Kriti Sanon: సినీ పరిశ్రమలో తమకంటూ గుర్తింపు, ఫేమ్ సంపాదించుకున్న తర్వాత వారి సంపాదనను పెట్టుబడిగా మార్చుకుంటారు నటీనటులు. ఇప్పటికే ఒకవైపు సినిమాలతో పాటు మరోవైపు వ్యాపారాలను మ్యానేజ్ చేస్తున్న నటీనటులు కూడా ఉన్నారు. ఇక గతకొంతకాలంగా ముంబాయ్‌లో మరో బిజినెస్.. అందరినీ ఆకర్షిస్తోంది. అదే ప్లాట్ సేల్. ఆలీబాగ్‌లో ‘ది హౌజ్ ఆఫ్ అభినందన్ లోధా’ (HoABL) అనే ప్రాజెక్ట్ సినీ సెలబ్రిటీల దృష్టిని ఆకర్షిస్తోంది. అత్యంత ఖరీదైన ధరలతో ప్లాట్స్‌ను విక్రయిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ భామ కృతి సనన్ కూడా పెట్టుబడి పెట్టింది. ఈ విషయంపై తను సంతోషం వ్యక్తం చేసింది.


పెద్ద నిర్ణయం..


మాండ్వ జెట్టీ నుండి 20 నిమిషాల దూరంలో, సౌత్ ముంబాయ్ నుండి నీటి మార్గంలో 60 నిమిషాల దూరంలో ఉన్న ఆలీబాగ్‌ లాంటి అందమైన టౌన్‌లో HoABL ప్రాజెక్ట్ ప్రారంభమయ్యింది. దీని వల్ల ఆలీబాగ్ రియల్ ఎస్టేట్‌కు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అలాంటి ప్రాంతంలో 2000 స్క్వేర్ ఫీట్ ల్యాండ్‌ను కొనుగోలు చేసింది కృతి సనన్. ఈ విషయం గురించి తను అధికారికంగా ప్రకటించింది. ‘‘అందమైన డెవలప్‌మెంట్ అయిన సోల్ డే ఆలీబాగ్‌లోని ది హౌజ్ ఆఫ్ అభినందన్ లోధాలో నేను కూడా ఒక గర్వమైన, సంతోషకరమైన ల్యాండ్ ఓనర్ అయ్యాను. ల్యాండ్ కొనడం అనేది చాలా పెద్ద నిర్ణయం. నేను గత కొన్నాళ్లుగా ఆలీబాగ్‌లో ల్యాండ్ కొనాలి అనే విషయం గురించే ఆలోచిస్తూ ఉన్నాను’’ అని చెప్పుకొచ్చింది కృతి సనన్.


నాన్న కూడా హ్యాపీ..


‘‘నా ఇష్టానికి తగినట్టుగా ప్రశాంతంగా, ప్రైవసీతో ఉండే గొప్ప పెట్టుబడి కోసం నేను ఎదురుచూస్తూ ఉన్నాను. ఈ పెట్టుబడితో మా నాన్న సైతం సంతోషంగా ఉన్నారు. ఇది ఒక ప్రైమ్ లొకేషన్‌లో ఉంది. మాండ్వా జెట్టీ నుండి 20 నిమిషాల కంటే తక్కువ దూరంలో ఉంది. ఆలీబాగ్ మధ్యలో ఉంది. కాబట్టి అన్ని విధాలుగా మాకు ఈ ల్యాండ్ నచ్చింది. HoABL అనేది నేను ల్యాండ్ కొనే ప్రక్రియను ఎంత ఈజీ చేసిందనే విషయాన్ని నేను అభినందించాలని అనుకుంటున్నాను. ఆలీబాగ్‌లో పెట్టుబడి పెట్టడానికి ఇదే సరైన సమయం’’ అంటూ తన పెట్టుబడి గురించి సంతోషంగా ఫ్యాన్స్‌తో పంచుకుంది కృతి సనన్.


అమితాబ్ బచ్చన్ కూడా..


ఇటీవల బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ సైతం HoABLలో పెట్టుబడి పెట్టారు. 10,000 చదరపు అడుగుల ల్యాండ్ కొని.. తనలాగే ల్యాండ్‌ను కొనుగోలు చేయాలని అనుకుంటున్న ఎంతోమందికి ఉదాహరణగా నిలిచారు. HoABL చేపట్టిన మునుపటి ప్రాజెక్ట్స్‌లో కూడా అమితాబ్ పెట్టుబడులు పెట్టారు. అయోధ్యలోని ది సరయు ప్రాజెక్ట్‌లో కూడా ఆయన ల్యాండ్ కొనుగోలు చేశారు. తమ సంపాదనతో సౌకర్యవంతమైన ఇల్లు కట్టడం, లగ్జరీ కార్లు కొనడం.. ఇవన్నీ సినీ సెలబ్రిటీలు తరచుగా చేసేది. కానీ HoABL లాంటి ప్రాజెక్ట్స్ వల్ల తమ సంపాదనను రియల్ ఎస్టేట్‌లో కూడా పెట్టుబడి పెట్టాలని చాలామంది బాలీవుడ్ సెలబ్రిటీలు ముందుకొస్తున్నారు.



Also Read: ఆ తప్పు మళ్లీ చేయాలనుకోవడం లేదు, ఎదిగేందుకు షార్ట్ కట్స్ ఉన్నాయి: క్యాస్టింగ్ కౌచ్‌పై ఎస్తర్ కామెంట్స్