Ester Noronha: ఆ తప్పు మళ్లీ చేయాలనుకోవడం లేదు, ఎదిగేందుకు షార్ట్ కట్స్ ఉన్నాయి: క్యాస్టింగ్ కౌచ్‌పై ఎస్తర్ కామెంట్స్

Ester Noronha: టాలీవుడ్ సింగర్ నోయెల్ మాజీ భార్య ఎస్తర్ నోరోన్హా ఇప్పటికే ఇండస్ట్రీపై పలు కాంట్రవర్షియల్ స్టేట్‌మెంట్స్ చేసింది. తాజాగా మరోసారి క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని గుర్తుచేసుకుంది.

Continues below advertisement

Ester Noronha About Casting Couch: సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అనేది కామన్‌గా ఉన్న సమస్య అని ఇప్పటికే ఎంతోమంది నటీమణులు బయటపెట్టారు. కొంతమంది తాము అలాంటి ఎక్స్‌పీరియన్స్ ఏదీ ఎదుర్కోలేదు అని చెప్పగా.. మరికొందరు మాత్రం దీని గురించి ఓపెన్‌గానే కామెంట్స్ చేశారు. అలా కామెంట్స్ చేసినవారిలో సింగర్ నోయెల్ భార్య ఎస్తర్ నోరాన్హా కూడా ఒకరు. ఇప్పటికే తనకు క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలు ఎదురయ్యాయని ఓపెన్‌గా చెప్పిన ఎస్తర్.. మరోసారి దాని గురించి స్పందించింది. అంతే కాకుండా రెమ్యునరేషన్ తక్కువ అయినా కూడా తనకు నచ్చిన కథల్లో నటిస్తానని స్టేట్‌మెంట్ కూడా ఇచ్చింది.

Continues below advertisement

సమాజంలో ఉంది..

‘‘ఇండస్ట్రీ అనేది సమాజంలో ఒక భాగమే. బయట సమాజంలో కూడా వేధింపులు అనేవి ఉన్నాయి. ఇప్పుడు మనం మహిళా సాధికరత కోసం కష్టపడుతున్నాం. కానీ ఇంకా ప్రతీ రంగంలో మహిళలపై జరిగే అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయి. ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీలో అలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. ఎందుకంటే ఇండస్ట్రీలో ఇలాంటివి చేయడానికి అవకాశాలు ఎక్కువ. దాన్ని మనం దూరం చేయలేం. అమ్మాయిలు అందంగా, ఎన్నో ఆశలతో, ఇండస్ట్రీలో ఏదో సాధించాలని వస్తే కచ్చితంగా అడ్వాంటేజ్ తీసుకోవాలి అనుకునే మనుషులు ఉన్నారు. ఎవరూ దానిగురించి బలవంతపెట్టరు. కానీ ఆ ఛాయిస్ అయితే ఉంది. అవకాశాల కోసం నువ్వు ఏం చేయగలుగుతావు అనే చూస్తారు’’ అని ఇండస్ట్రీలో పరిస్థితుల గురించి చెప్పుకొచ్చింది ఎస్తర్.

అది షార్ట్‌కట్..

‘‘నేను అలా చేయలేను, నా దారిలో నేను వెళ్తాను అంటే ఎవరూ బలవంతపెట్టరు. నాకు తొందరగా పెద్ద స్టార్ అవ్వాలని ఉంది ఏం చెప్పినా చేస్తాను అనుకునేవాళ్లు కూడా ఉంటారు. షార్ట్‌కట్ ఉంది, హార్డ్ వర్క్ ఉంది’’ అంటూ ఎవరి ఇష్టం వాళ్లది అని తెలిపింది ఎస్తర్ నోరోన్హా. తనకు ఎదురైన అనుభవాల గురించి మాట్లాడుతూ.. ‘‘నన్ను ఎవరూ డైరెక్ట్‌గా వచ్చి అడగలేదు. అసలు ఎవరికి కావాలి అని కూడా తెలియదు. వాళ్ల ఐడెంటిటీ తెలియకుండా ఇన్‌డైరెక్ట్‌గా మ్యానేజర్స్‌తో అడిగించారు. ఇలా ఉంటే వర్కవుట్ అవ్వదు, ఫ్రెండ్లీగా ఉండాలి, అమ్మాయిలాగా ప్రవర్తించట్లేదు అన్నారు. అలా అయితే నాకు అవసరం లేదని చెప్పాను’’ అని గుర్తుచేసుకుంది ఎస్తర్.

ప్రపోజల్స్ వస్తున్నాయి..

‘‘నేను ఒక ఆర్టిస్ట్‌ను. నేను దానికి ఒప్పుకుంటే ఇన్నిసార్లు నాకు నేర్పించిన గురువుకు విలువ లేకుండాపోతుంది, అమ్మకానికి పెట్టినట్టు ఉంటుంది. ఒక ఆర్టిస్ట్‌గా నేను స్టేజ్ షోలు చేస్తున్నాను. నాకంటూ వేరే కెరీర్ ఉంది. కానీ నాకు యాక్టింగ్ చేయడంలో, పాటలు పాడడంలో సంతోషం వస్తుంది. ఇంట్లో కూర్చొని పాటలు పాడిన నాకు సంతోషమే. నాకు సినిమాలు చేయడం ఇష్టమే. కానీ దానికోసం నా ఆత్మభిమానాన్ని పక్కన పెట్టలేను’’ అంటూ క్యాస్టింగ్ కౌచ్‌పై తన రియాక్షన్ గురించి చెప్పింది ఎస్తర్. పెళ్లయ్యి, విడాకులు అయిన తర్వాత తనకు చాలా ప్రపోజల్స్ వస్తున్నాయని, కానీ పర్సనల్ లైఫ్ విషయంలో తను మరికాస్త సమయం తీసుకోవాలని, చేసిన తప్పు మళ్లీ చేయాలని అనుకోవడం లేదని క్లారిటీ ఇచ్చింది ఎస్తర్ నోరోన్హా.

Also Read: రాజ్‌ తరుణ్‌-లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్‌  - హీరోయిన్‌ మాల్వీ మల్హోత్రాపై కూడా కేసు.. ఏ1గా రాజ్‌, ఏ2గా మాల్వీ

Continues below advertisement
Sponsored Links by Taboola