Thalapathy 69 Movie: తమిళ స్టార్‌ హీరో దళపతి విజయ్‌ ది గోట్‌ మూవీ ప్రస్తుతం థియేటర్లో సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతుంది. అంతలోనే అతడి చివరి మూవీకి సంబంధించిన అప్‌డేట్‌ బయటకు వచ్చింది. దీంతో ఇప్పుడు సోషల్‌ మీడియాలో 'దళపతి 69'(Thalapathy 69) గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ రోజు సెప్టెంబర్‌ 14న ఈ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన రాబోతోంది. విజయ్‌ 69వ చిత్రంగా రాబోతోన్న ఈ సినిమాను కె.వి.ఎన్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో డైరెక్టర్‌ హెచ్‌.వినోద్‌ దర్శకత్వం వహించనున్నారు.  చివరి అధ్యాయానికి శ్రీకారం అంటూ కె.వి.ఎన్‌ ప్రొడక్షన్స్‌ స్పెషల్‌ వీడియోతో పాటు ఓ ప్రకటన కూడా ఇచ్చింది.


సెప్టెంబర్‌ 14న సాయంత్రం బిగ్‌ అనౌన్స్‌మెంట్‌ రాబోతున్నామంటూ ప్రకటన ఇచ్చిన అభిమానుల్లో క్యూరియాసిటీ పెంచారు. ఈ సందర్భంగా రిలీజ్‌ చేసిన వీడియో ఫ్యాన్స్‌ ఎమోషనల్‌ రోలర్‌ కోస్టర్‌గా సాగింది. దీనికి ఫ్యాన్స్‌ నుంచి భారీ రెస్పాన్స్‌ వచ్చింది. ఈ రోజు సాయంత్రం రాబోయే అప్‌డేట్‌ కోసం అభిమానులంత ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో విజయ్‌ సరసన నటించే హీరోయిన్‌, కీలక పాత్రలకు సంబంధించిన ఓ అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 







బెస్ట్ రొమాంటిక్ జోడీ


విజమ్‌ చివరి సినిమా వస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత నటిస్తున్నట్టు టాక్‌ వినిపిస్తుంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ సినిమాలో సమంత నటిస్తుందని తెలిసి ఈ ఆమె అంతా పండగ చేసుకుంటున్నారు. నిజానికి సమంత, విజయ్‌ది హిట్‌ పెయిర్‌ అని చెప్పాలి. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయ్యాయి. అంతేకాదు వీరిద్దరి ఆన్‌స్క్రీన్‌ కెమిస్ట్రీకి అయితే వందకు వంద మార్కులు పడ్డాయి. గతంలో వీరిద్దరు తేరి, మెర్సల్‌ చిత్రాల్లో జంటగా నటించారు. ఈ చిత్రాలు తెలుగులోనూ డబ్‌ కాగా.. తెలుగు ఆడియన్స్‌ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.



రెండు బ్లాక్‌బస్టర్స్‌.. ఇప్పుడు హాట్రిక్‌!


ఇప్పుడు హ్యాట్రిక్‌గా మూడో సినిమాలో వీరిద్దరు జంటగా నటించబోతుండటం విశేషం. అయితే దీనిపై మూవీ టీం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. దీనిపై క్లారిటీ రావాలంటే ఆఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ వరకు వేచి చూడాల్సింది. అయితే సమంతతో పాటు ఈ సినిమాలో సీనియర నటి సిమ్రన్‌ కూడా కీలక పాత్ర పోషిస్తుందని టాక్‌. అలాగే ప్రేమలు బ్యూటీ మమితా బైజు కూడా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో నటిస్తుందని తెలుస్తోంది. మరి వీటన్నింటికి క్లారిటీ రావాలంటే మూవీ టీం నుంచి ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే. 


Also Read: బాలయ్య కాళ్లు మొక్కిన సిద్దు, దేవర ప్రీమియర్, రెండు రివ్యూలు... ఇవాళ్టి టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్


కాగా విజయ్‌ ఈ ఏడాది ప్రారంభంలో 'తమిళగ వెట్రి కళగం' అనే రాజకీయ పార్టీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పార్టీకి ఎన్నికల కమిషన్‌ నుంచి గుర్తింపు దక్కింది. దీంతో ఆయన 2026 ఎన్నికల్లో పోటీ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. దీంతో సినిమాలకు గుడ్‌బై చెప్పి పూర్తిగా రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్లాన్‌ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన కమిట్‌ అయిన సినిమాలు పూర్తి చేసి రాజకీయాల్లో చురుగ్గా ఉండనున్నారు. ఈక్రమంలో ఆయన చివరి చిత్రంగా Thalapathy 69 రాబోతోంది.