Jithender Reddy: 'జితేందర్ రెడ్డి' సినిమాలో మంగ్లీ పాట - తెలంగాణ పెళ్లిలలో మోత మోగాలిక!

Lachimakka Lyrical Song Review From Jithender Reddy Movie: రాకేష్ వర్రె టైటిల్ పాత్రలో విరించి వర్మ దర్శకత్వం వహించిన 'జితేందర్ రెడ్డి' సినిమాలో మంగ్లీ పాడిన 'లచ్చిమక్క' పాటను విడుదల చేశారు.

Continues below advertisement

'బాహుబలి' సినిమాలో కీలక పాత్రతో పాటు 'ఎవరికీ చెప్పొద్దు'లో హీరోగా నటించిన రాకేష్ వర్రె (Rakesh Varre) టైటిల్ రోల్ చేసిన సినిమా 'జితేందర్ రెడ్డి'. విరించి వర్మ దర్శకుడు. 'ఉయ్యాల జంపాల', 'మజ్ను' వంటి రొమాంటిక్ లవ్ స్టోరీలతో సినిమాలు తీసిన ఆయన... తొలిసారి ఓ బయోపిక్ తెరకెక్కించారు. ముదుగంటి క్రియేషన్స్ పతాకంపై ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. తెలంగాణలో 1980వ కాలంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన పొలిటికల్ చిత్రమిది.

Continues below advertisement

పెళ్లి నేపథ్యంలో మంగ్లీ పాడిన 'లచ్చిమక్క'
Mangli Song In Jithender Reddy Movie: 'జితేందర్ రెడ్డి' సినిమా నుంచి 'అ ఆ ఇ ఈ ఉ ఊ' అంటూ కాలేజీ నేపథ్యంలో తెరకెక్కించిన పాటను కొన్ని రోజుల క్రితం విడుదల చేశారు. పెళ్లి నేపథ్యంలో తెరకెక్కించిన 'లచ్చిమక్క' పాటను తాజాగా విడుదల చేశారు. ఈ పాటను ప్రముఖ గాయని మంగ్లీ పాడటం విశేషం. తెలంగాణ ప్రాంతంలో పెళ్లి వాతావరణాన్ని ఈ పాట చక్కగా ప్రతిబింబించింది. గోపీసుందర్ సంగీతం అందించగా... ఈ పాటకు రాంబాబు గోసాల సాహిత్యం సమకూర్చారు.

Also Readఎన్టీఆర్ 'టెంపర్', వరుణ్ 'తొలిప్రేమ' నటి అపూర్వ శ్రీనివాసన్ పెళ్లి - తాళి కట్టిన వెంటనే భర్తకు ముద్దు!

మే 3న థియేటర్లలోకి 'జితేందర్ రెడ్డి' విడుదల
Jithender Reddy Movie Release Date: 'లచ్చిమక్క' పాట విడుదలైన సందర్భంగా నిర్మాత ముదుగంటి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ... ''ఇప్పటి వరకు విడుదలైన గ్లింప్స్, టీజర్, పాటకు చక్కటి ప్రేక్షకాదరణ లభించింది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి అర్థం అవుతోంది. కొత్త నిర్మాతలు అయినా సరే మమ్మల్ని బాగా ఆదరిస్తున్నారు. ప్రస్తుతం వస్తున్న సినిమాలు, కథలకు పూర్తి భిన్నంగా ఉంటుందీ 'జితేందర్ రెడ్డి'. మే 3న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాం'' అని చెప్పారు.

Also Readఅల్లు అర్జున్ వీరాభిమానిగా సన్నాఫ్ సుబ్రమణ్యం... ఒక్క పాటలో బన్నీ సినిమాల్లో బెస్ట్ సీన్స్!


Jithender Reddy Movie Cast And Crew: రాకేష్ వర్రే, వైశాలి రాజ్ (Vaishali Raj) జంటగా... రియా సుమన్ ప్రధాన పాత్రలో నటించిన 'జితేందర్ రెడ్డి' సినిమాలో 'ఛత్రపతి' శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్ ఇతర ప్రధాన తారాగణం. ఇంకా ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వాణిశ్రీ పొడుగు, సహ నిర్మాత: ఉమ రవీందర్, ఛాయాగ్రహణం: విఎస్ జ్ఞానశేఖర్, సంగీతం: గోపి సుందర్, నిర్మాణం: ముదుగంటి రవీందర్ రెడ్డి, దర్శకత్వం: విరించి వర్మ.

Also Readఆది సాయికుమార్ కొత్త సినిమాకు 'దిల్' రాజు క్లాప్ - బృందావనం నుంచి వచ్చిన కృష్ణుడిగా...

Continues below advertisement