Thalapathy 69 Movie Update: అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆ అప్‌డేట్ వచ్చింది. తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ చివరి మూవీపై అధికారిక ప్రకటన వచ్చేసింది. దళపతి 69 టైటిల్ పోస్టర్‌తో ఈ క్రేజ్ ప్రాజెక్ట్‌ని అనౌన్స్ చేసింది కేవీఎన్ ప్రొడక్షన్ సంస్థ. ఈ బ్యానర్లోనే దళపతి 69 (Thalapathy 69) మూవీ తెరకెక్కనుంది. ఈ సినిమాకు హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల చివరి అధ్యాయానికి శ్రీకారం అంటూ కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ దళపతి స్పెషల్ వీడియోతో అప్‌డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఆయన చివరి మూవీ దళపతి 69పై సెప్టెంబర్ 14న సాయంత్రం 5 గంటలకు బిగ్ అనౌన్స్‌మెంట్ కూడా ఉంటుందని ప్రకటించింది. ఇక చెప్పినట్టు నేడు సాయంత్రం మూవీపై అధికారిక ప్రకటన ఇచ్చింది. తాజాగా విడుదల చేసిన ఈ మూవీ పోస్టర్ చూస్తుంటే రాజకీయాల్లోకి వెళుతున్న విజయ్ ఈ సినిమా మరింత ప్లస్ అయ్యేలా కనిపిస్తుంది. చేతిలో టార్చ్ పట్టుకుని ఉన్న ఈ పోస్టర్‌కి ఆసక్తికర క్యాప్షన్ ఇచ్చారు. "ప్రజాస్వామ్యం టార్చ్ బేరర్ త్వరలో వస్తాడు(The Torch bearer of ధDemocracy Arriving soon)" పోస్టర్‌లో క్యాప్షన్ ఇచ్చారు.
చూస్తుంటే ఆయన రాజకీయ ఆరంగేట్రాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను కథను రెడీ చేసినట్టు తెలుస్తోంది. పోస్టర్‌లోని ఉన్న క్యాప్షన్, జ్యోతిని చూస్తుంటే ఇది పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ సాగే కథని అర్థమైపోతుంది. ఎంత ప్రతిష్టాత్మకంగా రాబోతోన్న ఈ సినిమా పోస్టర్ మాత్రం అభిమానుల్లో ఆసక్తి పెంచుతుంది. అంతేకాదు ఈ పోస్టర్ క్యాప్షన్ తమిళ ప్రజల్లో ఆసక్తిని రేకిస్తుంది. ఆయన చివరి సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందని, డైరెక్టర్ హెచ్ వినోద్ ఈ సినిమాను ఏ రేంజ్‌లో ప్లాన్ చేశాడా? అంచనాలు వేసుకుంటున్నారు.
Also Read: హిట్ జోడీ రిపీట్ - విజయ్ సరసన ఆ స్టార్ హీరోయిన్? - కీలక పాత్రలో ఆ సీనియర్ నటి!
ఇదిలా ఉంటే విజయ్ రాజకీయాల్లోకి రాబోతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభంలోనే ఆయన తన పొలిటికల్ పార్టీ పేరు మార్చి కొత్త ప్రకటించారు. అంతేకాదు తన పార్టీ ద్వారా పేద ప్రజలకు ఆర్థిక సాయం చేయడం వంటి సేవ కార్యక్రమాలు చేస్తున్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూ మరోవైపు తన పొలిటికల్ ఎంట్రీపై దృష్టి పెట్టారు విజయ్. 2026 ఎన్నికల్లో ఆయన పోటీ కూడా చేయబోతున్నాడు. ఆ దిశగా విజయ్ తన కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నారు. మరికొన్ని రోజుల్లో సినిమాలకు పూర్తిగా స్వస్తీ చెప్పి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో తన 69వ సినిమాను ప్రకటించాడు.
అయితే ఇదే ఆయన చివరి చిత్రం కేవీఎన్ ప్రొడక్షన్ సంస్థ స్పష్టం చేసింది. ఇది విజయ్ చివరి అధ్యాయానికి శ్రీకారం అంటూ దళపతి 69 సినిమాను నేడు అధికారిక ప్రకటించింది కేజీయన్ సంస్థ. అయితే ఈ సినిమాను పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కస్తున్న తాజాగా విడుదల చేసిన పోస్టర్ చూస్తుంటే అర్థమైపోతుంది. ఇదే ఆయన చివరి చిత్రం కావడం Thapathy 69పై ఫ్యాన్స్, ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్ బ్యానర్‌లో వెంకట్ కే నారాయణ్ నిర్మిస్తున్నారు. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇక త్వరలోనే ఈ సినిమాలోని మిగతా తారాగణం, ఇతర వివరాలు మేకర్స్ ప్రకటించనున్నారు.