛైర్మన్ ఎన్. గిరిధర్, తమిళ ట్రైలర్ జడ్చర్ల ఎమ్మెల్యే జె అనిరుధ్ రెడ్డి, కన్నడ ట్రైలర్ దర్శకులు నీలకంఠ, మలయాళ ట్రైలర్ రియల్టర్ శిల్పా ప్రతాప్ రెడ్డి, హిందీ ట్రైలర్ చిత్ర సమర్పకులు రావుల వెంకటేశ్వర్ రావు విడుదల చేశారు. వారితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్, బిల్డర్ కైపా ప్రతాప్ రెడ్డి, నటీనటులు ఢిల్లీ రాజేశ్వరి, సత్య ప్రకాష్, శివ కంఠమనేని, వెంకట్ కిరణ్, జెమినీ సురేష్, ఆదిత్య ఓం, శ్రీజిత ఘోష్, సీనియర్ జర్నలిస్టులు ప్రభు, ఆర్.డి.ఎస్ ప్రకాష్, సినిమాటోగ్రాఫర్ ఎస్.ఎస్. హరీష్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత గంటా శ్రీనివాస రావు సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.